యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) ఒకటి. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. గతంలో వచ్చిన ‘పుష్ప’ (Pushpa : The Rise) సెన్సేషనల్ హిట్ కావడంతో ‘పుష్ప 2’ పై భారీగా బజ్ ఏర్పడింది. ఈ చిత్రం ఆగస్టు 15న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుండటంతో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయగా.. రెండో పాటను నెలాఖరులో రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ‘పుష్ప 2’కు కొనసాగింపుగా మూడో పార్ట్ కూడా ఉండనున్నట్లు హీరో బన్నీ గతంలోనే హింట్ ఇచ్చాడు. తాజాగా థర్డ్ పార్ట్‌కు సంబంధించి ఓ బజ్ వైరల్ అవుతోంది. దీనిపై ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు.
కొంత కాలం ఆగాల్సిందేె!
‘పుష్ప 3’ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం.. మూడో పార్ట్‌కి కొంత కాలం పాటు బ్రేక్ ఇవ్వాలని డైరెక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ గ్యాప్‌లో సుకుమార్ రెండు చిత్రాలు.. బన్నీ రెండు చిత్రాలు (విడివిడిగా) చేయాలని భావిస్తున్నారట. అటు నిర్మాణ సంస్థ కూడా ఇందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం ‘పుష్ప 2’ విడుదలైన రెండు, మూడేళ్ల వరకూ ‘పుష్ప 3’ ప్రాజెక్ట్ పట్టాలెక్కే పరిస్థితులు ఉండవని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దేశంలో పుష్ప మేనియా ఉన్నప్పుడే మూడో పార్ట్ కూడా పట్టాలెక్కిస్తే బాగుటుందని సూచిస్తున్నారు.
రెండ్రోజుల్లో సెకండ్ సాంగ్
పుష్ప 2లోని రెండో పాటను మే 29న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తాజా ప్రోమోలో స్పష్టం చేశారు. ఆ రోజు ఉ.11.07 గం.లకు పూర్తి లిరికల్ వీడియోను విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ‘సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అంటూ హీరోయిన్ రష్మిక ఈ పాటపై అంచనాలు పెంచేసింది. ఇది బన్నీ, రష్మిక మధ్య సాగే మెలోడీ సాంగ్. గతంలో పుష్ప సినిమాలో వచ్చిన ‘సామి.. సామి’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. దీంతో సెకండ్ సింగిల్ కూడా ఆ స్థాయిలోనే అలరిస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఆ పాట కోసం బన్నీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
షూటింగ్ దాదాపుగా పూర్తి
పుష్ప 2 సినిమా దాదాపుగా పూర్తైనట్లు తెలుస్తోంది. ఫహాద్ ఫాజిల్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలతో పాటు ఒక పాట చిత్రీకరించడం బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. అది కూడా ఐటెం సాంగ్ అని అంటున్నారు. ఈ సాంగ్ కోసం యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రి పేరును చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. సాంగ్ కోసం చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించగా తృప్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేస్తుందని అంటున్నారు. పుష్పలో ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ అంటూ సమంత చేసిన మ్యాజిక్‌ను తృప్తి రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. బన్నీ, తృప్తి కలిసి స్టెప్పులేస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయని కామెంట్స్ చేస్తున్నారు.
ఆ రోజు ఫ్యాన్స్‌కు పూనకాలే!
భారీ ఎత్తున నిర్మిస్తున్న ‘పుష్ప 2’ చిత్రంలో అల్లు అర్జున్‌కు ప్రత్యర్థిగా మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahad Fazil) నటిస్తున్నారు. అనసూయ, ధనుంజయ్, సునీల్, రావు రమేశ్, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ రూపొందిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే వదిలిన అప్ డేట్స్ అన్నీ కూడా సినిమాపై ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేశాయి. ఈ మూవీ రిలీజ్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 15 ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: రౌడీ బాయ్‌ను మళ్లీ గెలికిన అనసూయ! దూరపు కొండలు అంటూ..