IPL ప్రారంభమైనప్పట్నుంచి ఇప్పటివరకు ఓ వివాదం కొనసాగుతూనే ఉంది. లీగ్‌ల కారణంగా ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం అవుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి అలానే ఉంది. ఇలాంటి తరుణంలో ఓ సంచలన విషయం చక్కర్లు కొడుతోంది. కొంతమంది ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఫ్రాంఛైజీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇందుకోసం ఫ్రాంఛైజీలు సంవత్సరానికి రూ. 50 కోట్ల వరకు ముట్టజెప్పుతున్నాయట. ఇదే కనుక జరిగితే దాదాపు 7 నెలల పాటు వాళ్లు దేశం తరఫున కాకుండా కేవలం ఫ్రాంచైజీ తరఫున లీగ్‌లు మాత్రమే ఆడతారు.
బిగ్ డీల్
ఐపీఎల్‌కు చెందిన కొన్ని టాప్ ఫ్రాంఛైజీలు కొందరు ఆటగాళ్లకు ఆఫర్లు ఇస్తున్నాయి. ఆరుగురు ఇంగ్లాండ్ ప్లేయర్లకు అంతర్దాతీయ మ్యాచ్‌లు వదిలేసి సంవత్సరం పాటు లీగ్స్‌కు ఆడాలని కోరాయి. ఇందుకోసం భారీ ఎత్తున ముట్టజెప్పేందుకు ముందుకు వచ్చాయని అందుకు. రూ. 50 కోట్ల వరకు ఆఫర్ చేశాయని ‘టైమ్స్ లండన్’ రిపోర్ట్ తెలిపింది.
లీగ్స్ మాయ
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ప్రస్తుతం 10 ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఇవి గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నాయి. వీటికి కరేబియన్ లీగ్, SA టీ20, ILT20 లీగుల్లో జట్లను కలిగి ఉన్నారు. ఇందుకోసమే ప్రయత్నాలు మెుదలుపెట్టాయి. అయితే, ఇప్పటికే వీరి మధ్య చర్చలు జరిగినా.. వాళ్లెవరనే విషయం బయటకు రాలేదు.
దేశానికి దూరమే
ఒకవేళ సంవత్సరం కాంట్రాక్టు ప్రాతిపదికన ఆటగాళ్లు ఆడినట్లయితే దాదాపు 7 నెలలు పూర్తిగా వాళ్లు లీగ్స్‌కే పరిమితం అవుతారు. కేవలం మూడు నెలలు మాత్రమే దేశం తరఫున ఆడే అవకాశం ఉంటుంది. అంటే వాళ్లు తమ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను వదులుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.
ఇంగ్లాండ్ ఆటగాళ్లు
ప్రస్తుత ఐపీఎల్‌లో దాదాపు 15 మంది ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆడుతున్నారు. బెన్ స్టోక్స్, మోయిన్ అలీ, విల్ జాక్స్, టాప్లే, డేవిడ్ విల్లీ, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, హ్యారీ బ్రూక్, జో రూట్, జోస్ బట్లర్, ఫిలిప్ సాల్ట్, సామ్ కర్రాన్, జానీ బెర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టన్, మార్క్ వుడ్ ఉన్నారు. వివిధ ఫ్రాంఛైజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇలా కష్టమే
లీగ్స్ కారణంగా గాయాలపాలై చాలామంది కీలక సమయాల్లో అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం అవుతున్నారు. గతేడాది టీ 20 వరల్డ్ కప్‌కు ముందు గాయపడిన బుమ్రా ఇంకా కోలుకోలేదు. ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్‌లో దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్ గాయపడ్డారు. మెుదటి మ్యాచ్‌లోనే గుజరాత్ తరఫున ఆడుతున్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కాలుకి పెద్ద గాయమయ్యింది. వీరంతా రానున్న వన్డే వరల్డ్‌కప్‌కి అందుబాటులో ఉంటారో లేదో తెలియని పరిస్థితి. ఇలాగే కొనసాగితే మరి కొందరు ఈ లిస్ట్‌లో చేరవచ్చు.
ఆటగాళ్ల కామెంట్స్
ఇప్పటికే కొంతమంది విదేశీ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ కోసం ఐపీఎల్‌ను కాదన్నారు. ఇటీవల ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ బెన్‌స్టోక్స్ ఈ విషయంపై మాట్లాడాడు. తనకు ఐపీఎల్ కంటే ASHES ఆడటమే ముఖ్యమని తేల్చి చెప్పాడు. ఆటగాళ్లు దేశం తరఫున ఆడేందుకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలన్నాడు. ఇక జో రూట్ కూడా గతంలోనే ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. ఐపీఎల్ ఆడాలని ఉన్నా… టెస్ట్, వన్డే సిరీస్‌లే తన మెుదటి చాయిస్ అన్నాడు. చాలా సీజన్ల వరకు వేలంలోనే పాల్గొనలేదు.
సీనియర్స్ ఏమన్నారంటే ?
గవాస్కర్ : గతేడాది వెస్టిండీస్‌తో సిరీస్ సందర్భంగా కోహ్లీ, రోహిత్, పాండ్యాకి రెస్ట్ ఇవ్వటంపై స్పందిస్తూ “ ఈ కాన్సెప్ట్‌ను నేను ఒప్పుకోను. మీరు ఐపీఎల్ ఆడేటప్పుడు రెస్ట్ తీసుకోరు. కానీ, భారత్ తరఫున ఆడేటప్పుడు ఎందుకు అడుగుతారు. మీరు కచ్చితంగా దేశం తరఫునే ఆడాలి” అన్నారు.
రవిశాస్త్రి : “ కొంతమంది ఆటగాళ్లు NCAకి పరిమితం అవుతున్నారు. వాళ్లు అన్ని ఫార్మాట్లు ఆడకపోయినా గాయాలవుతున్నాయి. ఇంకొన్ని రోజులైతే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి వెళ్లేందుకు పర్మిట్ వస్తుందేమో” అన్నారు. ఐపీఎల్‌లో దీపక్ చాహర్ గాయపడిన అనంతరం ఈ మాజీ కోచ్ చేసిన వ్యాఖ్యలివి.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది