యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఓం భీమ్ బుష్’ (Om Bheem Bush). హాస్య నటులు ప్రియదర్శి (Priyadarsi), రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) లీడ్ రోల్‌లో చేశారు. మార్చి 22న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. శ్రీవిష్ణు కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. శుక్రవారం (ఏప్రిల్ 12) ఓటీటీలోకి ఈ సినిమా రాగా.. అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. కాగా, మూవీలోని చాలా సీన్లలో ప్రభాస్‌ను రిఫరెన్స్‌గా తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)కు ప్రస్తుతం దేశ, విదేశాల్లో అభిమానులు ఉన్నారు. అటువంటి ప్రభాస్‌ను రిఫరెన్స్‌గా తీసుకుంటే ఎక్కువ రీచింగ్ ఉంటుందని ‘ఓం భీమ్ బుష్’ టీమ్ భావించినట్లు ఉంది. అందుకే సినిమాలో ఎక్కువ సార్లు ప్రభాస్‌ను రిఫరెన్స్‌గా తీసుకున్న సీన్లు కనిపించాయి. రాధేశ్యామ్ (Radhe Shyam), ఆదిపురుష్ (Adipurush), సలార్ (Salaar) సినిమాలకు సంబంధించిన డైలాగ్స్ వినిపించాయి. ముఖ్యంగా హీరో శ్రీవిష్ణు.. సలార్‌లోని ప్రభాస్‌ను ఇమిటేట్ చేస్తూ చెప్పే ‘ఐ కైండ్లీ రిక్వెస్ట్’ (I Kindly Request) అనే డైలాగ్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది.
ఓటీటీలో రికార్డు రెస్పాన్స్!
‘ఓం భీమ్ బుష్’ సినిమా.. థియేటర్లలో మంచి విజయం సాధించడంతో ఈ మూవీ కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ వచ్చారు. 20 రోజులు కూడా గడవకముందే మేకర్స్ ఈ మూవీని ఓటీటీలోకి తీసుకొచ్చి మేకర్స్ అందర్నీ ఆశ్చర్యపరిచారు. అమెజాన్‌లో ప్రైమ్‌లో ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి తొలిరోజే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తొలి 24 గంటల్లో ఇండియా వైడ్‌గా రెండో స్థానంలో ఓం భీమ్ బుష్ ట్రెండింగ్ అవుతోంది. వీలుంటే ఈ వీకెండ్ మీరూ సినిమాను చూసేయండి.
నెట్టింట మూవీ డైలాగ్స్ వైరల్!
అమెజాన్‌లో ‘ఓం భీమ్ బుష్’ సినిమాను చూసిన వారు.. సోషల్ మీడియాలో మూవీ క్లిప్స్‌ను షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాలోని ఫన్నీ డైలాగ్స్‌ను అందరితో పంచుకుంటున్నారు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మధ్య వచ్చే కామెడీ ట్రాక్స్.. నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు దయ్యంతో తన ఇష్టా ఇష్టాల గురించి శ్రీ విష్ణు చెప్పే డైలాగ్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. సినిమాలో ఓ పాట తమకు బాగా నచ్చిదంటూ ఆ సాంగ్‌ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
‘ఓం భీమ్ బుష్’ కథేంటి?
క్రిష్ (శ్రీవిష్ణు), వినయ్ (ప్రియదర్శి), మాధవ్ (రాహుల్ రామకృష్ణ) మంచి స్నేహితులు. జీవితంపై శ్రద్ద లేకుండా సిల్లీ పనులు చేస్తూ కాలాన్ని గడుపుతుంటారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామంలో అడుగుపెడతారు. మరి ఈ ముగ్గురు సైంటిస్టులుగా ఎలా మారారు? అక్కడి పరిస్థితులు వీరిని ఎలా మార్చాయి? ఆ ఊరిలోని సంపంగి దెయ్యం ఉన్న కోటలో ముగ్గురు ఎందుకు అడుగుపెట్టారు? ఆ దెయ్యానికి క్రిష్‌కి ఉన్న సంబంధం ఏంటి? కోటలోకి అడుగు పెట్టిన ఈ బిగ్‌బ్యాంగ్ బ్రదర్స్‌కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఈ మధ్యలో జలజాక్షి (ప్రీతి ముకుంద్)తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది? అనేది మిగిలిన కథ.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది