ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ప్రాజెక్ట్- K (Project-K). అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొణె, దిశా పటాని వంటి స్టార్లతో నిండిపోయిన ఈ సినిమాలో మరో స్టార్ నటుడు కమల్ హాసన్ కూడా చేరిపోయినట్లు తెలుస్తోంది. ప్రభాస్‌కు విలన్‌గా కమల్ హాసన్ నటిస్తున్నాడట. ఇప్పటికే ఇందుకు సంబంధించిన డీల్ పూర్తైనట్లు సమాచారం. విలన్ పాత్ర పోషించడానికి కమల్ హాసన్ 10 అంకెల పారితోషికం డిమాండ్ చేశాడట. అయితే, ఈ సినిమా నుంచి రిలీజ్ అవుతున్న ఒక్కో పోస్టర్ ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేస్తోంది.
ఒక్కో పోస్టర్లో ఒక్కో ప్రత్యేకత..
విరిగి పడిన చేతికి ఎక్కుపెట్టిన తుపాకులు, పిడికిలి బిగించిన చేతులు, దూరంగా కొండ అంచుపై చీకటిలో నిలబడిన మనిషి, ఆశతో నిండిన కళ్లు.. ఇవీ ప్రాజెక్ట్ K చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్లు. ఒక్కో పోస్టర్‌పై ఒక్కో రకమైన స్టేట్మెంట్ని విడుదల చేసి పాత్రల గురించి టీం హింట్ ఇచ్చింది.
తాజాగా దిశా పటాని పుట్టిన రోజు సందర్భంగా విషెస్ చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో పెళ్లి కూతురిని ముస్తాబు చేస్తున్నట్లు ఉంది. దిశా పటాని కళ్లను మాత్రమే చూపించారు. ఆ కళ్లను చూస్తే ఏదో చెప్పాలి అన్నట్లుగా ఆశగా ఎదురు చూస్తున్నట్లు అనిపిస్తోంది. మరి, ఈ ఎదురు చూపు ఎవరికోసం? ఎందుకోసం? అసలు దిశ క్యారెక్టర్ ఏంటి? అని ఆలోచనలో పడ్డారు.
శివరాత్రి సందర్భంగా చిత్రబృందం రిలీజ్ ప్రకటిస్తూ పోస్టర్ని విడుదల చేసింది. ఓ భారీ చేయి విరిగిపడి ఉండగా, ఆ చేతివైపు ముగ్గురు వ్యక్తులు (ప్రత్యేక సూట్ వేసుకుని) అత్యాధునిక తుపాకులు గురిపెట్టి నిల్చొని ఉండటం ఇందులో చూపించారు. అక్కడ పడి ఉన్న వస్తువులను చూస్తుంటే చుట్టు పక్కల విధ్వంసం జరిగినట్లు తెలిసిపోతోంది. మరి, ఈ విధ్వంసం ఆ చేయి సృష్టించిందా? లేదా అసుర సంహారమా? ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోందనే క్యాప్షన్ పెట్టి దీనిని మరింత ఆసక్తికరంగా మలిచారు.
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ బర్త్ డే సందర్బంగా విష్ చేస్తూ ప్రాజెక్ట్ K టీం మరో పోస్టర్ రిలీజ్ చేసింది. పిడికిలి బిగించిన చేతి ఫొటోను ఇందులో చూపించింది. చేతికి రక్షణగా ఓ వస్త్రాన్ని కట్టుకున్నట్లు ఉంది. ఈ పోస్టర్లోనే ‘Legends are Immortal’ (ధీరులకు మరణం ఉండదు) అని క్యాప్షన్ ఇచ్చారు. అంటే, అమితాబ్ పాత్ర పోరాట సన్నివేశాలకు మిళితమై ఉంటుందని తెలుస్తోంది.
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా కూడా దాదాపు ఇలాంటి పోస్టర్‌నే విడుదల చేసింది టీమ్. చేతికి రక్షణగా పెట్టుకున్న సూట్ ఇందులో ఉంది. ఆ పోస్టర్‌కు ‘Heroes are Not Born, They Rise’ అని క్యాప్షన్ ఇచ్చారు.
ఎవరీ సేవియర్?
దీపిక పదుకునె బర్త్ డే సందర్భంగా ఓ పోస్టర్ రిలీజైంది. పోరాడి అలసిపోయిన ఓ సేవియర్‌ని చూపిస్తున్నట్లుగా ఈ పోస్టర్ ఉంది. ఇందులో దీపిక ముఖం చూపించలేదు. కానీ, కొండపై నిల్చొని పిడికిలిని బిగించినట్లుగా ఉంది.
పోస్టర్‌పై ‘A Hope in The Dark’ అని క్యాప్షన్ ఉంది. అంటే, దారులన్నీ చీకటిగా మారినప్పుడు మార్గం చూపి ముందుకు నడిపించే వెలుగు దివ్వె అని చెప్పకనే చెప్పారు. సినిమాలో కథానాయకులు దిగ్బంధంలో ఉన్నప్పుడు వీరిని రక్షించేందుకు దీపిక వస్తుందేమో అని చర్చించుకుంటున్నారు.
ఇదేనా స్టోరీ?
‘ప్రాజెక్ట్ K’ స్టోరీపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. విష్ణు మూర్తి దశావతారమైన కల్కి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడట. కల్కికి తండ్రిగా అశ్వథ్థామ పాత్రను బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పోషిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కలియుగాంత సమయంలో సృష్టి రక్షణకు చేయూతనిచ్చేందుకు కల్కిగా వస్తాడని, దుష్ట సంహారానికై చేసే పోరాటంలో వీరందరూ ఏకమైతారని తెలుస్తోంది.
మరోవైపు, కొడుకు ఆశయాన్ని నెరవేర్చడానికి తండ్రి ఏం చేశాడనే నేపథ్యంలో కథ సాగుతుందనే ప్రచారమూ జరుగుతోంది. మొత్తానికి పీరియాడికల్ స్టోరీని ఎంచుకుని లేటెస్ట్ హంగులతో సైంటిఫిక్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతోంది. ఇందులో టైమ్ మిషన్ కాన్సెప్ట్ కూడా ఉండనుందట. రైడర్స్‌ని విలన్లుగా పరిచయం చేయడంతో మరింత హైప్ పెరిగింది. ఏదేమైనా ఈ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త అధ్యాయాన్ని నెలకొల్పుతుందని చిత్రబృంద సభ్యులు వెల్లడిస్తున్నారు.
స్పెషల్ ఫోకస్..
సినిమాలో టైం మిషన్ కాన్సెప్ట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆదిత్య 369 వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకు మెంటార్‌గా పనిచేస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ఈ సినిమా ఉండబోతోందని ముందుగానే సింగీతం చెప్పారు.
ఈ సినిమాలో ఉపయోగించే కార్ల విషయంలో నాగ్ అశ్విన్ స్పెషల్ ఫోకస్ పెట్టాడు. అధునాతన ఈవీ వెహికల్స్ డిజైన్ విషయంలో సాయం అందించాలని అభ్యర్థించగా మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ముందుకొచ్చారు. ఇలాంటి సినిమాలు తనకు ఇష్టమని కచ్చితంగా హెల్ప్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సినిమా జనవరి 12, 2024న విడుదల కానుంది.
Celebrities Featured Articles Telugu Movies
Prabhas Upcoming Movies: ఇండియాలోని టాప్ డైరెక్టర్స్‌తో ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్!