• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రివ్యూ: ‘పక్కా కమర్షియల్’.. అంత ‘పక్కా’గా లేదు

    పూర్తి కామెడీ సినిమాల డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న మారుతి, హీరో గోపీచంద్ కాంబీనేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘పక్కా కమర్షియల్’ . చాలా రోజుల నుంచి గోపిచంద్ నుంచి సినిమా కోసం ఎదురుచూస్తున్న ఆయన అభిమానులు… ఇది పక్కా ఎంటర్ టైన్మెంట్  పంచుతుందని ఆశలు పెట్టుకుని థియేటర్లకు వెళ్లారు. మరి వారి ఆశలు నెరవేరాయా అసలు సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం. కథేంటి? కథలో పెద్దగా కొత్తదనం ఏమీ లేదు. సత్యరాజ్ ఒక జడ్జి. ఓ కేసులో తానిచ్చిన తీర్పు వల్ల … Read more

    ప్రేమలో పడితే ‘గాల్లో తేలినట్టు’ ఎందుకుంటుందో తెలుసా? 

    ప్రేమ ఒక మధురమైన అనుభూతి. ప్రేమలో ఉంటే అదేదో పాటలో చెప్పినట్లు గాల్లో తేలినట్టు, గుండె పేలినట్టు, రాయిపెట్టి కొట్టినట్టు ఉంటుంది. ప్రతిదీ అందంగా కనిపిస్తుంది. ప్రతిక్షణం ఆనందంగా కూడా ఉంటుంది. గాలికి తిరిగే రాజుగాడు కూడా ఒక్కసారిగా బుద్ధిమంతుడైపోతాడు. అదే ప్రేమ విఫలమైతే బతుకే వ్యర్థమనిపిస్తుంది. ఆ విరహ వేదనలో అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది. మరి ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా.! ఇప్పుడు తెలుసుకుందాం. మెదడుపై ప్రేమ ప్రభావం హృదయంలో అలజడి రేపే జడివానే ప్రేమ అనుకుంటారు అందరూ.. కానీ … Read more

    మిసెస్ ఇంటర్నేషనల్ పోటీల్లో తెలుగు అందం

    మనిషి అందానికి మించి ఆభరణం ఆత్మవిశ్వాసం. మిసెస్ ఇంటర్నేషనల్ పోటీలు ఇదే స్ఫూర్తితో జరుగుతుంటాయి. అమెరికాలో జరిగే ఈ పోటీలకు ఈ ఏడాది కూడా అనేక దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. జూలై 18 నుంచి 23 వరకు జరగనున్న పోటీల్లో ఓ తెలుగు మహిళ రాధికామూర్తి కూడా భాగమవుతున్నారు. కాకపోతే ఆమె యూకే నుంచి ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. నెల్లూరులో పుట్టి పెరిగిన రాధికామూర్తి పన్నెండేళ్ల క్రితం సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్‌గా లండన్‌ కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. కెరీర్, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ… … Read more

    కళ్లముందే ఉన్నా కనిపెట్టలేని పొడుపు కథలు

    ఆటవిడుపు కోసమో, కాలక్షేపానికో పొడుపు కథలు వేసుకోవడం తెలుగువారికి అలవాటు. రకరకాల పొడుపు కథలు మనకు అందుబాటులో ఉంటాయి. కానీ మన నిత్యం చూసేవి, కళ్లముందే ఉన్నా కనిపెట్టలేనివి కొన్ని ఉంటాయి. జవాబు తెలిశాక ఓస్! ఇంతేనా!! అనుకుంటారు. అలాంటివి ఇక్కడ కొన్ని ఉన్నాయి. మీరు ఎన్ని విప్పగలరో చూడండి మరి… చెట్లపై గెంతగలదు కానీ కోతి కాదు, నామాలుంటాయి కానీ పూజారి కాదు ఏమిటది? ఉడత అందరినీ పైకి తీసుకెళ్తుంది కానీ తాను మాత్రం అక్కడే ఉంటుంది ఏమిటది? నిచ్చెన ఇంట్లో ముడుచుకుటుంది … Read more

    జుట్టు ఒత్తుగా కళకళలాడాలా?..ఇవి పాటించండి (hair growth tips)

    రోజు రోజుకూ జుట్టు పలచబడిపోతోందా? షాంపూల మీద షాంపూలు మార్చినా ప్రయోజనం లేదా? ఇది ఇప్పుడు ఒకరిద్దరిది కాదు చాలా మంది యువతలో అతి పెద్ద సమస్య. పెళ్లి కాకముందే అర ఎకరం పోయి అంకుల్స్ లా కనిపిస్తున్నామని యువకులకు బాధపడుతున్నారు. అలాగే అమ్మాయిలు కళ్ల ముందే రాలిపోతున్న కురులను చూసి గొల్లుమంటున్నారు. అసలు ఈ జుట్టు రాలేందుకు కారణాలేంటి?వాటిని ఎలా కాపాడుకోవాలి? ఒత్తైన కురుల కోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. జుట్టు రాలడానికి కారణాలు జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి. … Read more

    భారత క్రికెట్ ముఖచిత్రమే మారిన రోజది!

