• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Hit 3 Movie: సైకో కిల్లర్‌గా రానా దగ్గుబాటి.. నానితో బిగ్‌ ఫైట్‌కి రెడీ!

  టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉన్న యంగ్‌ హీరోల్లో నాని (Nani), దగ్గుబాటి రానా (Daggubati Rana) ముందు వరుసలో ఉంటారు. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లోనూ వీరిద్దరికీ మంచి ఫాలోయింగ్ ఉంది. జానర్‌తో సంబంధం లేకుండా వీరు తమ మార్క్‌ నటనతో మెప్పిస్తుంటారు. అటు బయట కూడా నాని-రానా మంచి ఫ్రెండ్స్‌గా గుర్తింపు పొందారు. ఇటువంటి కథానాయకులు ప్రత్యర్థులుగా మారితే? సినిమాలో ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటే? ఊహిస్తేనే ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది కదా. అయితే ఇది ఊహా మాత్రమే కాదు.. త్వరలోనే నిజమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ క్రైమ్‌ థ్రిల్లర్ మూవీలో వీరిద్దరు హీరో విలన్లుగా కనిపించబోతున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. 

  ‘హిట్‌ 3’ మూవీలో..

  టాలీవుడ్‌లో ‘హిట్’ (Hit) సినిమా సిరీస్‌లకు మంచి క్రేజ్‌ ఉంది. శైలేష్‌ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో వచ్చిన ‘హిట్‌’ (Hit: The First Case), ‘హిట్‌ 2’ (Hit 2 : The Second Case) సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇందులో హీరోలుగా చేసిన విశ్వక్‌ సేన్‌, అడవి శేష్‌లకు కెరీర్‌ పరంగా మంచి మైలేజ్‌ను తీసుకొచ్చాయి. ఇక హిట్‌ సిరీస్‌కు కొనసాగింపుగా రానున్న పార్ట్‌ 3 చిత్రంలో నాని హీరోగా చేయనున్నట్లు సెకండ్‌ పార్ట్‌ ఎండింగ్‌లోనే డైరెక్టర్‌ క్లారిటీ ఇచ్చారు. దీంతో ‘హిట్‌ 3’ (Hit 3: Third Case) ఎప్పుడు మెుదలవుతుందా అని మూవీ లవర్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే చాలాకాలం తర్వాత ‘హిట్‌ 3’ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ బయటకొచ్చింది. ఇందులో నానికి ప్రత్యర్థిగా దగ్గుబాటి రానా కనిపించబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఈ వార్త టాక్‌ ఆఫ్‌ టాలీవుడ్‌గా మారిపోయింది. 

  సైకో కిల్లర్‌గా రానా?

  ‘హిట్‌’, ‘హిట్‌ 2’ చిత్రాలను పరిశీలిస్తే ఈ రెండు సినిమాలు.. వరుస హత్యలు, సైకో కిల్లర్‌, పోలీసు ఇన్‌వెస్టిగేషన్‌ నేపథ్యంలోనే వచ్చాయి. కాబట్టి ‘హిట్‌ 3’ కూడా ఆ తరహా కథాంశంతోనే రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో నాని.. పవర్‌ఫుల్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నాడు. ఇక నానిని ఢీకొట్టే స్థాయిలోనే రానా పాత్ర ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రానాకు తన పాత్రను వివరించగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు టాక్‌ వినిపిస్తోంది. ఇక ‘హిట్‌ 3’లో రానా క్రూరమైన సైకో కిల్లర్‌గా కనిపించనున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. అతడి పాత్ర ఎంతగానో భయపెడుతుందని అంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఉండనున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

  టైటిల్‌ ఛేంజ్‌..!

  నేచురల్‌ స్టార్‌ నాని నటించిన గత రెండు చిత్రాలు ‘దసరా’ (Dasara), ‘హాయ్‌ నాన్న’  (Hi Nanna) మంచి విజయాన్ని సాధించాయి. దీంతో ప్రస్తుతం నాని హ్యాట్రిక్‌ హిట్స్‌పై ఫోకస్‌ పెట్టాడు. ఆయన నటించిన ‘సరిపోదా శనివారం’ త్వరలోనే విడుదల కానుంది. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహనన్‌ హీరోయిన్‌గా చేస్తోంది. గతంలో ఈ హీరో – హీరోయిన్‌ – డైరెక్టర్‌ కాంబోలోనే ‘గ్యాంగ్‌ లీడర్‌’ (Gang Leader) అనే సినిమా రిలీజై యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో నాని, ప్రియాంక జంటకు మంచి మార్కులు పడ్డాయి. కాగా, ‘సరిపోదా శనివారం’ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో రాబోతోంది. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళం, కన్నడ వెర్షన్స్‌లో ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నారు. తెలుగు మినహా మిగతా భాషల్లో ఈ మూవీని ‘సాటర్‌ డే’ (Saturday) టైటిల్‌తో రిలీజ్‌ చేయబోతున్నారు. ఆగస్టు 29న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. 

  క్రేజీ కాంబో లాక్‌..!

  టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబో లాకైనట్లు తెలుస్తోంది. నేచరల్‌ స్టార్‌ నాని, స్టార్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు సమాచారం. ఇటీవలే నానిని కలిసిన శేఖర్‌ కమ్ముల.. మూవీకి సంబంధించిన లైన్‌ను చెప్పారట. అది నానికి బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారని ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమా ఏషియన్‌ సునీల్‌ నిర్మించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నాని, శేఖర్‌ కమ్ముల కాంబోలో గతంలో సినిమా రాలేదు.. ఇదే ఫస్ట్‌ టైమ్‌. ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల.. ‘కుబేర’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ధనుష్‌, నాగార్జున హీరోలుగా చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత నాని ప్రాజెక్ట్‌పై శేఖర్‌ కమ్ముల ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. 

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv