నటీనటులు : నరేష్, పవిత్ర లోకేష్, శరత్ బాబు, జయసుధ, అనన్య నాగల్ల, అన్నపూర్ణ
డైరెక్టర్ : M.S. రాజు
సంగీతం : సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫి : బాల్ రెడ్డి
నరేష్ – పవిత్ర లోకేష్ జంటగా చేసిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’. ప్రముఖ నిర్మాత ఎం.ఎస్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తొలి పోస్టర్ విడుదలైనప్పటి నుంచే ఈ సినిమా వివాదస్పదంగా మారింది. నరేష్ వైవాహిక, వ్యక్తిగత జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినట్లు ప్రచారం జరిగింది. దీంతో సినిమాపై నిషేధం విధించాలని నరేష్ మూడో భార్య కోర్టుకు కూడా వెళ్లింది. ఇన్ని వివాదాల మధ్య ఇవాళ (మే 26) మళ్లీ పెళ్లి సినిమా విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుందా?
ఈ చిత్రం ద్వారా నరేష్ ఇచ్చిన సందేశం ఏంటీ? ఈ పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.
కథ
నరేష్, పవిత్ర లోకేష్, రమ్య రఘుపతి మధ్య జరిగిన సంఘటనల సమాహారమే ‘మళ్లీ పెళ్లి’ సినిమా కథ. ఈ చిత్రం స్టోరీని చెప్పడం కంటే థియేటర్‌లో వీక్షించడమే బెటర్. నరేష్ జీవితంలోని కాంట్రవర్సీలతో సినిమా అంతా సాగింది. నరేష్, పవిత్రల మధ్య ఉన్న రిలేషన్ ఎక్కడి నుంచి మొదలైంది అనే విషయాలు మళ్లీ పెళ్లిలో చూపించారు. నరేష్, తన మూడో భార్య రమ్య రఘుపతికి మధ్య మనస్పర్థలు ఎక్కడ వచ్చాయి కూడా సినిమాలో తెరకెక్కించారు. నరేష్-పవిత్ర ఓ హోటల్ లో దొరకడం, అది మీడియాలో రావడం వంటి నిజ జీవితంలో జరిగిన సన్నివేశాలు కూడా కథలో ఇమిడి ఉన్నాయి. నరేష్ జీవితంలోని వివాదాల సుడిగుండం గురించి ఒక స్పష్టత కావాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే..
‘మళ్లీ పెళ్లి’ సినిమాలో నరేష్, పవిత్ర లోకేష్ నటన ఆకట్టుకుంది. రమ్య రఘుపతి పాత్ర పోషించిన వనిత కూడా మెప్పించింది. అన్ని యదార్థ సంఘటనలే కావడంతో నరేష్, పవిత్ర నటన కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. శరత్ బాబు, జయసుధ, అనన్య నాగల్ల, అన్నపూర్ణ తమ పరిధి మేరకు నటించి అలరించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
మళ్లీ పెళ్లి సినిమాకు ప్రముఖ నిర్మాత ఎం.ఎస్ రాజు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఆయన లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను చాలా చక్కగా తెరకెక్కించారు. తొలిభాగం కాస్త ల్యాగ్ అనిపించిన సెకాండాఫ్‌లో వచ్చే నరేష్ – పవిత్ర మధ్య లవ్ సీన్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. అయితే సినిమాలో పవిత్ర లోకేష్ క్యారెక్టర్‌ను తప్పుగా ప్రొజెక్ట్ చేశారు. నరేష్ మూడో భార్యను పాజిటివ్‌గా చూపించారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా లేదా అనేది డైరెక్టర్, నరేష్‌కే తెలియాలి. అయితే, నరేష్ స్టోరీ తెలియని వారికి మాత్రం సినిమా అంతగా ఎక్కదు.
టెక్నికల్‌గా
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సురేష్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
- నరేష్, పవిత్ర నటన
- క్లైమాక్స్
- లవ్ సీన్స్
- నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
- ఫస్టాప్
- సాగదీత
- ఆసక్తి పెంచేలా కథ లేకపోవడం
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!