• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Kalki 2898 AD: ‘కల్కి’ రన్‌టైమ్‌ లాక్‌.. సినిమా బడ్జెట్‌పై ప్రభాస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

    ప్రభాస్‌ (Prabhas) హీరోగా చేస్తున్న లేటెస్ట్ సైన్‌ ఫిక్షన్‌ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో దిగ్గజ నటులు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ నటిస్తున్నారు. బాలీవుడ్‌ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా, కల్కి సినిమా విడుదలకు ఇంకా నాలుగు వారాలే గడువు ఉండటంతో మేకర్స్‌ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులపై ఫోకస్‌ పెట్టారు. ఈ క్రమంలోనే రన్‌ టైమ్‌ను లాక్‌ చేసినట్లు ఓ బజ్‌ బయటకొచ్చింది. మరోవైపు ఈ సినిమా బడ్జెట్‌పై హీరో ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం. 

    కల్కి రన్‌టైమ్‌ ఎంతంటే?

    ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రాన్ని జూన్‌ 27న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మూవీలోని పాత్రలను ఒక్కొక్కరిగా రివీల్‌ చేస్తున్నారు. ఈ కోవలోనే ప్రభాస్‌ (భైరవ), అమితాబ్‌ బచ్చన్‌ (అశ్వత్థామ), బుజ్జి (రోబోటిక్‌ వెహికల్‌) పాత్రలు బయటకొచ్చాయి. అయితే తాజా అప్‌డేట్‌ ప్రకారం ఈ మూవీ రన్‌టైమ్‌ను కూడా మేకర్స్ ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినినా నిడివిని 3.10 గం.లుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు దగ్గరకు వెళ్లి ఏమైన కత్తెరలు పడినా కూడా నిడివి 3 గం.లకు తగ్గే పరిస్థితి ఉండదని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే రన్‌టైమ్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

    దాని వల్లే కల్కి బడ్జెట్ పెరిగింది: ప్రభాస్‌

    కల్కి సినిమా ప్రమోషన్స్‌ భాగంగా హీరో ప్రభాస్‌, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఓ నేషనల్‌ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమా బడ్జెట్‌పై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కల్కి చిత్రాన్ని దేశ ప్రజలతో పాటు వరల్డ్‌ వైడ్‌గా ఉన్న సినీ లవర్స్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించినట్లు చెప్పారు. ఈ క్రమంలో బడ్జెట్‌ భారీగా పెరిగిందని అన్నారు. గ్లోబల్‌ రేంజ్‌ సినిమా కావడం వల్ల కల్కిలోని పాత్రల పేర్లు కూడా కాస్త డిఫరెంట్‌గా ఉంటాయని చెప్పారు. డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌ మాట్లాడుతూ.. కల్కి సినిమా చూశాక ప్రేక్షకులు మరో కొత్త ప్రపంచంలోకి వెళ్లొచ్చామనే భావనలోకి వెళ్తారని అన్నారు. అవతార్‌ చూశాక పొందిన కొత్త అనుభూతినే కల్కి తర్వాత ప్రేక్షకులు పొందుతారని హామి ఇచ్చారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, ఇంగ్లీషుతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా కల్కి విడుదల కానున్నట్లు పేర్కొన్నారు.

    చెన్నై వీధుల్లో బుజ్జి సందడి

    కల్కి చిత్రంలో కీలకమైన బుజ్జి వాహనాన్ని ఇటీవల చిత్ర యూనిట్‌ ఆవిష్కరించింది. ఆ మూవీని పలు నగరాల్లో తిప్పుతూ చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌ చేస్తోంది. తాజాగా చెన్నై వీధుల్లో బుజ్జి సందడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ తన ఎక్స్‌ ఖాతాలో పంచుకుంది. కాగా, ఇప్పటికే ఈ వాహనాన్ని టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగ చైతన్య డ్రైవ్‌ చేశారు. మరోవైపు బుజ్జిని నడపాలంటూ టెస్లా, స్పెస్‌ ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ను దర్శకుడు నాగ్ అశ్విన్‌ కోరారు. 

    31న స్పెషల్‌ వీడియో!

    కల్కి సినిమాలో బుజ్జి – భైరవ (ప్రభాస్‌) ప్రయాణం ఎలా సాగిందో తెలియజేసేందుకు మే 31న ఓ స్పెషల్‌ వీడియోను మేకర్స్‌ విడుదల చేయబోతున్నారు. ‘బుజ్జి అండ్‌ భైరవ’ (Bujji And Bhairava) పేరుతో రూపొందిన ఈ ప్రత్యేక వీడియో అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. చిన్నారులను ఎంటర్‌టైన్‌ చేసే ఉద్దేశ్యంతో ఓ కార్టూన్‌ రూపంలో వీడియోను రూపొందించినట్లు ఇటీవల విడుదలైన గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. ఇందులో ఏముందో తెలియాలంటే స్పెషల్‌ వీడియో వచ్చేవరకూ ఆగాల్సిందే. 

    తెలుగులో అత్యధిక రన్‌టైమ్‌ చిత్రాలు

    కల్కి తరహాలోనే ఇప్పటివరకూ అత్యధిక రన్‌టైమ్‌ కలిగిన చిత్రాలు తెలుగులో చాలానే వచ్చాయి. వాటి గురించి తెలుసుకునేందుకు ఈ క్రింది లింక్‌పై క్లిక్‌ చేయండి. 

    https://telugu.yousay.tv/tfidb/list/Animal_Runtime_3.21_Hours:_Do_You_Know_the_Longest-Running_Telugu_Movie$$7660d6ac-0846-43e3-b679-c28804e28ed4

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv