• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దేశం కోసమే బతుకుతున్నా; పీఎం మోదీ

    తాను[ దేశం](url) కోసమే బతుకుతున్నానని.. అవసరమైతే దేశం కోసం ప్రాణాలు త్యాగం చేస్తానని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజ్యసభలో మోదీ ఉద్వేగానికి గురవుతూ ప్రసంగించారు. కొంతమంది కుటుంబం కోసమే బతుకుతున్నారని.. కానీ తాను మాత్రం దేశం కోసమే బతుకుతున్నానని పేర్కొన్నారు. దేశంలో ఒకే వ్యక్తి చాలా మందిని ఎదుర్కొంటున్నాడని చెప్పారు. కాంగ్రెస్‌కు నినాదాలే కరువయ్యాయని.. కొత్త నినాదాలు వెతుక్కోవాలని ఎద్దేవా చేశారు. భారత్ అభివృద్ధిలో దూసుకుపోతోందని తెలిపారు. #WATCH | Nation is watching how an individual is strongly … Read more

    ఆ దశాబ్దకాలం భారత్ భారీగా నష్టపోయింది: ప్రధాని మోదీ

    [VIDEO:](url) అదానీ వ్యవహారంపై నిన్న పార్లమెంటులో విపక్షాలు వ్యవహరించిన తీరును ప్రధాని మోదీ తప్పుబట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడికి దిగారు. 2004 నుంచి 2014 వరకు దేశంలో అవినీతి రాజ్యమేలింది. భారీ స్కామ్‌లు జరిగాయి. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఉగ్రవాదం రాజ్యమేలింది. 2జీ, బొగ్గు స్కాం, కామన్‌వెల్త్ గేమ్స్‌లో పెద్దఎత్తున అవినీతి జరిగింది. ఆ దశాబ్దకాలం భారత్ పెద్దఎత్తున నష్టపోయింది. అవినీతిపై కేసులు పెడితే దర్యాప్తు సంస్థలను తప్పుపడుతున్నారు అని విమర్శించారు. #WATCH | During 10 years of … Read more

    మోదీపై ‘బంగారు’ ప్రేమ; 156 గ్రాముల స్వర్ణవిగ్రహం

    భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న ప్రేమతో ఓ వ్యాపారి ఏకంగా బంగారంతో ఆయన బొమ్మను తయారు చేశాడు. సూరత్‌కు చెందిన రాధిక చైన్స్ యజమాని బసంత్ బోహ్రా ప్రధాని మోదీకి వీరాభిమాని. ఆయనపై అభిమానంతో 156 గ్రాముల బంగారంతో [‘స్వర్ణ విగ్రహం’](url) తయారు చేశాడు. ఈ విగ్రహం తయారు చేయడానికి 20 కళాకారులకు దాదాపు 3 నెలల సమయం పట్టింది. ఈ విగ్రహం తయారీకీ సుమారు రూ.11 లక్షలు ఖర్చు అయింది. ప్రస్తుతం ఈ విగ్రహాన్ని బాంబే గోల్డ్ ఎగ్జిబిషన్‌లో ఉంచారు. This … Read more

    తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన ప్రధాని

    ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్‌ అంత్యక్రియలు గుజరాత్‌లో పూర్తయ్యాయి. మోదీ తన తల్లి చితికి నిప్పంటించారు. చేతులు జోడించి తల్లికి నమస్కరించి అంతిమ సంస్కారులు నిర్వహించారు. తల్లి పాడె మోసుకువెళ్లారు. సోదరుడు, కుటుంబ సభ్యులతో కలిసి తుది వీడ్కోలు పలికారు. గాంధీనగర్‌లోని సెక్టార్‌ 30 శ్మశానవాటికలో జరిగిన అంతిమక్రియల్లో మోదీ కుటుంబ సభ్యులతోపాటు గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

    తల్లి ఆశీర్వాదం తీసుకున్న మోదీ

    గుజరాత్‌లోని గాంధీనగర్‌లో తన తల్లి హీరాబెన్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. గుజరాత్ రెండో దశ ఎన్నికల నేపథ్యంలో తన తల్లి [ఆశీర్వాదం](url) తీసుకున్నారు. ఆమె పక్కన కూర్చుని తేనీరు సేవించారు. దాదాపు అర్ధ గంట పాటు తన తల్లి ముచ్చటిస్తూ కనిపించాడు. గత జూన్‌లో హీరాబెన్ 99 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్బంగా ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. కాగా సోమవారం జరిగే రెండో విడత ఎన్నికల్లో సబర్మతీ నియోజకవర్గంలో మోదీ తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. #Gandhinagar : Pm Narendra Modi … Read more

    రాజ్‌కోట్‌లో మోదీకి ఘనస్వాగతం

    మూడు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఘనస్వాగతం లభించింది. రాజ్‌కోట్‌ జిల్లాలోని జాంకన్ దోర్నాలో జరిగే బహిరంగ సభకు మోదీ హాజరయ్యారు. ఈ క్రమంలో అక్కడి ప్రజలు మోదీకి పూలు జల్లి ఘనస్వాగతం పలికారు. దీంతో ముగ్ధుడైన మోదీ అందరికీ అభివాదం చేస్తూ ముందుకెళ్లారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. #WATCH | Prime Minister Narendra Modi today received a warm welcome at Jamkandorna in Rajkot district, where … Read more

    అంబులెన్స్‌ కోసం కాన్వాయ్‌ ఆపిన మోదీ

    ప్రధాని మోదీ తన నిరాడంబరత్వాన్ని నిత్యం చాటే ప్రయత్నం చేస్తుంటారు. ఇవాళ కూడా అలాంటి సంఘటన వెలుగుచూసింది. గుజరాత్‌లో పర్యటనకు వెళ్లిన ప్రధాని రహదారిపై వెళ్తున్నారు. ప్రధాని కాన్వాయ్‌ వస్తుందంటే ఆ దారిలో ట్రాఫిక్‌ అంతా ఆపేసి దారి వదలడం సహజం. కానీ ప్రధాని స్వయంగా ఓ అంబులెన్స్‌కు దారి ఇచ్చేందుకు తన కాన్వాయ్‌ను పక్కకు ఆపించారు. అంబులెన్స్‌ వెళ్లిపోయాక తిరిగి తన కాన్వాయ్‌ తీసుకెళ్లారు. అహ్మాదాబాద్‌ నుంచి గాంధీనగర్‌ వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. #WATCH | Gujarat: Prime Minister Narendra … Read more

    మోదీ సభలో కుర్చీలే గొడుగులై..

    భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నసభ వద్ద హఠాత్తుగా వర్షం రావడంతో అక్కడున్నవారంతా కుర్చీలను తీసుకుని గొడుగులాగా తలపై పెట్టుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో జరుగుతున్నఈ సభలో ముందుగా స్థానిక నాయకుడు ఒకరు ప్రసంగిస్తుండగా ఈ సన్నివేశం చోటుచేసుకుంది. వర్షంలో తడవకుండా తమను తాము రక్షించుకోవడానికి వారు ఈ పని చేశారు. ఒక నెటిజన్ ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. #Watch: Chairs used as umbrellas as rain hits PM @narendramodi's Himachal … Read more

    ‘హ‌ర్ గ‌ర్ తిరంగా’ ఆంథెమ్ వీడియోలో ప్ర‌భాస్

    75 ఏళ్ల స్వాతంత్య్ర ఉత్సవాల్లో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం హ‌ర్ గ‌ర్ తిరంగా క్యాంపెయిన్‌ను స్టార్స్‌తో ప్ర‌చారం చేయిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ క‌ల్చ‌ర్ నిన్న హ‌ర్ గ‌ర్ తిరంగా ఆంథెమ్‌ వీడియోను సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో అమితాబ్, క‌పిల్ దేవ్, విరాట్ కొహ్లీ, అనుష్క శ‌ర్మ‌, ప్ర‌భాస్, కీర్తి సురేశ్, దేవీశ్రీ ప్ర‌సాద్ వంటివాళ్లు క‌నిపించారు. వీడియో చివ‌రిలో ప్ర‌ధాని మోడీ మెరిశాడు. ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ ఉత్స‌వాల్లో భాగంగా ప్ర‌తి ఒక్క‌రు ఆగ‌స్ట్ 2 నుంచి 15 వ‌ర‌కు త‌మ … Read more

    చెస్ ఒలింపియాడ్ ప్రారంభోత్స‌వంలో అద్భుత‌మైన క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌లు

    44వ చెస్ ఒలింపియాడ్ ఈసారి భార‌త్ ఆతిథ్యం ఇచ్చింది. చెన్నైలో జ‌రుగుతున్న ఈ మెగా ఈవెంట్‌ను ప్రధాన‌మంత్రి నరేంద్రమోదీ జులై 29న ప్రారంభించారు. అయితే ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా చెస్ బోర్డు లాంటి స్టేజీపై త‌మిళనాడు సాంప్ర‌దాయ నృత్య క‌ళారీతుల‌తో అల‌రించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారుతున్నాయి. మొత్తం 187 దేశాల ప్లేయ‌ర్స్ ఇందులో పాల్గొంటారు. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి. https://twitter.com/TheFigen/status/1553825769113141248?s=20&t=TXNQrrM9bG2PGzl0GZy9ow