• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అమిత్ షాతో నారా లోకేశ్ భేటీ

  టీడీపీ నేత నారా లోకేశ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి ఢిల్లీలో ఉంటున్న లోకేశ్ ఇప్పుడు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో కలిసి అమిత్ షాను కలవడంపై చర్చ జరుగుతోంది. తన తండ్రి అరెస్ట్, కోర్టుల్లో జరుగుతున్న విచారణ గురించి అమిత్ షాకు వివరించినట్లు లోకేశ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం చంద్రబాబును జైలుకు పంపించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

  అమిత్‌ షా అన్నీ అబద్దాలే: కేటీఆర్

  కేంద్ర మంత్రి అమిత్‌ షాకి తెలంగాణలో గుణపాఠం తప్పదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అమిత్‌ షా ప్రసంగమంతా అబద్ధాలేనని మండిపడ్డారు. బీజేపీకి మళ్లీ భాజపాకు 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు ఖాయమన్నారు. పదేళ్లలో బీజేపీ రాష్ట్రానికి ఒక్క విద్యా సంస్థ కూడా ఇవ్వలేదన్నారు. బీజేపీ స్టీరింగ్‌ అదానీ చేతుల్లో ఉందని కేటీఆర్ విమర్శించారు.

  రాబోయేది డబుల్ ఇంజిన్ సర్కారే: అమిత్ షా

  డిసెంబర్ 3వ తర్వాత తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని కేంద్రమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణలో గిరిజన వర్సిటీ ఆలస్యానికి కేసీఆర్ కారణమని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 9 ఏళ్లు అధికారంలో ఉన్నా పేదల సమస్యలు తీర్చలేదని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించిందని పేర్కొన్నారు. 9ఏళ్లుగా మోదీ సర్కారుపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రావని అమిత్‌ షా స్పష్టం చేశారు.

  39 మందితో బీజేపీ తొలి జాబితా

  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ఆ పార్టీ హైకమాండ్‌కు చేరింది. దీని ఆధారంగా ఈనెల 14 తర్వాత 39 మందితో కూడిన జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసి నియోజకవర్గంలో యాక్టీవ్‌గా ఉన్న వారికి తొలి జాబితాలో చోటు కల్పించినట్లు తెలుస్తోంది. కాగా, రేపు అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్, రాజేంద్రనగర్‌లో సభలు నిర్వహించాల్సి ఉండగా.. ఆదిలాబాద్ సభ మాత్రమే నిర్వహిస్తున్నారు. ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు.

  అమిత్‌షాతో పురందేశ్వరి భేటి

  కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఏపీ భాజపా చీఫ్‌ పురందేశ్వరి భేటి అయ్యారు. ఏపీలో గత నాలుగున్నరేళ్లలో మద్యం విధానంలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. మద్యం కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన విషయాలపై హోం మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఓ మద్యం దుకాణంలో రూ.లక్ష వరకూ విక్రయాలు జరగ్గా.. కేవలం రూ.700కు మాత్రమే డిజిటల్‌ చెల్లింపులు జరిగాయని ఇటీవల పురందేశ్వరి ఆరోపించారు. మద్యం ద్వారా వచ్చిన నగదు వైకాపా నేతల జేబుల్లోకి వెళ్తున్నాయని విమర్శించారు.

  ఈ నెల 10న తెలంగాణకు అమిత్ షా

  కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 10న తెలంగాణ రానున్నారు. ఆయన ఒకే రోజు రెండు సభల్లో పాల్గొంటారని బీజేపీ నేతలు తెలిపారు. 10న ఉదయం ఆదిలాబాద్‌లో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడలో జరిగే భారీ బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు. త్వరలో తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి.

  జై షాను మందలించిన అమిత్ షా.. వీడియో వైరల్

  కేంద్ర హోమ్ శాఖామంత్రి అమిత్ షా తన కుటుంబంతో కలిసి దుర్గా పూజలో పాల్గొన్నారు. ఈ పూజ జరుగుతున్న సమయంలో బీసీసీఐ సెక్రటరీ, అమిత్ షా కొడుకు జై షా పరధ్యానంగా ఉండడంతో అతని పక్కనే ఉన్న అమిత్ షా.. ‘ఇక్కడ ద్రుష్టి పెట్టు’ అని గట్టిగా మందలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. ‘డాడ్ విల్ బి డాడ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Watch On Instagram గుర్తుపై క్లిక్ చేసి … Read more

  బండి సంజయ్  పాదయత్రతోనే ఆపరేషన్ ఆకర్ష్.. లిస్ట్ లో రాజగోపాల్ రెడ్డి సహా మరికొందరు?

  బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభించారు. యాదాద్రి లక్ష్మినరసింహ స్వామిని దర్శించుకున్న ఆయన, పార్టీ శ్రేణులతో పాదయాత్ర చేపట్టారు. యాదాద్రి నుంచి చేపట్టిన ఈ పాదయాత్ర వరంగల్ భద్రకాళి ఆలయం వరకు కొనసాగనుంది. ఈ యాత్ర భువనగిరి, వరంగల్ పార్లమెంట్ నియోజవర్గాల పరిధిలోని మొత్తం 12 అసెంబ్లీ స్థానాలను కవర్ చేయనుంది. 24 రోజుల పాటు సాగనున్న పాదయాత్ర ఆగస్టు 26న వరంగల్ లో ముగియనుంది. ఈ పాదయాత్రనే వేదికగా చేసుకుని ఇతర పార్టీల కీలక నేతలను పార్టీలోకి చేర్చుకునేలా … Read more