• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Allu Arjun Arrest: అల్లు అర్జున్‌కు మద్దతుగా రంగంలోకి చిరంజీవి, కేటీఆర్‌

    పుష్ప 2’ ప్రీమియర్స్‌ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట కేసుకు సంబంధించి హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు హీరో అల్లు అర్జున్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బన్నీ అరెస్టును ఖండిస్తూ టాలీవుడ్‌ సెలబ్రిటీలు, దర్శక నిర్మాతలు ఏకమవుతున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి తన మేనల్లుడు కోసం రంగంలోకి దిగబోతున్నట్లు సమాచారం. మరోవైపు బన్నీ అరెస్టును భారాస కీలక నేత కేటీఆర్‌ సైతం ఖండించంతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

    బన్నీ నివాసానికి మెగా బ్రదర్స్‌

    బన్నీ అరెస్టు నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) తన భార్య సురేఖతో కలిసి అల్లు అర్జున్‌ నివాసానికి వెళ్లారు. అటు సోదరుడు నాగబాబు కూడా చిరంజీవి వెళ్లిన కొద్దిసేపటి తర్వాత బన్నీ నివాసానికి చేరుకున్నారు. బన్నీ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని, తాను తోడుగా ఉన్నామని మెగా బ్రదర్స్‌ అల్లు ఫ్యామిలీకి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.

    నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌

    ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టుకు పోలీసులు తరలించారు. ప్రస్తుతం మేజిస్ట్రేట్‌ కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బన్నీకి రిమాండ్‌ విధించే విషయమై కొద్దిసేపట్లో మెజిస్ట్రేట్ తీర్పు ఇవ్వనున్నారు. 

    బన్నీ కోసం చిరంజీవి.. 

    అల్లు అర్జున్‌ (Allu Arjun Arrest) అరెస్టు నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) రంగంలోకి దిగారు. ‘విశ్వంభర’ (Viswambhara) షూటింగ్‌ను ఆయన ఉన్నపళంగా క్యాన్సిల్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. బన్నీని అరెస్టు చేసిన చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌కు మరికొద్దిసేపట్లో మెగాస్టార్‌ చిరంజీవి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అగ్రనిర్మాత దిల్‌ రాజు, మరికొందరు డైరెక్టర్స్‌తో కలిసి ఇప్పటికే పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అల్లు అర్జున్‌ తండ్రి అల్లు అరవింద్‌తో పాటు సోదరుడు అల్లు శిరీష్‌ కూడా ప్రస్తుతం చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో ఉన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం బన్నీని కోర్టులో హాజరు పరిచే అవకాశముంది. 

    బన్నీ అరెస్టుపై కేటీఆర్‌ ఫైర్‌.. 

    అల్లు అర్జున్‌ (Allu Arjun) అరెస్టుపై భారస నేత, మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR) ఫైర్‌ అయ్యారు. జాతీయ అవార్డు గ్రహీతను ఈ విధంగా అరెస్టు చేయడం పాలకుల అభద్రతకు పరాకాష్ట అని విమర్శించారు. ‘తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తిగా సానుభూతి ఉంది. కానీ నిజంగా ఎవరు విఫలమయ్యారు? అల్లు అర్జున్‌ లాంటి వ్యక్తిని సాధారణ నేరస్థుడిగా భావించి ఇలా చేయెుద్దు. ప్రభుత్వం ఇలా ప్రవర్తించడం సరికాదు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. హైడ్రా వల్ల చనిపోయినవారి కేసులో రేవంత్‌ను కూాడా అరెస్టు చేయాలి’ అంటూ ఎక్స్‌లో కేటీఆర్‌ రాసుకొచ్చారు. 

    అరెస్టుపై సీఎం రియాక్షన్‌ ఇదే.. 

    అల్లు అర్జున్‌ అరెస్టు (Allu Arjun Arrest)పై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి (Telangana CM Revanth Reddy) స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమే అని ఆయన స్పష్టంం చేశారు. ఇందులో తన జోక్యం ఏమీ ఉండదని రేవంత్‌ తేల్చి చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పకొచ్చారు. 

    హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌

    అరెస్టు నేపథ్యంలో హీరో అల్లు అర్జున్‌ హైకోర్టును ఆశ్రయించారు. బన్నీ తరపున అతడి లాయర్లు న్యాయస్థానంలో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు. లంచ్‌ మోషన్‌ కింద తమ పిటిషన్‌ స్వీకరించి బన్నీ అరెస్టును సోమవారం వరకూ వాయిదా వేయాలని కోర్టును కోరారు. మరికొద్దిసేపట్లో ఈ పిటిషన్‌పై హైకోర్టు  ధర్మాసనం విచారించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్‌ను స్థానిక కోర్టులో  చిక్కడపల్లి పోలీసులు హాజరు పరిచే అవకాశముంది. ఈలోపు హైకోర్టు ధర్మాసనం తీర్పు వస్తే దాని ప్రభావం పోలీసులపై పడొచ్చు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv