ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh).. మరోమారు హాట్ లుక్స్‌తో సోషల్ మీడియాను హీటెక్కించింది.
టీషర్ట్, బ్లూ జీన్స్ ధరించి సొగసైన నడుము అందాలతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. టీ షర్ట్ పైకి లేపుతూ కుర్రకారును రెచ్చగొట్టింది.
ప్రస్తుతం రకుల్ షేర్ చేసిన నావెల్ షో పిక్స్.. నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను ఫ్యాన్స్ విపరీతంగా షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.
హీరోయిన్‌గా రకుల్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ తొలినాళ్లలోనే టాప్ చిత్రాలతో ఆకట్టుకుంది.
టాలీవుడ్‌లో రకూల్ తక్కువ సమయంలోనే రామ్‌చరణ్, అల్లు అర్జున్, తారక్, గోపిచంద్, రామ్ పోతినేని, సాయిధరమ్ తేజ్ లాంటి స్టార్ హీరోలతో జతకట్టింది.
‘గిల్లీ’ (Gilli) అనే కన్నడ చిత్రం ద్వారా రకుల్ సినీరంగంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడంతో రకుల్‌కు పెద్దగా గుర్తింపు రాలేదు.
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ (Venkatadri Express) ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్.. ఆ సినిమా హిట్‌తో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.
‘లౌక్యం’, ‘కరెంట్ తీగ’, ‘పండగ చేస్కో’, ‘కిక్ 2’, ‘బ్రూస్‌లీ’ వంటి వరుస సినిమాల్లో రకూల్ నటించింది. అయితే అవి పెద్దగా హిట్ కాకపోవడంతో రకుల్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది.
అయితే, ఆ తర్వాత వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’, ‘సరైనోడు’, ‘ధ్రువ’ వంటి సినిమాలు సూపర్ హిట్ సాధించడంతో టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరిగా రకుల్ గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం బాలీవుడ్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టిన రకుల్.. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తోంది.
‘కట్‌పుట్‌లి’, ‘డాక్టర్ G’, ‘థ్యాంక్ గాడ్’, ‘ఛత్రివలి’ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.
ఈ ఏడాది ‘అయాలన్’ అనే తమిళ సైన్స్ ఫిక్షన్ చిత్రంతో రకూల్ ప్రేక్షకులమ ముందుకు వచ్చింది. అందులో తార పాత్రలో కనిపించి మంచి మార్కులు కొట్టేసింది.
ప్రస్తుతం రకుల్.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘ఇండియన్ 2’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది.
అలాగే ప్రస్తుతం రకుల్ చేతిలో రెండు హిందీ ప్రాజెక్టులు ఉన్నాయి. మేరీ పత్నీ కా రమేక్, దే దే ప్యార్ దే 2 చిత్రాల్లో నటిస్తూ రకూల్ బిజీ బిజీగా ఉంటోంది.
ఇక రకుల్ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆమె బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ పెళ్లి చేసుకుంది. 2021 నుంచి రిలేషన్‌లో ఉన్న ఈ జంట.. బంధు మిత్రుల సమక్షంలో 21 ఫిబ్రవరి 2024న ఒక్కటయ్యింది.
రకూల్ ఓ వైపు వరుస చిత్రాల్లో నటిస్తూనే.. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటోంది. తన గ్లామర్ ఫొటోలను వరుసగా షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 23.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.