నేచురల్ బ్యూటీ సాయిపల్లవి (Sai Pallavi) నటించిన లేటెస్ట్ చిత్రం ’అమరన్’ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్మీ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ ప్రమోషన్స్‌లో సాయి పల్లవి బిజీ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు ఆమెను టార్గెట్ చేస్తున్నారు. సినిమాల నుంచి సాయిపల్లవిని బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. #BoycottSaiPallavi హ్యాష్‌ట్యాగ్‌ను నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్ చేస్తున్నారు. భారత సైన్యాన్ని కించపరిచిందంటూ గతంలో ఆమె చేసిన వ్యాఖ్యల వీడియోను గత మూడ్రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
అసలేం జరిగిదంటే?
‘అమరన్’ చిత్రం ఆర్మీ నేపథ్యంలో రూపొందిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో భారత ఆర్మీపై సాయిపల్లవి (Sai Pallavi) చేసిన వివాదస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. విరాటపర్వం మూవీ ప్రమోషన్ సమయంలో సాయి పల్లవి ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఉగ్రవాదం, హింస అంశాల గురించి ప్రస్తావిస్తూ ‘పాకిస్థాన్ సైనికులను మన భారతీయులం ఉగ్రవాదుల్లా చూస్తాం. అలాగే పాకిస్థాన్‌లో ఉంటున్న వారు మన భారత సైనికులను ఉగ్రవాదుల్లా చూస్తారు. వాళ్లకు మనం చేటు చేస్తామని అనుకుంటుంటారు. సమస్యల పరిష్కారానికి హింస ఏ మాత్రం పరిష్కారం కాదు కదా. ఒకప్పుడు చట్టం లేకపోవడంతో యుద్దాలు చేశారు. ఇప్పుడు ఆ అవసరం లేదు’ అని ఆమె అన్నారు. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
బాయ్‌కాట్ చేయాలని డిమాండ్
భారత సైన్యంతో పాటు సనాతన ధర్మాన్ని కూడా కించపరిచారంటూ అదే ఇంటర్వూలో సాయిపల్లవి (Sai Pallavi) మాట్లాడిన వీడియోను సైతం నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ప్రతీ ఒక్కరూ సాయిపల్లవి చిత్రాలను బహిష్కరించాలను సోషల్ మీడియా వేదికగా క్యాంపైన్ నడుపుతున్నారు. జాతీయ వాద, సనాతన భావాలు కలిగిన వారు నూటికి నూరు శాతం సాయి పల్లవి చిత్రాలను బాయ్‌కాట్ చేయాలని ఓ నెటిజన్ పిలుపునిచ్చారు. సాయిపల్లవి పాక్‌కు అనుకూలంగా స్టాండ్ తీసుకున్నప్పుడు అక్కడే సినిమాలు చేసుకోవచ్చు కదా అని సూచిస్తున్నారు. ఆమె అసలు నేషనల్ క్రష్ కానేకాదని మరో విధమైన క్రష్ అంటూ ఘాటు పదజాలంతో విమర్శిస్తున్నారు. సాయిపల్లవితో పాటు ఆమె లేటెస్ట్ చిత్రం ‘అమరన్’ను కూడా బహిష్కరించాలని ఓ నెటిజన్ డిమాండ్ చేశాడు. అంతేకాదు హిందీలో తెరకెక్కుతోన్న ‘రామాయణ’ చిత్రంలో సీతగా ఆమెను తీసివేయాలని కోరారు. సనాతన ధర్మం గురించి కించపరుస్తూ మాట్లాడే వారిని కఠినంగా శిక్షించాలని మరో నెటిజన్ డిమాండ్ చేశారు. మరోవైపు సాయిపల్లవి ఫ్యాన్స్ దీటుగా బదులిస్తున్నారు. ఆమె మాటలను వక్రీకరించి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని తిప్పికొడుతున్నారు.
సాయిపల్లవి ఎమోషనల్ పోస్టు
ఇదిలా ఉంటే అమరన్ ప్రమోషన్స్‌లో భాగంగా నటి సాయిపల్లవి (Sai Pallavi) ఇటీవల నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించింది. దేశం కోసం మరణించిన సైనికులకు నివాళులు అర్పించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. వాటికి ఎమోషనల్ పదాలను సైతం సాయిపల్లవి జోడించింది. ‘నేను అమరన్ ప్రమోషన్స్ మొదలుపెట్టే ముందు నేషనల్ వార్ మెమోరియల్ సందర్శించాలి అనుకున్నా. కొన్ని రోజుల క్రితం వెళ్ళాను. మన కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల గురించి వివరాలు ఉంచే పవిత్రమైన ఆలయం ఇది. మేజర్ ముకుంద్ వరదరాజన్, సిపాయి విక్రమ్ సింగ్ (Vikram Singh)లకు నివాళులు అర్పిస్తున్నప్పుడు నేను చాలా ఎమోషనల్ అయ్యాను’ అని రాసుకొచ్చింది.
కావాలనే టార్గెట్ చేస్తున్నారా?
‘అమరన్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్గా సాయి పల్లవి (Sai Pallavi) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ నుంచి ఓ వ్యక్తి వచ్చి పీఆర్ ఏజెన్సీ తరపున తన ఇమేజ్ను మరింత పెంచుతానని అన్నారని తెలిపింది. అయితే దానిని తాను రిజక్ట్ చేశానని ఆమె చెప్పారు. అలాంటి అవసరం తనకు లేదని చెప్పినట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు వారే సాయి పల్లవిని టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ‘రామాయణం’ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో సాయిపల్లవి పేరును డ్యామేజ్ చేసేందుకు వారు యత్నిస్తున్నట్లు టాక్. సీత పాత్ర నుంచి సాయి పల్లవిని తొలగించాలని కూడా వారే పెద్ద ఎత్తున కామెంట్స్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా కావాలనే బాలీవుడ్ పీఆర్ టీమ్ సాయి పల్లవిని టార్గెట్ చేశారని ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
అమర జవాన్ బయోగ్రఫీ
శివ కార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి రూపొందించిన చిత్రం ‘అమరన్’ (Amaran). సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్. దీపావళిని పురస్కరించుకుని ఈ నెల 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాకిస్థాన్ ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన అమర జవాన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. నటుడు శివకార్తికేయన్ ముకుంద్ పాత్ర పోషించగా, సాయిపల్లవి ఆయన భార్య ఇందు రెబెకా వర్గీస్ రోల్లో పోషించింది. తెలుగు, తమిళంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. పూర్తిగా భావోద్వేగాలతో నిండిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం