తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) నటించి ‘కంగువా’ (Kanguva) రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. నవంబర్ 14న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండంతో నటుడు సూర్యతో పాటు కంగువా టీమ్ చురుగ్గా ప్రమోషన్ ఈవెంట్స్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి గతంలో సూర్యతో సినిమా చేయాలని భావించినట్లు పేర్కొన్నారు. దీంతో ఆ సినిమా ఏమై ఉంటుందా? అని అందరూ తెగ ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెట్టింట ఆసక్తికర చర్చ మెుదలైంది. గతంలో రాజమౌళి తీసిన ఆ బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని తొలుత సూర్యతోనే తీద్దామని అనుకున్నట్లు నెటిజన్లు అంచనా వేస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఆ మూవీ ఏదంటే?
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) కెరీర్‌లో ‘మగధీర’ (Magadheera) ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాతో చరణ్ క్రేజ్ తారాస్థాయికి చేరింది. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమాను తొలుత సూర్యతో చేయాలని జక్కన్న భావించినట్లు తెలుస్తోంది. ‘బాహుబలి’ చిత్రానికే సూర్యను తీసుకోవాలని భావించినట్లు స్ట్రాంగ్‌గా రూమర్లు వచ్చినా అందులో వాస్తవం లేదని చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్ కటౌన్‌ను చూసే ‘బాహుబలి’ స్టోరీ సిద్ధం చేసినట్లు రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే చాలా ఇంటర్వ్యూల్లో స్పష్టం చేశారు. కాబట్టి ‘మగధీర’ కోసమే రాజమౌళి సూర్యను సంప్రదించి ఉండొచ్చని అంటున్నారు. ‘కంగువా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సూర్య చేసిన ‘గజిని’ చిత్రాన్ని రాజమౌళి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ లెక్కన చూసినా ‘గజిని’ 2005లో రిలీజైంది. 2009లో మగధీర ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మగధీర చిత్రీకరణ మూడేళ్లపాటు జరిగింది కాబట్టి 2006 సమయంలోనే మగధీర స్క్రిప్ట్‌ను రాజమౌళి సిద్ధం చేశారు. ఈ లాజిక్స్ పరంగా చూస్తే ‘మగధీర’ సినిమానే సూర్య చేయాల్సిందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు.
అదే జరిగి ఉంటే?
ఒకవేళ నిజంగానే మగధీర చిత్రాన్ని గనుక రామ్‌చరణ్ చేయకుండా ఉండుంటే అతడి ఇంకోలా ఉండేదని చెప్పవచ్చు. ఎందుకంటే ‘మగధీర’ వంటి బ్లాక్ బాస్టర్ లేకుండా చరణ్ సినీ జీవితాన్ని ఊహించుకోలేము. తొలి చిత్రం ‘చిరుత’ ఓ మోస్తరు టాక్ తెచ్చుకోవడంతో ఫ్యాన్స్ దృష్టిలో చరణ్ పెద్దగా రిజిస్టర్ కాలేదు. ఆ తర్వాత చేసిన సెకండ్ ఫిల్మ్ ‘మగధీర’తోనే చిరు తనయుడిగా ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు చరణ్. మగధీర తర్వాత చాలా చిత్రాలే చేసినప్పటికీ ‘రంగస్థలం’ (2018) వరకూ సరైన బ్రేక్ రాలేదు. అప్పటివరకూ మగధీరతో వచ్చిన ఫేమ్‌తోనే చరణ్ నెట్టుకు వచ్చాడు. అటువంటి ‘మగధీర’ సినిమా చరణ్ కెరీర్‌లో లేకపోయి ఉంటే అతడి కెరీర్‌లో కచ్చితంగా డౌన్‌ఫాల్‌లో ఉండేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు మెగా ఫ్యాన్స్ సైతం బయటకు చెప్పకపోయిన ఇదే ఫీలింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
‘సూర్యతో చేసే ఛాన్స్ మిస్ అయ్యా’
కంగువా’ (Kanguva) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కోలీవుడ్ నటుడు సూర్య (Suriya)పై దర్శకుడు రాజమౌళి (Rajamouli) ప్రశంసలు కురిపించారు. ఆ నటుడి స్ఫూర్తితోనే పాన్ ఇండియా చిత్రాలను తెరకెక్కించానని తెలిపారు. తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేయడంలో సూర్యనే తనకు స్పూర్తి అని జక్కన్న అన్నారు. ‘గజిని’ చిత్ర సమయంలో ఆయన చేసిన ప్రచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లు చెప్పారు. వేరే చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు తెలుగువారికి ఎలా దగ్గర కాగలిగాడు? అనే దాన్న కేస్ స్టడీగా తీసుకోమని మన హీరోలు, నిర్మాతలకు చెప్పినట్లు తెలిపారు. అలా తన పాన్ ఇండియా మూవీ బాహుబలికి సూర్య ప్రేరణగా నిలిచాడని గుర్తుచేశారు. సూర్య సినిమా చేయాలనుకున్నామని కానీ అది కుదర్లేదని స్పష్టం చేశారు. సూర్యతో చేసే ఛాన్స్ తాను మిస్ అయ్యాయని పేర్కొన్నారు.
‘కథ చెప్పారు.. వర్కౌట్ కాలేదు’
తమిళ స్టార్ హీరో కార్తీ ఇటీవల ఓ ఇంటర్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సత్యం సుందరం’ ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ గౌతమ్ మీనన్‌తో కార్తీ ఇంటర్యూ చేశారు. ఇందులో సూర్య (Suriya), కార్తీ (Karthi) కలిసి నటించడంపై గౌతమ్ మీనన్ ప్రశ్నించగా గతంలో జరిగిన ఆసక్తికర విషయాన్ని కార్తీ పంచుకున్నాడు. ‘నేను కార్తిక్ కలిసి నటిస్తాం. అందుకు తగ్గ స్క్రిప్ట్ రావాలి. గతంలో రాజమౌళి సర్ మాకు ఒక కథ వినిపించారు. అది బాగానే ఉంది కానీ ఆ సినిమా వర్కౌట్ కాలేదు’ అని తెలిపాడు. ఇది విన్న సినీ లవర్స్ ఆశ్చర్యపోయారు. రాజమౌళి కథ చెబితే ఎలా వదులుకున్నారంటూ ప్రశ్నించారు. ఆ సినిమా పట్టాలెక్కి ఉంటే సూర్య, కార్తీ రేంజ్ మరోలా ఉండేదని అంచనా వేస్తున్నారు.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