• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Bichagadu 2 Review: సెంటిమెంట్ సీన్లు ఓకే.. సెకండాఫ్ కొంపముంచిందా?

    నటీనటులు : విజయ్‌ ఆంటోని, కావ్య థాపర్, హరీష్‌ పేరడి, జాన్‌ విజయ్‌

    దర్శకత్వం & సంగీతం: విజయ్‌ ఆంటోని

    నిర్మాత : ఫాతిమా విజయ్ ఆంటోని

    సినిమా నిడివి: 2 గం. 28 నిమిషాలు

    2016లో వచ్చిన బిచ్చగాడు సినిమా ఎంతపెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  హీరో 0విజయ్‌ ఆంటోనికి ఆ సినిమా ఎంతగానో పేరు తెచ్చిపెట్టింది. అంతేగాక కాసుల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో  విజయ్‌ ఆంటోని బిచ్చగాడు-2 సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రానికి విజయ్‌ కథానాయకుడిగా నటిస్తూనే స్వీయ దర్శకత్వం చేశాడు. కావ్య థాపర్‌ హీరోయిన్‌గా నటించగా.. ఫాతిమా విజయ్‌ ఆంటోని నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. బిచ్చగాడు-2కు సంబంధించిన ప్రమోషన్ కంటెంట్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచేసింది. కాగా, ఇవాళ (మే 19) బిచ్చగాడు 2 సినిమా రిలీజైంది. తొలిపార్ట్‌ లాగే ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుందా? విజయ్‌కు మరో హిట్‌ను తెచ్చిపెట్టిందా? అసలు సినిమా కథేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. 

    సినిమా కథ

    విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోనీ) దేశంలో అత్యంత సంపన్నుడు. రూ.లక్ష కోట్లకి వారసుడు అయిన గురుమూర్తికి చాలా మంది శత్రువులు ఉంటారు. అయితే  గురుమూర్తి అనుకోకుండా చనిపోతాడు. గురుమూర్తి పోలికలతో ఉన్న బిక్షగాడైన (సత్య)ను పోలీసులు అరెస్టు చేస్తారు. అయితే సత్య సడెన్‌గా గురుమూర్తిగా  ప్రవర్తించడం చేస్తుంటాడు. అతడిలా మాట్లాడటం, ఆలోచించడం చేస్తాడు. అసలు గురుమూర్తిని పోలిన వ్యక్తి ఎవరు? అతడు అతనిలా ప్రవర్తించడానికి కారణమేంటి? అసలు కోటీశ్వరుడైన గురుమూర్తి మరణానికి కారణమేంటి? అనేది మిగిలిన కథ.

    ఎవరెలా చేశారంటే 

    హీరో విజయ్‌ అంటోని ఇందులో తన అత్యుత్తమ నటనను కనబరిచాడు. ఎమోషనల్, యాక్షన్‌ సీన్స్‌లో తనదైన మార్క్‌ను చూపించి మెప్పించాడు. అయితే క్లైమాక్స్‌లో వచ్చే సెంటిమెంట్‌ సీన్‌లో మాత్రం విజయ్ నటన తేలిపోయిందని చెప్పొచ్చు. ఇది సినిమాపై నెగిటివ్‌ ప్రభావం చూపింది. హీరోయిన్‌ కావ్య థాపర్‌కు సినిమాలో పెద్ద స్కోప్‌ లేకపోయిన తన పరిధిమేరకు నటించి ఆకట్టుకుంది. ఆడియన్స్‌ను తన అందచందాలతో అలరించే ప్రయత్నం చేసింది. తెరపై కావ్య ఎంతో గ్లామర్‌గా కనిపించింది. ఇక ఇతర నటీనటులు కూడా తమ పరిధిమేరకు నటించారు. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే?

    దర్శకుడిగా విజయ్‌ అంటోని రొటిన్‌ కథనే బిచ్చగాడు 2 కోసం ఎంచుకున్నాడు. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడిగా ఏమంత కొత్తదనంగా ‌అనిపించదు. మెుదటి పార్ట్‌తో పోలిస్తే సెకండ్‌ పార్ట్‌ తేలిపోయిందని చెప్పొచ్చు. సాగదీత సన్నివేశాలు సహనాన్ని పరీక్షిస్తాయి. విజయ్‌ ఆంటోని స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ కాస్త గాడితప్పినట్లు కనిపిస్తుంది. సినిమా ద్వారా తాను ఏం చెప్పాలనుకున్నాడో విజయ్‌ సమర్థవంతంగా కన్‌వే చేయలేకపోయాడు. ఇక సినిమాలో ఫస్ట్‌ ఆఫ్ మాత్రమే బాగుంది. సెకండాఫ్ మాత్రం కాస్త ట్రాక్ తప్పింది. విజయ్ ఆంటోనీ ఎలివేషన్ సీన్స్ మరీ అతిగా అనిపిస్తాయి. ఇక తెలుగు డబ్బింగ్‌ కూడా సింక్‌ అయినట్లు ‌అనిపించదు.

    సాంకేతికంగా..

    బిచ్చగాడు 2 సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. ప్రొడక్షన్ విలువలు బాగున్నాయి.  బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ హైలెట్‌ ‌అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సాంగ్స్ ఆకట్టుకునేలా లేవు.

    పాజిటివ్ పాయింట్స్

    • విజయ్‌ నటన
    • తొలి భాగం
    • బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్

    నెగిటివ్‌ పాయింట్స్‌

    • సాగదీత సీన్లు
    • హీరో ఎలివేషన్‌ సీన్స్‌
    • స్క్రీన్‌ ప్లే
    • డబ్బింగ్‌

    రేటింగ్‌ 2.25/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv