• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Raj Tarun: ఆ అమ్మాయితో 3 ఏళ్లు ఒకే రూమ్‌లో ఉన్నా… తన అఫైర్‌పై స్పందించిన రాజ్‌ తరుణ్

  టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న యంగ్‌ హీరోల్లో రాజ్‌ తరుణ్‌ ఒకరు. తొలి చిత్రం ‘ఉయ్యాల జంపాల’ (Uyyala Jampala) తో మంచి సక్సెస్‌ అందుకున్న రాజ్‌తరుణ్‌.. ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి 21 ఎఫ్‌’ సినిమాలతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ సంపాదించాడు. ఆ తర్వాత కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల వరుసగా ఫ్లాపులను చవిచూశాడు. ఇదిలా ఉంటే తాజాగా రాజ్‌తరుణ్‌పై అతడి ప్రేయసి సంచలన ఆరోపణలు చేసింది. తనను మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై రాజ్‌ తరుణ్‌ కూడా ఘాటుగా స్పందించడంతో.. ఈ వ్యవహారం టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌గా మారిపోయింది. 

  ‘ఆ హీరోయిన్‌తో ఎఫైర్‌’

  సినీ నటుడు రాజ్‌ తరుణ్‌ (Raj Tarun) తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రాజ్‌తరుణ్‌, తాను 2012 నుంచి రిలేషన్‌లో ఉన్నామని ఇటీవల ఒక హీరోయిన్‌తో అతను సన్నిహితంగా ఉన్నట్టు తెలిసిందని ఫిర్యాదులో పేర్కొంది. ‘తిరగబడర సామీ’ సినిమా షూటింగ్‌ జరిగినప్పటి నుంచి ఈ రిలేషన్‌ కొనసాగిస్తున్నట్టు ఆరోపించింది. ఇదే విషయమై రాజ్‌తరుణ్‌ను నిలదీస్తే తనని దుర్భాషలాడాడని తెలిపింది. తనను సంబంధం లేని కేసు (డ్రగ్స్‌)లో ఇరికించడంతో తాను 43 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని పేర్కొంది. ఫిర్యాదును స్వీకరించిన నార్సింగి పోలీసులు.. దీనిపై దర్యాప్తు చేయనున్నట్లు స్పష్టం చేశారు. అయితే రాజ్‌తరణ్‌ ఎఫైర్‌లో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న నటి హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా అని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ‘తిరగబడర సామీ’లో ఈ భామే కథానాయికగా చేస్తుండటమే ఇందుకు కారణమని అంటున్నారు. 

  అది నిజం కాదు: రాజ్‌ తరుణ్‌

  మాజీ ప్రేయసి లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై నటుడు రాజ్‌ తరుణ్‌ స్పందించారు. ఓ ఛానల్‌తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను షార్ట్‌ఫిల్మ్స్‌ చేసే సమయంలో ఆమెతో పరిచయం ఏర్పడింది. మంచి అమ్మాయే. నేను హైదరాబాద్‌ వచ్చిన కొత్తలో సాయం చేసింది. మేం రిలేషన్‌షిప్‌లో ఉన్నామన్నది వాస్తవమే. 2014 నుంచి 2017 వరకు కలిసున్నాం. ఆ తర్వాత మా మధ్య ఎలాంటి సంబంధంలేదు. ఆమె ఫ్రెండ్స్‌ సర్కిల్‌, తను డ్రగ్స్ తీసుకోవడం చూసి తట్టుకోలేకపోయా. వదిలేసి వెళ్లిపోదామనుకుంటే.. మీడియా ముందుకెళ్తానని నన్ను బెదిరించేది. నా పరువుకు భంగం కలగకుండా ఉండేందుకు భరిస్తూ వచ్చా. ఆమెపై డ్రగ్స్‌ కేసు నమోదవగా దానికి నేనే కారణమని ఆరోపణలు చేస్తోంది’ అని మండిపడ్డారు. 

  ‘మరో అబ్బాయితో నా ఇంట్లోనే ఉంది’

  ఎక్స్‌ గర్ల్‌ఫ్రెండ్‌ లావణ్యపై రాజ్‌తరుణ్‌ సంచలన ఆరోపణలు చేశాడు. తాను ఉండగానే ఆమె మరో యువకుడితో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నాడు. ‘మరో అబ్బాయితో ఆమె రిలేషన్‌ కొనసాగించింది. రోజూ కొడుతున్నాడంటూ ఆ వ్యక్తిపైనా కేసు పెట్టింది. మళ్లీ అతడితో కలిసి నా ఇంట్లోనే కొన్నాళ్లు ఉంది. నేనే బయటకు వచ్చేశా. తన తండ్రినీ బ్లాక్‌ మెయిల్‌ చేసింది. మాకు పెళ్లి కాలేదు. జీవితంలో నేను పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్‌ అయిన సంగతి ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు. ఆమెకూ ఆ విషయం తెలుసు. ముంబయికి చెందిన నటితో సహజీవనం చేస్తున్నట్టు ఆమె ఆరోపిస్తోంది. నేను హైదరాబాద్‌లో ఉంటున్నా. ఆమె ముంబయిలో నివాసముంటోంది. మేం సహజీవనం ఎలా చేస్తాం? తనను ఇంట్లోంచి నేను పంపించేస్తానన్న భయంతో ఇదంతా చేస్తోంది’ అని రాజ్‌తరుణ్‌ ఆరోపించాడు. 

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv