• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అమర్‌రాజా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

  [VIDEO:](url)చిత్తూరు-మోర్దానపల్లె అమర్‌రాజా ఫ్యాక్టరీలో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు అంటుకున్నాయి. భారీగా మంటలు ఎగసిపడగా.. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగనప్పటికీ భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. మంటల్లో చిక్కుకున్న కంపెనీ సిబ్బందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షిత ప్రదేశానికి తరలించారు. 📍 అమర్ రాజా ఫ్యాక్టరీ, యాదమరి మండలం మోర్ధానపల్లె ViDeo : chandu__chowdary#amarraja #fireaccident #chittoor #chittoordistrict pic.twitter.com/nmqwWW3fqS — Chittoor Central (@Chittoorcentral) … Read more

  సికింద్రాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం

  సికింద్రాబాద్‌లో వరుస అగ్నిప్రమాద ఘటనలు కలవరపెడుతున్నాయి. మారేడుపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. శ్రీలీల అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా మంటలు రావటంతో స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. మూడు ఫైరింజన్లతో సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. చుట్టు పక్కలకు కూడా మంటలు వ్యాపించాయి. ప్రమాద ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

  సికింద్రాబాద్ డెక్కన్ మాల్ కూల్చివేత

  సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదానికి గురైన డెక్కన్ మాల్‌ను కూల్చివేస్తున్నారు. భవనం కూల్చివేత పనులను ఎస్‌కే మల్లు కన్న్‌స్ట్రక్చన్ సంస్థ చేపట్టింది. రూ.22 లక్షల బిడ్‌తో ఈ సంస్థ కూల్చివేత పనులను దక్కించుకుంది. ఈ బిల్డింగ్ పూర్తిగా తొలగించటానికి వారం సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ఇటీవల డెక్కన్ మాల్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవదహనమవగా.. భవనం మొత్తం పనికి రాకుండా పోయింది.

  భారీ అగ్నిప్రమాదం.. రూ.50లక్షల ఆస్తినష్టం!

  AP: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో దుకాణాలు కాలి బూడిదయ్యాయి. దాదాపు అర కోటి రుపాయల నష్టం వాటిల్లినట్లు బాధితులు వెల్లడించారు. ఫిబ్రవరి 5 నుంచి తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారీగా బొమ్మలు, సామగ్రిని దుకాణాల్లో నిల్వ చేశారు. అవన్నీ అగ్నికి ఆహుతయ్యాయని బాధితులు వాపోయారు.

  హకీంపేట్‌లో పేలిన సిలిండర్లు

  హైదరాబాద్‌ హకీంపేట్‌లో మరో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ స్టవ్‌ రిపేర్‌ దుకాణంలో పేలుడు సంభవించింది. పెద్ద సిలిండర్ నుంచి చిన్న సిలిండర్లు నింపే క్రమంలో పేలాయి. భారీ శబ్ధంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బాంబుల మాదిరిగా పేలడంతో వాహనదారులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు. విద్యుదాఘాతం వల్ల ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

  దక్కన్ స్పోర్ట్స్‌ మాల్‌లో లభ్యం కాని మృతదేహాలు

  సికింద్రాబాద్‌ నల్లగుట్ట దక్కన్ స్పోర్ట్స్‌ మాల్‌ భవనంలో కనిపించకుండా పోయిన యువకుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఇప్పటికే మూడ్రోజులుగా అగ్నిమాపక శాఖ , డీఆర్‌ఎఫ్ , క్లూస్ టీం సిబ్బంది అన్ని అంతస్తులో తిరుగుతూ పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ప్రత్యేక లైట్లు వేసుకొని వెతికినా ఎలాంటి ప్రయోజనం లేదు. గుజరాత్‌కు చెందిన వసీం, జునైద్, జహీర్‌ గల్లంతవ్వగా..ఒక్కరి అవశేషాలు దొరికాయి. అవి ఇంకా ఎవరివో తెలియలేదు. దాదాపు 10 వేల టన్నుల వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించారు.

  డెక్కన్ మాల్‌లో మరొక మృతదేహం

  TS: హైదరాబాద్‌లోని రాంగోపాల్ పేట్ డెక్కన్ షాపింగ్ మాల్ లో మరొక మృతదేహం లభ్యమైంది. భవనం మొదటి అంతస్తులో ఓ మృతదేహాన్ని అగ్నిమాపక శాఖ సిబ్బంది గుర్తించారు. ఆ డెడ్ బాడీని అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది కలిసి బయటకు తీసుకొచ్చారు. అనంతరం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, శనివారం ఘటనా స్థలాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. బస్తీవాసులను పునరావాస కేంద్రాలకు తరలిస్తామని వెల్లడించారు. ఇరుగు పొరుగు వారికి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని వెల్లడించారు.

  సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం; ముగ్గురు సజీవదహనం

  సికింద్రాబాద్ డెక్కన్ స్పోర్ట్స్ వేర్ షోరూంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు యువకులు సజీవ దహనమైనట్లు సమాచారం. డ్రోన్ కెమెరా విజువల్స్‌ను బట్టి వారి మృతదేహాలు బిల్డింగ్ వెనుక భాగాన ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా మంటలు వస్తూండటంతో లోపలికి వెళ్లటానికి వీలు కావడం లేదు. వేడి తగ్గిన తర్వాత భవనాన్ని నేలమట్టం చేయనున్నారు. కాగా ఘటనా స్థలాన్ని కలెక్టర్ అమోయ్ కుమార్ పరిశీలించారు. మృతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

  సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం; షార్ట్ సర్క్యూట్ వల్ల కాదు..

  సికింద్రాబాద్‌లోని డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ షోరూంలో అగ్ని ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం కాదని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే సబ్ స్టేషన్‌లో ట్రిప్ అయ్యేదని పేర్కొన్నారు. ఒక వేళ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే వైర్లు, మీటర్లు పూర్తిగా కాలిపోయేవని వెల్లడించారు. షోరూంలో మంటలు వ్యాపిస్తున్నప్పుడు కొద్ది దూరంలోనే విద్యుత్ ఉందని తెలిపారు. ఆ తర్వాతే విద్యుత్ సరఫరా ఆపివేశామన్నారు. కాగా షోరూం యజమాని జావేద్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

  దక్కన్ మాల్ ప్రమాదంపై కేసు నమోదు

  సికింద్రాబాద్‌- దక్కన్‌ మాల్‌ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. భవన యజమాని మహ్మద్‌, రహీంలపై కేసు ఫైల్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం చేశారని విచారణలో తేల్చారు. ప్రమాదానికి కారణమైన మరో ముగ్గురు నిందితులు మిస్సైనట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై భవన యజమాని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో డెక్కన్ నైట్ వేర్ బిల్డింగ్ పూర్తిగా కాలిపోయింది. ఫిల్లర్లు బలహీనపడటంతో బిల్డింగ్‌ను కూల్చివేయాలని జీహెచ్‌ఎంసీ.. అధికారులను ఆదేశించింది.