ఆకాశం నీ హద్దురా ఫేం హీరోయిన్ అపర్ణ బాలమురళి పట్ల ఓ అభిమాని అసభ్యంగా ప్రవర్తించాడు. కేరళలోని ఓ లా కాలేజ్ ఈవెంట్‌లో ఆమె పాల్గొంది. వేదికపై కూర్చున్న ఆమెతో ఫొటో దిగేందుకు ఓ కాలేజ్ స్టూడెంట్ అపర్ణ వద్దకు వెళ్లాడు. ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఫొటో దిగేందుకు లేచిన అపర్ణ భుజంపై చెయ్యి వేసి దగ్గరకు లాక్కునుందుకే ప్రయత్నించాడు. ఒక్కసారిగా షాక్‌కు గురైన అపర్ణ అతని నుంచి దూరంగా జరిగింది. దీంతో స్టూడెంట్ సారీ చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.