TS కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం
తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మెటీరీయల్కు మంటలు అంటుకుని ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో భవనం మొత్తం భారీగా పొగలు కమ్ముకున్నాయి.11 ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. వుడ్ వర్క్ జరుగుతున్న క్రమంలో మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తు న్నారు.ఈ నెల 17న నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.