• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Pushpa 2 Second Single: శ్రీవల్లితో పుష్ప గాడి డ్యూయెట్‌.. రేపు ఎప్పుడంటే?

    టాలీవుడ్‌లో రానున్న మోస్ట్‌ అవెయిటెడ్‌ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa : The Rule) ఒకటి. 2021లో విడుదలైన ‘పుష్ప ది రైజ్‌’కు కొనసాగింపుగా రానున్న దీని కోసం సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్ షురూ చేసింది. ఇటీవలే ‘పుష్ప 2 ‘టైటిల్‌ సాంగ్‌ రిలీజ్‌ చేయగా అది పాన్‌ ఇండియా స్థాయిలో అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇదే ఊపులో రెండో సింగిల్‌కు కూడా చిత్ర యూనిట్‌ ముహోర్తం ఖరారు చేసింది. 

    రిలీజ్‌ ఎప్పుడంటే!

    ‘పుష్ప 2’ సెకండ్ సింగిల్‌ను రేపు (మే 23) ఉదయం 11:07 నిమిషాలకి రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. ఇందులో రష్మిక మందనతో బన్నీ చిందేయబోతున్నట్లు చెప్పింది. ఈ రొమాంటిక్ సాంగ్ ఆడియన్స్‌ను ఫిదా చేస్తుందని చెప్పుకొచ్చింది. ‘పుష్ప పుష్ప..’ సాంగ్‌తో ఇటీవల పుష్ప రాజ్ దుమ్మురేపాడు. ఇప్పుడు శ్రీవల్లి తన సామితో కలిసి మన మనసులు కొల్లగొట్టబోతుంది అంటూ మేకర్స్‌ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. #Pushpa2SecondSingle హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. 

    ఆ పాటను మరిపిస్తుందా!

    పుష్ప సినిమాలోని ‘నా సామీ రారా సామీ’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రొమాంటిక్‌ మెలోడీగా వచ్చిన ఈ పాట అప్పట్లో యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో రష్మిక నడుమును బెండ్‌ చేసి వేసే హుక్‌ స్టెప్‌ కూడా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఈ స్టెప్‌ను అప్పట్లో యూత్‌ రీల్స్‌ చేసి తెగ ట్రెండ్‌ చేశారు. ఇప్పుడు ‘పుష్ప 2’ నుంచి రాబోతున్న సెకండ్‌ సింగిల్‌.. రొమాంటిక్‌ సాంగ్‌ కావడంతో ఇప్పటినుంచే అంచనాలు మెుదలయ్యాయి. ‘నా సామి రారా సామీ’ రేంజ్‌లోనే ఈ పాట ఆకట్టుకుంటుందని ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు. 

    ఐటెం సాంగ్‌పై ఫోకస్‌! (Pushpa 2 Item Song)

    ‘పుష్ప 2’ టైటిల్‌ సాంగ్‌ ఇప్పటికే విడుదలవ్వగా.. రొమాంటిక్‌ పాట రేపు (మే 23) ఫ్యాన్స్‌ను అలరించనుంది. దీంతో ప్రస్తుతం ఫ్యాన్స్‌ దృష్టి ఐటెం సాంగ్‌ వైపు మళ్లింది. పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా’ సాంగ్‌ ఏ స్థాయిలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందే అందరికీ తెలిసిందే. ఇందులో సమంత (Samantha)తో అల్లు అర్జున్‌ వేసిన స్టెప్పులకు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. దీంతో ‘పుష్ప 2’ అదే రేంజ్‌లో ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ ఈ మూవీలో ఐటెం సాంగ్‌ చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ ఇప్పటివరకూ ధ్రువీకరించలేదు. అదే సమయంలో మరో నటిని తీసుకుంటున్నట్లు కూడా ప్రకటించలేదు. అయితే ఆగస్టు 15న సినిమా రిలీజ్‌ కానుండటంతో త్వరగా సాంగ్‌ను రూపొందించాలని మేకర్స్‌ భావిస్తున్నట్లు తెలిసింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv