• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కుక్క యజమానికి 3 నెలల జైలు; 12 ఏళ్ల తర్వాత?

  ఓ కుక్క యజమానికి 3 నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అది కూడా కుక్క కరిచిన 12 ఏళ్లకు తీర్పు ప్రకటించింది. 2010లో ముంబైలో హోర్ముస్జి, కేస్రీ ఇరానీలు గొడవపడ్డారు. ఈ తగాదాలో హోర్ముస్జికి చెందిన కుక్క ఇరానీపై దాడి చేసింది. అతడి కాలికి, చేతికి కరిచింది. దీంతో ఇరానీ కోర్టును ఆశ్రయించాడు. ఆ కుక్క రోట్‌వీలర్ జాతికి చెందిందని, అది కరిచే జంతువని గిర్‌గావ్ కోర్టు అభిప్రాయపడింది. ఆ విషయం తెలిసీ కుక్కను ఆపనందుకు హోర్ముస్జికి 3 నెలల జైలు … Read more

  మహారాష్ట్ర ఆర్టీసీలో మహిళా డ్రైవర్లు

  మహారాష్ట్ర ఆర్టీసీలో మహిళా డ్రైవర్లు విధుల్లో చేరనున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి 17మందితో కూడిన బ్యాచ్ డ్యూటీ ఎక్కనున్నారు. ఈ మేరకు శిక్షణ పూర్తి కావొస్తోంది. అయితే, ఇందులో ఓ ఉద్యోగి గురించి ఆసక్తికర విషయం తెలిసింది. యాక్సిస్ బ్యాంక్‌లో నాలుగేళ్ల పాటు మేనేజర్‌గా పని చేసి ప్రజలకు సేవ చేయాలన్న ఆశయంతో ఆర్టీసీని ఎంచుకున్నట్లు పుణెకు చెందిన శీతల్ శిందే వెల్లడించారు. 2019లో ప్రభుత్వం చేపట్టిన మహిళా డ్రైవర్ల భర్తీ ప్రక్రియలో శీతల్ ఎంపికవ్వగా.. ఏడాదిన్నర పాటు శిక్షణ పూర్తి కావొచ్చింది.

  పోలీసులమని చెప్పి బాలికపై అత్యాచారం

  మహారాష్ట్రలో మరో అమానుష ఘటన చోటు చేసుకుంది. పోలీసు అధికారులమని చెప్పి 17 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. థానె పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాలికను అత్యాచారం చేస్తుండగా వీడియో తీసి.. దానిని వైరల్ చేయడానికి నెట్టింట పోస్ట్ చేస్తామని నిందితులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఘటనపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 376(D), పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు థానె పోలీసులు వెల్లడించారు.

  తల్లికి రెండో పెళ్లి చేసిన కొడుకు; సమాజాన్ని ఎదిరించి మరీ..

  ఓ యువకుడు తన తల్లికి రెండో పెళ్లి చేసి ఆదర్శంగా నిలిచాడు. ఈ ఘటన మహరాష్ట్రలోని కొల్హాపూర్‌లో చోటు చేసుకుంది. యువరాజ్ షేలే(23) అనే యువకుడు ఐదేళ్ల కిందట తండ్రిని కోల్పోయాడు. అప్పటినుంచి తన తల్లి ఒంటరిగా జీవిస్తూ ఇంటికే పరిమితమైపోయి బయటకు రావడం లేదు. దీంతో ఆమెను మామూలుగా చేయాలని యువరాజ్ నిర్ణయించుకున్నాడు. ఆమెకు పెళ్లి చేయాలని భావించి వరుడుని కూడా వెతికాడు. సమాజాన్ని ఎదిరించి మరీ మారుతి అనే వ్యక్తితో ఆమెకు వివాహం చేశాడు.

  283 బంతుల్లో 283 రన్స్ చేసిన జాదవ్

  రంజీ ట్రోఫీలో టీమిండియా మాజీ క్రికెటర్ కెదార్ జాదవ్ అదరగొట్టాడు. మహారాష్ట్ర తరఫున బరిలోకి దిగిన జాదవ్ ఏకంగా డబుల్ సెంచరీ చేసేశాడు. 283 బంతుల్లో 283 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ట్రిపుల్ సెంచరీ మార్కుని తృటిలో చేజార్జుకున్నాడు. అస్సాంతో జరుగుతున్న మ్యాచులో జాదవ్ ఈ ఫీట్‌ని నమోదు చేశాడు. దాదాపుగా మూడేళ్ల పాటు జట్టులో స్థానం కోల్పోయిన ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్.. అరంగేట్ర మ్యాచులోనే విశ్వరూపం చూపించాడు. దీంతో మహారాష్ట్ర 9 వికెట్లు కోల్పోయి 594 పరుగులు చేయగలిగింది. అనంతరం … Read more

  ట్విటర్‌లో పోస్ట్.. రూ.64వేలు హాంఫట్

  సోషల్ మీడియాల్లో వ్యక్తిగత సమాచారం పంచుకోకూడదనడానికి ఇది నిదర్శనం. ట్విటర్‌లో ప్రయాణ వివరాల గురించి పోస్ట్ చేసి ఓ మహిళ రూ.64వేలను పోగొట్టుకుంది. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ ఈ నెల 14న భుజ్ ప్రాంతానికి వెళ్లడానికి 3 ట్రైన్ టికెట్లను బుక్ చేసింది. సీట్లన్నీ నిండిపోవడంతో ఆమెకు ఆర్ఏసీ(రిజర్వేషన్ అగైన్స్ట్ క్యాన్సలేషన్) టికెట్ లభించింది. ఈ ప్రయాణాన్ని ధ్రువీకరించుకోవడానికి ఆమె ట్విటర్ ఖాతాలో IRCTCని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసింది. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు ఓ లింకుని పంపి వివరాలు పొందుపర్చాలని, … Read more

  పది ఫెయిల్.. బైక్‌ను తయారు చేశాడు!

  పదో తరగతి ఫెయిల్ అయినా కుంగిపోలేదు. తన ఆసక్తి, అభిరుచిపైనే దృష్టిపెట్టాడు. అలా వ్యర్థాలతో ఓ బైక్‌ని తయారు చేశాడు. ఆశ్చర్యమేమిటంటే ఆ బైక్‌ని తయారు చేయడానికి ఆయనకు అయిన ఖర్చు రూ.10వేలే. మహారాష్ట్రకు చెందిన సొహైల్ ఫతే మహ్మద్ ఈ ఘనతను సాధించాడు. పాడైపోయిన వస్తువులను సేకరించి.. బైక్ తయారీకి అనుగుణంగా వాటిని మలిచాడు. 125 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో బైక్‌ని తయారు చేశాడు. తన తల్లి ప్రోత్సాహంతోనే ఈ బైక్ తయారు చేయగలిగానని సొహైల్ చెప్పాడు. వాహనాలు విక్రయించడం తన ఉద్దేశం … Read more

  భగ్గుమన్న కర్ణాటక, మహారాష్ట్ర వివాదం

  కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం మళ్లీ రాజుకుంది. సరిహద్దు విషయమై మహారాష్ట్ర తీసుకున్న చర్యపై కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై ఆగ్రహం వ్యక్తం చేశారు. “అక్కడి నాయకులు ఆమోదించిన తీర్మానానికి ఎలాంటి అర్థం లేదు. తమని రెచ్చగొట్టి, విభజిస్తామని బెదిరిస్తున్నారు. ప్రజలు సామరస్యంగా జీవిస్తున్నారు. రాజకీయ జిమ్మిక్కులకు పాల్పడవద్దు. కర్ణాటకలో ఒక్క అంగుళం కూడా మహారాష్ట్రకు వెళ్లద్దు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడు తీర్మానం ఎలా ఆమెదించారు” అని ప్రశ్నించారు.

  15ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

  మహారాష్ట్రలోని ముంబైలో దారుణం జరిగింది. ఎన్ఎం మార్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పదిహేనేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 22న అర్ధరాత్రి ఓ బాలికపై అఘాయిత్యం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో సంబంధమున్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు మైనర్లు ఉండటం గమనార్హం. నిందితులపై పొక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. బాలిక, నిందితులంతా ఒకే ప్రాంతానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. బాధితురాలిని బాలల గృహానికి పంపించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.

  బీమా డబ్బుల కోసం.. స్నేహితుడి హత్య

  బీమా డబ్బుల కోసం ఓ వ్యక్తి పన్నిన నాటకాన్ని నిజం చేసి స్నేహితులు కటకటాల పాలయ్యారు. 2018లో చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రకు చెందిన అశోక్.. తన పేరు మీద ఉన్న రూ.4కోట్ల బీమాను పొందేందుకు చనిపోయినట్లు నాటకం ఆడాడు. ఈ కుట్రను స్నేహితులకు చెప్పి పరిహారం తీసుకోవాలని సూచించాడు. కానీ, స్నేహితులు నిజంగానే అశోక్‌ని చంపేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. బీమా డబ్బులను స్నేహితులే పంచుకున్నారు. అశోక్ సోదరుడికి అనుమానం రావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్టు … Read more