• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • SS Rajamouli: రాజమౌళిపై స్పెషల్‌ డాక్యుమెంటరీ.. ఎలివేషన్స్‌ ఇవ్వనున్న ఆ స్టార్‌ హీరోలు! 

    భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో ఎస్‌.ఎస్‌. రాజమౌళి (SS Rajamouli) ముందు వరుసలో ఉంటాడు. ఆయన తీసిన ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాలు.. సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలను సంపాదించి పెట్టాయి. ముఖ్యంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. ఆస్కార్‌తో పాటు పలు గ్లోబల్‌ స్థాయి పురస్కారాలను అందుకుంది. ‘RRR’ తనను ఎంతగానో ఆకట్టుకుందని ప్రముఖ హాలీవుడ్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరాన్‌ సైతం ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల ఆస్కార్‌ కమిటీ నుంచి సైతం రాజమౌళికి ఆహ్వానం అందింది. ఇంతటి ఘనకీర్తిని సాధించిన రాజమౌళిపై ఓ డాక్యుమెంటరీ రాబోతోంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఇది స్ట్రీమింగ్‌లోకి రానుంది. 

    ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ పేరుతో..

    దర్శకధీరుడు రాజమౌళిపై ఓ డాక్యుమెంటరీని రూపొందిస్తున్నట్లు దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ (MODERN MASTERS) పేరుతో ఇది రానున్నట్లు తెలిపింది. ‘ఒక మనిషి.. అనేక బ్లాక్‌బస్టర్‌లు.. అంతులేని ఆశయం. ఈ లెజెండరీ దర్శకుడు ఇంత గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డారు? ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇలాంటి అంశాలతో మోడ్రన్‌ మాస్టర్స్‌ రూపొందింది. ఆగస్టు2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రసారం కానుంది’ అని నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ పేర్కొంది. ఈ డాక్యుమెంటరీని అనుపమా చోప్రా సమర్పించనున్నట్లు తెలిపింది. 

    స్టార్‌ సెలబ్రిటీల కామెంట్స్‌!

    ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ డాక్యుమెంట్‌లో రాజమౌళి గొప్పతనం గురించి పలువురు స్టార్‌ సెలబ్రిటీలు మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్‌ దిగ్గజ డైరెక్టర్స్‌ జేమ్స్‌ కామెరాన్‌, జో రోసో రాజమౌళి దర్శకత్వ నైపుణ్యం గురించి చెబుతారని ప్రచారం జరుగుతోంది. అలాగే ప్రభాస్‌, రానా, జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో పాటు ప్రముఖ టాలీవుడ్‌, బాలీవుడ్‌ హీరోలు తమ ఒపినీయన్స్‌ షేర్‌ చేసుకుంటారని సమాచారం. అయితే ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి కెరీర్‌ను స్టార్టింగ్‌ నుంచి చూపిస్తారా? లేదా బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ గురించి మాత్రమే ప్రస్తావిస్తారా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై ఆగస్టు 2న స్పష్టత రానుంది. 

    ఆస్కార్‌ కమిటీకి రాజమౌళి!

    దర్శకధీరుడు రాజమౌళికి ఇటీవల అస్కార్‌ అకాడమీ నుంచి ఆహ్వానం అందింది. దర్శకుల కేటగిరిలో రాజమౌళి (SS Rajamouli), కాస్ట్యూమ్‌ డిజైనర్‌ జాబితాలో రమా రాజమౌళి (Rama Rajamouli) ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సంవత్సరం మొత్తం 57 దేశాల నుంచి 487 మంది సభ్యులకు ఆస్కార్‌ అకాడమీ ఆహ్వానం పంపింది. అందులో భారత్‌ నుంచి వీరిద్దరితో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. షబానా అజ్మి, రితేశ్‌ సిద్వానీ, రవి వర్మన్‌ తదితరులు అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ ఆహ్వానం అందుకున్న వారిలో ఉన్నారు.

    ‘SSMB29’తో బిజీ బిజీ..!

    ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రాజమౌళి తన తర్వాతి మూవీని మహేష్‌ బాబుతో చేయనున్నారు. ఇండియన్ మూవీ హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందనుందని టాక్‌. ఈ సినిమాకి సంబంధించి ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదు. ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌లో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ కథా నేపథ్యం సాగుతుందని ఇప్పటికే రాజమౌళి ప్రకటించారు. కథ కూడా ఇటీవలే ఫైనల్‌ అయినట్లు ఫిల్మ్‌ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ సినిమాలో మహేష్‌ను నెవర్ బిఫోర్ అవతార్‌లో రాజమౌళి చూపించనున్నారని టాక్‌ వినిపిస్తోంది. పాన్ వరల్డ్ రేంజ్‌లో ప్రపంచస్థాయి టెక్నిషియన్లతో రాజమౌళి ఈ సినిమాను రూపొందించనున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv