• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Top 10 Expensive Hotels: ఇక్కడ బస చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే..!

    భారత్‌లో పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెందింది. రాజుల కాలం నాటి కట్టడాలు, చారిత్రాత్మక ప్రదేశాలు, సహజసిద్ధమైన ప్రకృతి అందాలు ఇలా ఎన్నో దేశంలో ఉన్నాయి. వీటిని చూసేందుకు దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో వారికి వసతులు కల్పించేందుకు ఎన్నో ఖరీదైన హోటళ్లు కొలువుదీరాయి. భారత సంస్కృతి, నిర్మాణశైలి ఉట్టిపడేలా వాటిని నిర్మించారు. ప్రస్తుతం దేశంలో అత్యంత ఖరీదైన హోటళ్లు ఏవో ఇప్పుడు చూద్దాం.

    1. తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌, హైదరాబాద్‌

    ఫలక్‌నామా ప్యాలెస్‌ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వ్యక్తి ఉండరు. హైదరాబాద్‌కు వచ్చే ప్రముఖులు ఎక్కువగా ఈ ప్యాలెస్‌లోనే బస చేస్తుంటారు. ఒకప్పటి నిజం ప్రభువుల కళా వైభవానికి ఈ ప్యాలెస్ ప్రతీక. నిజాం ప్రభువుల నివాసంగా ఉన్న ఈ ప్యాలెస్‌ను ప్రభుత్వం తాజ్‌ గ్రూప్‌నకు లీజుకు ఇచ్చింది. 

    ©TajHotels

    2. రాంబాగ్‌ ప్యాలెస్‌, జైపుర్

    దేశంలోనే అత్యంత ఖరీదైన హోటల్‌గా రాంబాగ్‌ ప్యాలెస్‌ (1835) గుర్తింపు పొందింది. రాజస్థాన్‌లోని జైపూర్‌ నగరంలో ఉన్న ఈ హోటల్‌లో వసతులకు కొదవలేదు. 48 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్యాలెస్‌లో విడిది చేయాలంటే సామాన్యులకు అసాధ్యమనే చెప్పాలి. ఈ హోటల్‌లోని రాయల్‌ సూట్‌లో ఒక రాత్రి స్టే చేయాలంటే అక్షరాల రూ. 9,50,000 చెల్లించాలి. 

    ©TajHotels

    3. తాజ్‌ లేక్‌ ప్యాలెస్‌, ఉదయపూర్‌

    రాజస్థాన్‌లోని తాజ్‌ లేక్‌ ప్యాలెస్‌ను కూడా అత్యంత ఖరీదైన హోటల్‌గా చెబుతారు. ఇది ఒకప్పుడు మేవాడ్‌ రాజ్య వంశస్థుల నివాసంగా ఉండేది. పిచోలా సరస్సులో 1743-46 మధ్య దీనిని నిర్మించారు. ఇందులోని పెసిడెన్షిల్‌ సూట్‌లో ఒక రోజు ఉండాలంటే రూ. 7.5 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. 

    ©TajHotels

    4. లీలా ప్యాలెస్‌, దిల్లీ

    దేశ రాజ‌ధానిలో అత్యంత ఖ‌రీదైన హోట‌ళ్ల‌లో లీలా ప్యాలెస్ ఒక‌టి. ల్యుటెన్ వాస్తుక‌ళ‌తో, భార‌తీయ రాచ‌రిక‌ సంస్కృతి ఉట్టిప‌డేలా దీన్ని నిర్మించారు. ఇందులో మ‌హారాజా సూట్ తీసుకుంటే ఒక రోజుకు రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకూ ఖర్చు అవుతుంది. విదేశాల నుంచి వచ్చే ప్రభుత్వ  ప్రతినిధులు ఈ హోటల్‌లో బస చేసేందుకు ఇష్టపడుతుంటారు. 

    © Grigr7

    5. తాజ్‌ హోటల్‌, ముంబయి

    ముంబయిలోని తాజ్‌ హోటల్‌ దేశంలోని పురాతనమైన హోటళ్లలో ఒకటి. 26/11 దాడులతో ఈ హోటల్‌ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగింది. ఈ హోటల్‌లోని ప్రెసిడెన్షియల్‌ సూట్‌లో ఉండాలంటే రోజుకు రూ. 7.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఖర్చు చేయాలి.

    © ANI

    6. ది ఒబెరాయ్‌, గుర్గావ్‌

    హరియాణలోని ది ఒబెరాయ్‌ హోటల్‌ కూడా విలాసవంతమైనదిగా గుర్తింపు పొందింది. పెద్ద పెద్ద హోటళ్లలో బస చేసే వారికి ఒబెరాయ్‌ హోటల్స్‌ గురించి తప్పక తెలిసి ఉంటుంది. ఈ హోటల్‌లోని ప్రెసిడెన్షియల్‌ సూట్‌లో ఒక రోజు ఉండాలంటే రూ. 7.5 లక్షలు ఖర్చు అవుతుంది. 

    © OberoiGurgaon

    7. ది ఒబెరాయ్‌, ముంబయి

    ముంబయి సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ఒబెరాయ్‌ హోటల్‌ ఎంతో మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. ముంబయికి వెళ్లే పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు ఈ హోటల్‌లో ఎక్కువగా స్టే చేస్తుంటారు. ఈ హోటల్‌లోని అతి విలాసవంతమైన రూమ్‌లో ఉండాలంటే రోజుకు రూ. 7.5 లక్షలు చెల్లించాల్సిందే. 

    © GDSHOTELS1

    8. కుమరకోం లేక్‌ రిసార్ట్‌, కేరళ

    కేరళలో అత్యంత ఖరీదైన రిసార్ట్‌లో కుమారకొం లేక్ ఒకటి. వరల్డ్‌ ట్రావెల్ అవార్డును సైతం ఈ రిసార్ట్ సొంతం చేసుకుంది. సముద్రంలో ఏర్పాటు చేసిన రిసార్ట్‌లో బస చేసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తుంటారు. 

    © klresort

    9. తాజ్‌ లాండ్స్‌ ఎండ్‌, ముంబయి

    ముంబయిలో అత్యంత విలాసవంతమైన హోటళ్లలో తాజ్‌ లండ్స్‌ ఎండ్‌ ఒకటి. ఇందులో ఒకసారి బస చేస్తే ఎప్పటికీ మర్చిపోలేరని చెబుతారు.

    © TajLandsEnd

    10. పార్క్‌ హయత్‌, గోవా

    గోవాలోని పార్క్‌ హయత్‌ హోటల్‌ కూడా ఎంతో ఖరీదైనది. సముద్రం పక్కన 45 ఎకరాల్లో విస్తరించిన ఈ హోటల్‌లో బస చేసేందుకు ప్రకృతి ప్రేమికులు ఇష్టపడుతుంటారు. చుట్టూ చెట్లతో నిండి ఉన్న ఈ రిసార్ట్‌ గోవాకు వచ్చే విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తోంది.

    © GHGoa
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv