రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబోలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లలను రాబట్టింది. జూన్ 27న విడుదలైన ఈ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులను కొల్లగొట్టింది. సినిమా విడుదలై 50 రోజులు దాటినప్పటికీ కూడా థియేటర్లలో కల్కి హవా కొనసాగుతూనే ఉంది. అయితే ‘కల్కి’ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ స్ట్రీమింగ్కు సంబంధించి క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
కల్కి ఓటీటీ డేట్ లాక్?
‘కల్కి 2898 ఏడీ’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 23న ఈ సినిమాను స్ట్రీమింగ్‌లోకి తీసుకురావాని అమెజాన్ వర్గాలు నిర్ణయించినట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. అయితే థియేటర్ వెర్షన్ కాకుండా సినిమాను కాస్త ట్రిమ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అసలు రన్టైమ్కు 6 నిమిషాల ఫుటేజీని కట్ చేసే అవకాశమున్నట్లు టాక్. ఓటీటీ రిలీజ్, రన్టైమ్కు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రన్‌టైమ్‌ను కుదించే విషయంపై ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. థియేటర్ వెర్షన్లో లేని సీన్స్‌ను అదనంగా యాడ్ చేయాల్సింది పోయి ఉన్న వాటిని ట్రిమ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
షారుక్‌ను వెనక్కి నెట్టిన ప్రభాస్
2024లో ఇప్పటివరకూ విడుదలైన చిత్రాల్లో ‘కల్కి 2898 AD’ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. రిలీజ్ నుంచి ఆదరణ పొందుతూ కొత్త కొత్త రికార్డులను సృష్టించింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ.760కోట్లుకు పైగా వసూళ్లను ‘కల్కి’ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. తద్వారా బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమా ఆల్ టైమ్ ఇండియా కలెక్షన్స్ రికార్డును కల్కి బ్రేక్ చేసినట్లు పేర్కొన్నాయి. ఇండియన్ బాక్సాఫీస్‌లో ‘జవాన్’ సినిమా కలెక్షన్స్ రూ.760 కోట్లుగా ఉన్నాయి. ‘కల్కి’కి ముందు వరకూ ఈ జాబితాలో నాల్గో స్థానంలో ‘జవాన్’ ఉంటూ వచ్చింది. లేటెస్ట్ కలెక్షన్స్ ప్రకారం భారతీయ చలనచిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా ‘కల్కి 2898 AD’ నిలిచింది. తొలి మూడు స్థానాల్లో ‘బాహుబలి- 2’, ‘KGF-2’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు ఉన్నాయి.
కల్కి 2 ఇప్పట్లో లేనట్లే!
‘కల్కి 2898 ఏడీ’ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో రెండో పార్ట్ కోసం అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ‘కల్కి 2’ చిత్రం వచ్చే ఏడాది జూన్ – జులై కల్లా రిలీజ్ అవుతుందని నిర్మాత అశ్వని దత్ గతంలో వ్యాఖ్యానించారు. ఇప్పటికే 60 శాతం షూటింగ్ కూడా పూర్తైనట్లు పేర్కొన్నారు. అయితే రీసెంట్ బజ్ ప్రకారం ‘కల్కి 2’ రీమైనింగ్ షూటింగ్‌కు దీపిక పదుకొనే వల్ల బ్రేకులు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దీపికా పదుకొనే ప్రెగ్నెంట్. సెప్టెంబర్‌లో ఆమె బిడ్డకు జన్మనివ్వనుంది. బిడ్డ పుట్టాక కనీసం ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని ఆమె నిర్ణయించుకున్నారట. ఇందులో భాగంగా తనకు ఎంతో ఇష్టమైన రోహిత్ శెట్టి ప్రాజెక్టును వదులుకున్నారట. అలాగే ఓ ప్రముఖ బాలీవుడ్ షోకు సైతం దీపిక నో చెప్పినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి ‘కల్కి 2’ షూటింగ్‌కు కూడా ఆమె దూరంగా ఉండే ఛాన్స్ ఉంది. అదే జరిగితే ‘కల్కి 2’ చిత్రం వచ్చే ఏడాది కాకుండా 2026లో రిలీజయ్యే అవకాశముంది.
ఫుల్ స్వింగ్‌లో ప్రభాస్!
ప్రస్తుతం దేశంలో ఏ స్టార్ హీరో చేతిలో లేనన్ని పాన్ ఇండియా చిత్రాలు ప్రభాస్ లిస్ట్‌లో ఉన్నాయి. ప్రభాస్ ఏ డైరెక్టర్‌కైనా ఓకే చెప్తే ఆ ప్రాజెక్ట్ మెుదలయ్యేది 2026 తర్వాతనే. ప్రభాస్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ (Raja Saab) చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తర్వాత సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి స్పిరిట్ (Spirit) అనే టైటిల్ ఖరారు చేశారు. వీటితో పాటు ‘సలార్ సీక్వెల్’ ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించే ఈ చిత్రం ‘NTR 31’ తర్వాత సెట్స్‌పైకి వెళ్లనుంది. వీటితో పాటు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’లోనూ ప్రభాస్ శివుడి పాత్ర పోషించనున్నాడు. అలాగే హను రాఘవపూడితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాలన్నీ పూర్తవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్