నటీనటులు : నాని, ప్రియాంక అరుళ్ మోహన్, ఎస్.జే. సూర్య, సాయికుమార్, శుభలేఖ సుధాకర్, అభిరామి, అదితి బాలన్, మురళి శర్మ, అజయ్ తదితరులు
డైరెక్టర్ : వివేక్ ఆత్రేయ
సంగీతం : జేక్స్ బేజోయ్
ఎడిటర్ : కార్తిక శ్రీనివాస్
నిర్మాతలు : డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి
విడుదల తేదీ : 29-08-2024
నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరోగా రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం‘ (Saripodhaa Sanivaram Movie Review). వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియాంక అరుళ్ మోహన్ చేసింది. ప్రముఖ తమిళ నటుడు ఎస్.జే. సూర్య ఇందులో ప్రతినాయకుడి పాత్ర చేశారు. ఇప్పటివరకూ ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికి’ వంటి క్లాస్ సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈసారి ఊర మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన శైలికి భిన్నంగా పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారాన్ని రూపొందించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఈ క్రమంలో ఆగస్టు 29న ఈ చిత్రంలో వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? నాని నటన మెప్పించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
సూర్య (నాని) ఎల్‌ఐసీ ఎజెంట్‌గా పనిచేస్తుంటాడు. కళ్లెదుట అన్యాయం జరిగితే అసలు సహించలేడు. తన కోపాన్ని ప్రదర్శించడానికి శనివారాన్ని సూర్య ఎంచుకుంటాడు. మరోవైపు సోకులపాలెం ప్రాంతంలోని ప్రజలు కష్టాలు అనుభవిస్తుంటారు. పోలీసు ఆఫీసర్ దయా (ఎస్.జే సూర్య) వారిని హింసిస్తుంటాడు. తన అధికార బలంతో చిత్ర హింసలకు గురిచేస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హీరో సోకులపాలెం ప్రజలకు అండగా నిలవాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత క్రూరమైన పోలీసు అధికారిని సూర్య ఎలా ఎదిరించాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? హీరో శనివారమే విజృంభించడానికి కారణమేంటి? హీరోయిన్ ప్రియాంక మోహన్‌తో అతడి లవ్ ట్రాక్ ఏంటి? హీరో-విలన్ మధ్య జరిగిన నువ్వా నేనా పోటీలో ఎవరు గెలిచారు? అన్నది స్టోరీ. (Saripodhaa Sanivaram Movie Review)
ఎవరెలా చేశారంటే
సూర్య పాత్రలో హీరో నాని ఇరగదీశాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో విశ్వరూపం చూపించాడు. గత సినిమాలకు భిన్నంగా ఇందులో నాని నటన ఉంటుంది. యాక్షన్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాల్లోనూ నాని తనదైన మార్క్ చూపించి ఆకట్టుకున్నాడు. ఇక నానికి ప్రత్యర్థిగా ఎస్.జే. సూర్య అదరగొట్టాడని చెప్పవచ్చు. కొన్ని సన్నివేశాల్లో నాని సైతం తన నటనతో ఎస్.జే సూర్య డామినేట్ చేశారు. వీరిద్దరి నటనే సినిమాకు హైలెట్‌గా నిలిచిందని చెప్పవచ్చు. ఇక లేడీ కానిస్టేబుల్ పాత్రలో ప్రియాంక అరుళ్ మోహన్ సెటిల్డ్‌గా నటించింది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించి ఆమె ఆకట్టుకుంది. నాని-ప్రియాంక మధ్య వచ్చే డిఫరెంట్ లవ్ ట్రాక్ ఆడియన్స్‌కు నచ్చుతుంది. సాయికుమార్, అజయ్, మురళీ శర్మలతో పాటు ఇతర నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికి’ చిత్రాలతో క్లాసిక్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన వివేక్ ఆత్రేయ తనలోని ఊర మాస్‌ను ఈ చిత్రం ద్వారా పరిచయం చేశారు. తన శైలికి భిన్నంగా అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో సినిమాను రూపొందించి ప్రశంసలు అందుకుంటున్నాడు. రొటిన్ స్టోరీనే తీసుకున్నప్పటికీ తనదైన మేకింగ్‌తో వివేక్ మెస్మరైజ్ చేశాడు. ఫస్టాఫ్‌లో చాలా వరకు పాత్రల పరిచయానికే దర్శకుడు తీసుకున్నాడు. హీరో నాని బాల్యం, శనివారం కాన్సెప్ట్, హీరోయిన్‌తో పరిచయం, అదిరిపోయే ఇంటర్వెల్ బ్లాక్‌తో ఫస్టాఫ్‌ను ఎక్కడా బోర్ లేకుండా నడిపించాడు. ఇక సెకండాఫ్‌లో నాని, ఎస్.జే సూర్య మధ్య వచ్చే టామ్ అండ్ జెర్రీ సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్‌తో నింపేశాడు. అయితే నిడివి ఎక్కువగా ఉండటం సినిమాపై నెగిటివ్ ప్రభావం చూపించింది. కొన్ని సన్నివేశాలు మరి సాగదీతగా అనిపిస్తాయి. నాని పాత్ర పరిచయానికి కూడా ఎక్కువ టైమ్ తీసుకున్నట్లు అనిపిస్తుంది. పెద్దగా మలుపులు లేకపోవడం, కమర్షియల్ హంగులు మిస్సవడం, ప్రిడిక్టబుల్‌గా స్టోరీ ఉండటం మైనస్‌లుగా చెప్పవచ్చు.
సాంకేతికంగా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే జేక్స్ బేజోయ్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. పాటలు వినసొంపుగా ఉన్నాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం ఈ సినిమాకు అదనపు బలంగా మారింది. యాక్షన్ సీక్వెన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించింది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- నాని, ఎస్.జే. సూర్య నటన
- యాక్షన్ సీక్వెన్స్
- ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్స్
మైనస్ పాయింట్స్
- సుదీర్ఘమైన నిడివి
- ట్విస్టులు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 3/5
‘సరిపోదా శనివారం’పై పబ్లిక్ టాక్
సరిపోదా శనివారం చిత్రాన్ని చూసిన నెటిజన్లు ఎక్స్ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎక్కువ మంది ఈ సినిమా అద్భుతంగా ఉందని పోస్టులు పెట్టడం విశేషం. ముఖ్యంగా నాని, ఎస్.జే. సూర్య నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని అంటున్నారు. సోషల్ మీడియాలోని కొన్ని పోస్టుల ఆధారంగా పబ్లిక్ ఓపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సరిపోదా శనివారం చిత్రం సంతృప్తికరమైన యాక్షన్ డ్రామా అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు. ఇంట్రడక్షన్ బ్లాక్, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ బ్లాక్, నాని – సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా వర్కౌట్ అయ్యాయని పోస్టు పెట్టాడు.
డైరెక్టర్ వివేక్ ఆత్రేయ స్క్రీన్‌ప్లే అంత గొప్పగా ఏమీ లేదని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. అయితే ఎస్.జే. సూర్య, నానిల కోసం ఈ సినిమాను థియేటర్లో చూడాల్సిందేనని పేర్కొన్నాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందని, పోతారు మెుత్తం పోతారు అంటూ చెప్పుకొచ్చారు. ఇక సెకండాఫ్ కాస్త బోర్‌గా అనిపించినా మాస్ ఆడియన్స్‌ను పక్కాగా ఎంటర్‌టైన్ చేస్తుందని ప్రశంసించాడు.
ఈ సినిమాకు నేపథ్య సంగీతం బాగా ప్లస్ అయ్యిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌ను BGM ఎక్కడికో తీసుకెళ్లిపోయిందంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే బీజీఎం ర్యాంప్ అంటూ ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు.
సరిపోదా శనివారానికి తనదైన శైలిలో రివ్యూ చెబుతూ ఓ నెటిజన్ 3/5 రేటింగ్ ఇచ్చాడు. పాత్రల పరిచయం, డిజైన్ చాలా బాగుందంటూ చెప్పుకొచ్చాడు. తర్వాతి సీన్లను ముందుగానే ఊహించగలగడం, పెద్దగా మలుపులు లేకపోవడం కాస్త డ్రా బ్యాక్‌గా నిలిచిందని రాసుకొచ్చాడు.
సోషల్ మీడియా అంతా ‘సరిపోదా శనివారం’ పాజిటివ్ రివ్యూలతో హోరెత్తుతుంటే అక్కడక్కడా నెగిటివ్ రివ్యూలు సైతం కనబడుతున్నాయి. ఫస్టాఫ్ మీద పెట్టిన కాన్సంట్రేషన్ సెకండాఫ్ మీద పెట్టి ఉంటే వంద కోట్ల మూవీ అయ్యేదని ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు.
నిడివి ఎక్కువగా ఉండటం సినిమాకు మైనస్‌గా మారిందని మరికొందరు అంటున్నారు. 30 నిమిషాల నిడివిని ట్రిమ్ చేయటం అవసరమని ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు. బోరింగ్ మసాలా సీన్స్, సాగదీత సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి 2/5 రేటింగ్ మాత్రమే ఇచ్చాడు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్