• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Malavika Mohanan: వైట్ అరేబియన్ గుర్రంలా మాళవిక అందాలు

    మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్‌.. తన గ్లామర్‌ షోతో మరోమారు నెట్టింట వైరల్‌గా మారింది. చాలీ చాలని గౌనులో ఫొటో షూట్‌ నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించింది. 

    తాజాగా ఫ్లవర్‌ డాట్‌ స్లీవ్‌లెస్‌ గౌనులో కనిపించిన ఈ అమ్మడు తన ఎద అందాలతో సోషల్‌ మీడియాలో రచ్చ రేపింది.

    మతిపోగొట్టే విధంగా థైస్‌ అందాలను చూపిస్తూ ఫ్యాన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. చురకత్తుల్లాంటి చూపులతో మరోమారు వారి మనసు దోచేసింది. 

    ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ ‘ఏం సొగసురా బాబు’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మాళవిక హాట్‌ పిక్స్‌ను విపరీతంగా షేర్‌ చేస్తూ ట్రెండింగ్‌ చేస్తున్నారు.

    ఈ బ్యూటీ వ్యక్తిగత విషయాలకు వస్తే.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మోహన్‌కు మాళవిక మోహన్  కుమార్తె. ఆమె కుటుంబం కేరళకు చెందినది అయినా పుట్టి పెరిగింది మాత్రం ముంబైలోనే.

    ‘పెట్టం పోలె’ అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది మాళవిక. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘పేట’ చిత్రంలో కీలక పాత్రలో నటించింది.

    అనంతరం ‘మాస్టర్’ సినిమాలో విజయ్ సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ సినిమా తరువాత నుంచి మాళవిక వరుస అవకాశాలను అందుకుంటూ వస్తోంది.

    ఈ క్రమంలోనే ధనుష్‌ పక్కన ‘మారన్‌’ చిత్రంలో నటించి మాళవిక తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.

    2020లో ‘మసాబా మసాబా’ అని టెలివిజన్‌ సిరీస్‌లోనూ మాళవిక నటించింది. ఇది నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఇంగ్లీషు భాషలో స్ట్రీమింగ్‌లో ఉంది. 

    గతేడాది క్రిస్టీ (Christy) అనే మలయాళ చిత్రంలో నటించిన మాళవిక.. తన నటనతో అక్కడి ప్రేక్షకులను కట్టిపడేసింది.

    ప్రస్తుతం ప్రభాస్‌ (Prabhas) హీరోగా చేస్తోన్న ‘రాజా సాబ్‌’ (Raja Saab)లో మాళవిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా సక్సెస్‌తో తెలుగులో మరిన్ని ఆఫర్లు దక్కించుకోవాలని ఈ ముద్దుగుమ్మ భావిస్తోంది. 

    ‘రాజా సాబ్‌’ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లోనూ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం విజయం సాధిస్తే మాళవికకు పాన్‌ ఇండియా స్థాయిలో తిరుగుండదని ఫ్యాన్స్‌ అంచనా వేస్తున్నారు.

    తమిళంలో విక్రమ్‌తో ‘తంగలాన్‌’ (Thangalaan) అనే సినిమాలో మాళవిక నటిస్తోంది. అలాగే హిందీలో ‘యుద్ర’ (Yudhra) ఫిల్మ్‌లో చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. 

    ఇక మాళవిక అవార్డుల విషయానికి వస్తే.. 2019లో ‘బియాండ్‌ ది క్లౌడ్స్‌’ అనే బాలీవుడ్‌ చిత్రానికి గాను ‘యాక్టింగ్‌ సెన్సేషన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును ఆమె గెలుచుకుంది. 

    అలాగే 2022లో ‘మాస్టర్‌’ చిత్రానికి గాను బెస్ట్‌ అరేంగేట్ర నటిగా మాళవిక మోహనన్‌ నామినేట్‌ అయ్యింది. కొద్దిలో సైమా అవార్డును చేజార్చుకుంది.

    వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్‌ మీడియాలోనూ మాళవిక చురుగ్గా వ్యవహరిస్తోంది. తన అందాల ఆరబోతతో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. 

    స్టన్నింగ్ ఫిగర్‌తో హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ ఆమె నిత్యం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 4 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv