ముంబై సైబర్ రాకెట్ ముఠా గుట్టు రట్టు కేసులో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. ముఠా నాయకుడు దాడి శ్రీనివాస రావు(49) చదివింది 12తరగతి మాత్రమేనట. కానీ, టెక్నికల్ నాలెడ్జ్ బాగా ఉండటంతో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడ్డాడు. ఇలా రోజుకు కనీసం రూ.5 కోట్ల వరకు ఖాతాలో జమ చేసుకునేవాడట. హైదరాబాద్లోని ఓ హోటల్ నుంచి నిందితుడిని మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 40 బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేసి రూ.15కోట్ల వరకు రికవర్ చేశారు. శ్రీనివాసరావు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడని సమాచారం.
అయితే శ్రీనివాసరావు ముఠా ఎక్కువగా మహిళలను టార్గెట్ చేసేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. తాము పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నామని, మీరు పంపిన కొరియర్లో డ్రగ్స్, ఆయుధాలు దొరికాయని చెప్పి తొలుత వారిని ముఠా భయపెట్టేది. ఆ కొరియర్తో తమకు సంబంధం లేదని చెబితే అది నిర్ధారించాల్సింది తామని, వెంటనే బ్యాంకు లేదా ఆదాయపన్ను వివరాలు పంపాలని ఆదేశించేది. వాటిని తనిఖీ చేశాక కొరియర్ గురించి తేలుస్తామని శ్రీనివాసరావు & గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడేది. ఈ క్రమంలో పలువురికి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు పేరుతో కూడా ఈ మూట కాల్ చేసింది. ఇక బాధితులు భయపడి తమ వ్యక్తిగత వివరాలు పంపిస్తే ఇక వారి బ్యాంకు ఖాతాలను ఈ ముఠా ఖాళీ చేసేదని దర్యాప్తు వర్గాలు వివరించాయి.
బాధితులను మోసం చేసేందుకు శ్రీనివాసరావు.. ఎనీ డెస్క్ వంటి యాప్లను వినియోగించినట్లు తెలుస్తోంది. ఆ యాప్లను ఉపయోగించి బాధితుల ఫోన్లను నియంత్రణలోకి తీసుకునేవాడని సమాచారం. దేశవ్యాప్తంగా ఇలా వేలాదిమందిని ఈ ముఠా మోసం చేసింది.దోచుకున్న సొమ్మును నిందితుడు శ్రీనివాసరావు క్రిప్టో కరెన్సీగా మార్చి ఓ చైనా జాతీయుడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది