ఐపీఎల్లో నేడు రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. చెన్నైలో ఈ రెండు జట్లు తలపడగా 3 పరుగుల తేడాతో రాజస్థాన్ గట్టెక్కింది. సీఎస్కేని సొంతగడ్డపై ఓడించింది. ఇప్పుడు జైపుర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం ఇందుకు ఆతిథ్యం ఇస్తోంది. వరుసగా 3 విజయాలతో చెన్నై దూకుడు మీద ఉంది. మరోవైపు, గత 2 మ్యాచుల్లో రాజస్థాన్ పరాభవం చవిచూసింది. ఈ క్రమంలో సొంత మైదానంలో చెన్నైపై గెలిచి తిరిగి విన్ ట్రాక్ ఎక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే విన్నింగ్ జోన్లో ఉన్న సీఎస్కే పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. బెన్ స్టోక్స్ అందుబాటులో ఉన్నప్పటికీ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. అతడికి ఛాన్స్ రాకపోవచ్చు. గత మ్యాచ్‌లోని జట్టుతోనే ఆడే అవకాశం ఉంది. రాజస్థాన్‌లో జాసన్ హోల్డర్‌ను పక్కనపెట్టి స్పిన్నర్ ఆడమ్ జంపాను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సీజన్లో ఇప్పటికే సంజూ సేన చెన్నైతో తలపడింది. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్‌ను ఓడించినంత పని చేశాడు ధోని. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 175 పరుగులు చేసింది. తర్వాత చేధనలో చెన్నై తడబడింది. కాన్వే అర్థ సెంచరీ, రహానే 31 పరుగులతో రాణించినా తర్వాత చకచకా వికెట్లు పడ్డాయి. రవీంద్ర జడేజా, ధోని మ్యాచ్‌ను గెలిపించేందుకు ప్రయత్నించారు. ఒకానొక సమయంలో మ్యాచ్ చెన్నై వైపుకి తిరిగింది అనుకున్నారంతా.
చివరి ఓవర్లో సీఎస్కేకు 21 పరుగులు కావాలి. క్రీజులో ధోని ఉన్నాడు. ఇంకేముంది, అందరూ ఆసక్తిగానే చూశారు. అనుకున్నట్లుగానే మహేంద్ర సింగ్ వరుసగా రెండు సిక్సులు కొట్టాడు. దీంతో చేధించాల్సిన స్కోరు తగ్గింది. పుంజుకున్న బౌలర్ సందీప్ శర్మ యార్కర్లతో బ్యాటర్లను అడ్డుకున్నాడు. చివరి బంతికి 6 పరుగులు కావాల్సి ఉండగా.. ధోని గెలిపిస్తాడనుకున్నా బౌలింగ్ అద్భుతంగా వేయటంతో చెన్నై ఓడిపోయింది.
ధోని ఉన్నంత వరకు మ్యాచ్ గెలుస్తామని అనుకోలేదని రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ చెప్పాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి నేపథ్యంలో ఈ మ్యాచ్ కూడా రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఇప్పటికే ఫుల్ ఫామ్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్… మరో గెలుపుకోసం ప్రణాళికలు రచిస్తోంది. అన్ని విభాగాల్లోనూ రాణిస్తుండటం ధోనిసేనకు కలిసొచ్చే అంశం
Celebrities Featured Articles Telugu Movies
Samantha: నన్ను ‘సెకండ్ హ్యాండ్, యూజ్డ్’ అంటున్నారు!