    జూన్ 25 1983, టీమిండియా క్రికెట్ గమనాన్ని మార్చి తమ ఆగమనాన్ని చాటిన అద్భుతమైన రోజది. ఈ రోజును తలచుకుంటే క్రీడాభిమానుల్లో ఉత్తేజం ఉప్పొంగుతుంది. క్రికెటర్ల నరనరాల్లో స్ఫూర్తి రక్తం ప్రవహిస్తుంది. ఆట మొదలుపెట్టిన అర్ధశతాబ్దానికి తొలి ప్రపంచకప్ ను ముద్దాడిన మధుర గడియలవి. సవాళ్లకు ప్రతిసవాళ్లను విసురుతూ ఎంతో మంది భారతీయులను క్రికెట్ వైపు అడుగులేసేలా చేసిన క్షణాలవి. ఒక్కసారి ఆ రోజులను గుర్తుచేసుకుందాం. తొలి మ్యాచ్ ఆడిన 50 ఏళ్లకు సంచలన మ్యాచ్ ఇండియా మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ ఆడిన రోజు … Read more

    Part 1: దైనందిన జీవితంలో ఉపయోగించే 25 పదాలు, తెలుగులో ఉదాహరణలతో సహా వాటి అర్థాలు

    Wheat meaning in Telugu గోధుమలు ఉదాహరణ వాక్యం: I’ll have wheat bread for breakfast.  నేను బ్రేక్‌ఫాస్ట్‌కి గోధుమ రొట్టె తీసుకుంటాను. Apricot meaning in Telugu నేరేడు పండు ఉదాహరణ వాక్యం: I like apricot fruit నాకు నేరేడు పండు అంటే ఇష్టం bloating meaning in telugu కడుపు ఉబ్బడం, ఉబ్బడం ఉదాహరణ వాక్యం: Since yesterday I feel bloated నిన్నటి నుండి నాకు కడుపు ఉబ్బినట్లు అనిపిస్తుంది brother in law meaning in … Read more

    ఫస్టాఫ్ బాక్సాఫీస్ బాద్‌షాలెవ‌రు? బోల్తా కొట్టిందెవరు?

    దర్శకధీరుడి సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్, బాక్సాఫీస్ దగ్గర డీజే టిల్లు బ్లాక్ బస్టర్ బరాత్,  అడివిశేష్ ‘మేజర్’ సూపర్ హిట్ ఆపరేషన్ ఒకవైపు.. ‘మెగా’ అంచనాలతో అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన ‘ఆచార్య’ లాంటి సినిమాలు మరోవైపు… 2022 తొలి అర్ధభాగంలో తెలుగు సినిమా ప్రయాణం అనూహ్యంగా సాగింది. అంచనాలే లేకుండా వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిస్తే…భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అలాగే ఆర్నెళ్లలో రెండే రెండు ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్లు వస్తే అందులో ఒకటి … Read more

    ‘లంగా వోణి’ వేడుకలో రిటర్న్ గిఫ్ట్స్

    దక్షిణాదిలో ‘లంగా వోణి’ వేడుకకు ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు లోగిళ్లలో అయితే దీనిని మరింత సంబరంగా జరుపుకుంటారు. ఓ పెళ్లి వేడుకకు ఏమాత్రం తీసిపోని విధంగా అలంకరణలు, హంగులూ, ఆర్భాటాలతో తమ గారాలపట్టి ‘లంగా వోణి’ ఫంక్షన్ గురించి నలుగురూ మాట్లాడుకునేలా నిర్వహిస్తారు. ఆడపిల్ల బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టే వేళ..తమ చిట్టితల్లి పెద్దది అయ్యింది..పెళ్లి ఈడుకొచ్చిందని బంధుగణానికి చాటేందుకు ఒకప్పుడు ఈ వేడుక జరిపేవారు. ఇప్పుడు అంత చిన్న వయసులో పెళ్లి చేయకపోయినా…సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఆచారాన్ని అలాగే కొనసాగిస్తున్నారు.  ఈ మధ్యకాలంలో … Read more

    ‘జెర్సీ’ మూవీ కాదు..అంతకుమించినది దినేశ్ కార్తిక్ జీవితకథ

    ఎమోషనల్ రోలర్ కోస్టర్ డ్రామా కథతో తెరకెక్కిన సినిమాకు ఏమాత్రం తీసిపోని జీవితం అతడిది. గుండెతరిగే ఆవేదన..గుండె ధైర్యాన్నిచ్చే పోరాటం. ఓ ప్రేమ, ఓ స్నేహం, అభిమానం, అవమానం, సంతోషం,దు:ఖం.. ఊహించని మలుపులు, అగాథం నుంచి ఆకాశానికి ఎగిసిన స్ఫూర్తి ఇది సినిమా కథ కాదు. దినేశ్ కార్తిక్ నిజజీవిత ప్రయాణం. రీల్ స్టోరీ ‘జెర్సీ’లో నానిని చూసి ఎంతో మంది కదిలిపోయారు. కానీ దినేేశ్ కార్తిక్ కథ అంతకు రెండింతల భావోద్వేగాలున్న రియల్ స్టోరీ. 37 ఏళ్ల వయసులో  టీ20ల్లో గ్రేట్ ఫినిషర్ … Read more