2025 సంక్రాంతి బరిలో టాలీవుడ్ నుంచి ముగ్గురు అగ్ర కథానాయకులు నిలిచిన సంగతి తెలిసిందే. రామ్‌చరణ్ (Ramcharan) నటించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer), బాలయ్య ‘డాకూ మహారాజ్’ (Daku Maharaj), వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తలపడేందుకు రెడీ అయ్యాయి. ప్రస్తుతం ఆయా చిత్ర బృందాలు తమ చిత్రాలను ప్రమోట్ చేసుకునేే పనిలో బిజీగా ఉన్నాయి. అయితే ప్రమోషన్స్ పరంగా చరణ్, బాలయ్యలతో పోలిస్తే వెంకటేష్ ముందంజలో ఉన్నారని చెప్పవచ్చు. కెరీర్‌లో ఎప్పుడు లేని విధంగా వెంకటేష్ వినూత్నంగా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. స్టార్ హీరో అన్న గర్వం కొంచెం కూడా లేకుండా హీరోయిన్స్‌తో రీల్స్ చేస్తున్నారు. దీంతో ప్రమోషన్స్ పరంగా వెంకీ మామా సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
‘రేయ్.. కాస్త నవ్వండ్రా’
వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఇందులో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా చేశారు. జనవరి 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో కామెడీకి కేరాఫ్‌గా మారిన దర్శకుడు అనిల్ రావిపూడి, వెంకటేష్ ద్వయం తమదైన శైలిలో మూవీ ప్రమోషన్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సినిమా రిలీజ్‌కు ఆరు రోజుల సమయం ఉండటంతో ఈ విషయాన్ని గుర్తుచేస్తూ ఆసక్తికర రీల్‌ను మూవీ టీమ్ నెట్టింట పోస్టు చేసింది. ఇందులో ఇద్దరు హీరోయిన్స్‌తో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి, పదుల సంఖ్యలో మూవీ బృందం కెమెరావైపు ఎంతో సీరియస్‌గా చూస్తుంటారు. అప్పుడు వెంకీ వచ్చి ‘రేయ్ ఇది ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా రా.. కాస్త నవ్వండి’ అంటూ అక్కడి వారి ముఖాల్లో చిరునవ్వులు తెప్పించారు. ఆ తర్వాత అందరూ కలిసి ‘జయం మనదేరా’ సినిమాలోని ‘చిన్ని ఆశలన్నీ చిందులేసెనే’ పాటకు నవ్వుతూ డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సినీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.
హీరోయిన్స్‌తో స్పెషల్ రీల్
మంగళవారం (జనవరి 7) కూడా ‘సంక్రాంతి వస్తున్నాం’ టీమ్ స్పెషల్ ప్రమోషనల్ వీడియోను నెట్టింట పోస్టు చేసింది. ఇందులో హీరో వెంకటేష్ ఇద్దరు హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కలిసి ఓ సాంగ్‌కు రీల్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. కెరీర్‌లో వెంకటేష్ చేసిన తొలి రీల్ అదే కావడం విశేషం. దీంతో వెంకీ మామాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం తనకు సాధ్యమైనదంతా చేస్తున్నారని అభినందిస్తున్నారు. మూవీపై వెంకటేష్‌కు ఉన్న డెడికేషన్‌కు హ్యాట్యాఫ్ చెబుతున్నారు.
ప్రమోషన్స్ వెనక మాస్టర్ ప్లాన్!
దర్శకుడు అనిల్ రావిపూడి ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vastunnam) ప్రమోషన్స్‌ను పక్కా ప్లానింగ్‌తో చేస్తున్నట్లు అర్ధమవుతోంది. సంక్రాంతికి చరణ్, బాలయ్య చిత్రాల నుంచి గట్టి పోటీ తప్పదని ముందే భావించినా ఈ కుర్ర దర్శకుడు.. ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించేందుకు కొత్త తరహా ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టాడు. ఇందులో అగ్ర కథానాయకుడు వెంకటేష్‌ను భాగస్వామ్యం చేయడం ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు. సాధారణంగా ఏ సినిమా అయిన రిలీజ్‌కు దగ్గరపడుతున్న టైమ్‌లో ఈ విషయాన్ని ఆడియన్స్‌కు తెలియజేస్తూ పోస్టర్స్ రిలీజ్ చేస్తుంటారు. కానీ ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం రోజుకో రిల్ విడుదల చేస్తూ దర్శకుడు అనిల్ రావిపూడి ప్రేక్షకుల అటెన్షన్‌ను గ్రాబ్ చేస్తున్నాడు.
3000 మందితో ఫొటోలు..
ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల 3000 మందితో ఏకధాటిగా ఫొటోలు దిగి నటుడు వెంకటేష్ అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. వెంకీతో ఫొటో కోసం పెద్ద ఎత్తున ఫ్యాన్స్ బారులు తీరడం ఆ వీడియోలో కనిపించింది. క్యూలో నిలబడిన అభిమానులు తమ వంతు రాగానే ఒక్కొక్కరిగా వెంకటేష్‌తో ఫొటో దిగారు. సాధారణంగా సెలబ్రిటీలు ఒకరిద్దరితో ఫొటోలు దిగాలంటేనే నీరసించిపోతారు. అటువంటిది వెంకటేష్ ఏకంగా 3000+ మందితో ఒకేసారి ఫొటోలు దిగడమంటే సాధారణ విషయం కాదని నెటిజన్లు ప్రశంసించారు. ‘వెంకీ మామా నిజంగా గ్రేట్’ అంటూ ఆకాశానికెత్తారు. ఏమాత్రం విసుగులేకుండా ఫ్యాన్స్‌తో ఫొటోలు దిగడాన్ని మెచ్చుకున్నారు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్