• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Navratri Dresses: ఈ నవరాత్రుల్లో మరింత అందంగా కనిపించండి

    దేశమంతటా నవరాత్రుల శోభ సంతరించుకుంది. నవరాత్రి అనగా “తొమ్మిది రాత్రులు” అని అర్థం. ఈ తొమ్మిది రోజుల్లో దుర్గాదేవి వివిధ రూపాలను ఎంతో భక్తి శ్రద్ధలతో మహిళలు పూజిస్తారు. ఏడాదికి నాలుగు సార్లు నవరాత్రి జరుగుతుంది, ఇందులో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునేది శార్దీయ నవరాత్రి. ఇది హిందూ చంద్ర కాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసంలో (సెప్టెంబర్-అక్టోబర్) వస్తుంది. ఈ సంవత్సరం, శార్దీయ నవరాత్రి అక్టోబర్ 3న ప్రారంభమవుతూ, అక్టోబర్ 12న దసరాతో ఈ ఉత్సవం ముగుస్తుంది.

    శార్దీయ నవరాత్రి అనేది ఆధ్యాత్మిక దార్శనికత, ఉపవాసం మరియు ప్రార్థన కాలం. ఈ తొమ్మిది రాత్రుల సమయంలో, దుర్గాదేవి దైవ శక్తి పరాకాష్టకు చేరుకుంటుందని హిందువులు నమ్ముతారు. భక్తులు ఆమె ఆశీర్వాదాలను పొందెందుకు పూజిస్తారు. ఈ క్రమంలో దుర్గాదేవి తొమ్మిది రూపాలను ఆరాధిస్తారు, అవి ఆమె శక్తి,  దయ రూపాలను ప్రతిబింబిస్తాయి.

    శార్దీయ నవరాత్రి ఉత్సవాల ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి రోజుకు ఒక నిర్దిష్ట రంగు చీరతో అమ్మవారిని అలంకరించి భక్తులు పూజిస్తారు. ఈ రంగులు దేవి గుణాలు, లక్షణాలను ప్రతిబింబిస్తుంటాయి. నవరాత్రి రోజుల్లో భక్తులు ఈ రంగుల్లో దుస్తులు లేదా ఆభరణాలు ధరించి దేవిని స్మరించి, ఆమె ఆశీర్వాదాలను కోరుకుంటారు. 

    మొదటిరోజు- పసుపు 

    నవరాత్రుల మొదటి రోజు శైలపుత్రి దేవిని పూజించే రోజు. ఈ రోజు పసువు దుస్తులు ధరించడం ఆనవాయితీగా ఉంటుంది. 

    మరి ఈరోజున భక్తి శ్రద్దలతో అమ్మవారిని పూజించడంతో పాటు .. కాస్త ట్రెండీగా కనిపించేందుకు ఇక్కడ మన టాలీవుడ్ హీరోయిన్లు ధరించిన పసుపు రంగు డ్రెస్సింగ్ స్టైల్స్‌ను మీకోసం అందిస్తున్నాం. ఓ లుక్ వేయండి.

    దేవర హీరోయిన్ జాన్వీ కపూర్ .. ఈ ట్రెడిషనల్ పసుపు రంగు చీరలో ఎంత అందంగా ఉందో చూడండి. సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్‌తో ఎంబ్రాయిడరీ లేస్‌తో ప్రీమియం మాస్ షిఫాన్ ఫ్యాబ్రిక్‌పై వచ్చిన అందమైన డిజైనర్ చీర ఇది. ఈ చీర మీకు మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది.

    కృతి శెట్టి లాగా మీరు కూడా ఎల్లో హాఫ్‌ శారీలో అందరి మనసులు దోచుకోవచ్చు.  పసుపు రంగుకు మ్యాచ్‌ అయ్యేలా గ్రీన్ బ్లౌస్ ధరిస్తే.. మీ అందం రెట్టింపు అవడం ఖాయం.

     లైగర్ బ్యూటీ అనన్య పాండే మాదిరి మీరు కూడా  లెహెంగాలో అందంగా కనిపించవచ్చు. ఫ్లోరల్ ముకాయిష్ డిజైన్‌లో మీ అందానికి మెరుగులు దిద్దుకోండి.

    పూజా హెగ్డే లా, మీరు పసుపు రంగు లెహెంగాలో మెరసిపోవచ్చు.  అందంగా సంప్రదాయ కుందన్ ఆభరణాలతో  అలంకరించుకోండి.  మీ సొగసు మరింత రెట్టింపు అవుతుంది.

    ప్రగ్యా జైస్వాల్ సూర్యకాంతి వెలుగులో రెండు రంగుల ఎంబ్రాయిడరీ క్రాప్ టాప్,  ఆకర్షనీయమైన బ్లౌజ్ డిజైన్‌లో మెరిసిపోతుంది. నవరాత్రి వేళ మీరూ ఈవిధంగా కనిపించాలనుకుంటున్నారా. ఇది మంచి ఛాయిస్

    రాశీ ఖన్నా లా, మీరు సిల్క్ డ్రెస్‌లో అట్రాక్ట్ లుక్‌ సొంతం చేసుకోవాలనుకుంటే ఈ డ్రెస్ టైప్ బెస్ట్ ఛాయిస్.  దీనికి మ్యాచింగ్‌గా లాంగ్ ఈయరింగ్స్, బంగారు గాజులు, బర్గండి లిప్ స్టిక్‌తో మీ లుక్ ను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు.

    రకుల్ సింగ్ మాదిరి మోడ్రన్ స్టైల్‌లో అనార్కలి, స్టేట్‌మెంట్ గోల్డ్ నెక్లెస్‌తో కనిపించాలనుకుంటున్నారా… ఈ పండుగ వేళ ఈ డ్రెస్‌ను కచ్చితంగా దీనిని ట్రై చేయండి.

    షెహ్నాజ్ గిల్ పసుపు రంగు డ్రెస్‌లో తన అందాన్ని మరింత వికసింప జేసింది. ఈ డ్రెస్‌తో మీరు కూడా అలా కనిపించవచ్చు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv