• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • DATING TIPS: అబ్బాయిలూ..! అమ్మాయిల గురించి ఈ 5 సైకలాజికల్ ఫ్యాక్ట్స్‌ తెలుసా?

    “ఆడదాని మనసును అర్థం చేసుకోవడం కన్నా అరేబియా సముద్రంలో దూకడం మేలు!” చాలా మంది ఇలాంటి మాటలే చెబుతుంటారు. నిజమే! ప్రతి అమ్మాయి తనకు తానే ప్రత్యేకం. కానీ, చాలా మంది అమ్మాయిల్లో కొన్ని ఆలోచనలు, ఆశలు, అభిప్రాయాలు సహజంగా ఉంటాయి. ఎంతో మంది సైకాలజిస్టులు కిందా మీదా పడి వేలు,లక్షల మందిని చూసి, పరిశోధించి, విశ్లేషించి తెలుసుకున్న కొన్ని సంగతులు.. అబ్బాయిలూ మీకోసమే..!!

    ఫన్నీగా ఉండు

    చాలామంది అమ్మాయిలు ఫన్నీగా ఉంటూ నవ్వించే అబ్బాయిలను ఇష్టపడతారు. అది కుళ్లు జోక్‌ అయినా కక్కేసేయండి. తను నవ్వకపోయినా నవ్వించాలనే నీ తాపత్రయాన్ని తన మనసులోనే అభినందిస్తుంది.

    చూసిందా..! ఆగొద్దు!!

    మెట్రో రైలులోనో, బస్టాండులోనో, పార్కులోనో, టూరిస్ట్‌ స్పాట్‌లోనో ఒక అమ్మాయి చూడగానే నచ్చిందా? తనూ నిన్ను చూస్తుందేమో అనిపిస్తోందా?.కానీ వెళ్లాలా వద్దా అని సంకోచిస్తున్నావా? గందరగోళం వద్దు బాసూ. ఒక అమ్మాయి నీకు ‘ఐ కాంటాక్ట్‌’ ఇచ్చిందా!!! ఇక ఆలోచించకు. ఠక్కున వెళ్లి హాయ్‌ చెప్పు. నిన్ను నువు పరిచయం చేసుకో..తప్పకుండా పాజిటివ్‌గా రెస్పాండ్‌ అవుతుంది. 

    బీ కాన్ఫిడెంట్‌

    ఓకే!!  అమ్మాయిలు ఆస్తి, ఉద్యోగం, అందం, బ్యాక్‌ గ్రౌండ్ ఇలా చాలావాటికి ప్రాధాన్యత ఇస్తారనుకో..కానీ అన్నిటికన్నా ముఖ్యం అబ్బాయిలో కాన్ఫిడెన్స్‌. ఆత్మస్థైర్యంతో ఉండే అబ్బాయిలకు అమ్మాయిలు ఇట్టే పడిపోతారని సైకాలజీ చెబుతోంది. నువు నల్లగా ఉన్నావా? తెల్లగా ఉన్నావా? పొట్ట ఉందా? బట్ట ఉందా? ఇది కాదు మ్యాటర్‌! నువ్ ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నావన్నదే ముఖ్యం. కాన్ఫిడెన్స్‌ను ఆభరణంలా ధరించు. అది ఎలా మెరవాలంటే నువ్‌ ఎవడికీ తక్కువ కాదని అవతలి  వాడికి అనిపించేలా…!!

    మాట్లాడు

    ఇది ఓ సైకాలజీ ముచ్చట. సంభాషణ ప్రారంభించాలని తాపత్రయపడే అబ్బాయిలకు అమ్మాయిలు ఎక్కువగా ఆకర్షితులు అవుతారట. అదీ ఏ ఒక్కసారో ప్రయత్నించి వదిలేస్తే కాదు సోదరా!! ప్రతిసారి ఏదో ఒక వంక పెట్టుకుని మాట్లాడే ప్రయత్నం చేయాలి. కన్సిస్టెన్సీ ముఖ్యం బిగిలూ..

    చెప్పకు.. చెయ్‌..

    మాటల కోతల రాయుళ్ల కంటే కార్యసాధకులకే అతివలు మొగ్గుచూపుతారట. అంటే….!! ఇది చేస్తా! అది చేస్తా! అని కోతలు కోయకు. ఏం చేయగలవో చేసి చూపించు. నీ వల్ల కాదు అన్న పిల్ల కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది.

    చివరిగా ఒక మాట. ఇది అమ్మాయిల కోసం కాదు గానీ అందరి కోసం. ‘జీవితంలో చేసిన పనుల కన్నా చేయలేకపోయిన పనుల గురించే ఎక్కువ పశ్చాత్తాప పడతాం” ఉదాహరణకు నువ్‌ ఏదైనా తప్పు చేసినా దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. సరిదిద్దుకున్నాక ఆ పశ్చాత్తాప భావన పోతుంది. కానీ ఏదైనా చేయాలనుకుని చేయలేకపోతే మాత్రం ఆ సమయం దాటాక నువ్ ఎంత చింతించినా చిటికెడు ప్రయోజనం కూడా ఉండదు. సో అమ్మాయి విషయంలోనైనా సరే జీవితం విషయంలోనైనా సరే.. ఏదైనా అనిపించిందా. అడుగు వెయ్‌. ఆ తర్వాత అయ్యో వేయలేకపోయానే అని ఏడ్వటం కంటే వేశాక ఏం జరుగుతుందో చూద్దాం అనుకని ముందుకెళ్లడం బెటర్‌ కదా!!!!

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv