అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ (Pushpa: The Rise) చిత్రం 2021లో విడుదలై పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత బన్నీ ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డిసెంబర్ 6న ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే ఇటీవల ఓ సినిమా ఫంక్షన్‌లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. మెగా ఫ్యామిలీ లక్ష్యంగా బన్నీ ఈ కామెంట్స్ చేశారంటూ మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అటు అల్లు అర్మీ సైతం వారికి దీటుగా సమాధానం ఇస్తూ కష్టపడుతోంది. ఈ క్రమంలో బన్నీ ఫ్యాన్స్‌కు హై ఓల్టేజ్ పవర్ ఇచ్చే అప్‌డేట్ బయటకొచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
పుష్ప 3పై క్రేజీ అప్‌డేట్
‘పుష్ప’ చిత్రంలో నటుడు రావు రమేష్ (Rao Ramesh) ఓ కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఎంపీ భూమిరెడ్డి పాత్రలో అయన కనిపించింది కొద్దిసేపే అయిన కథపై ఎంతో ఇంపాక్ట్ చూపించారు. తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడిన రావు రమేష్ ‘పుష్ప 2’లో తన పాత్ర గురించి చెబుతూనే ‘పుష్ప 3’ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ‘పుష్ప కథ అంతా చెప్పి ఒక్క సీన్ మాత్రమే షూట్ చేశారు. మిగిలిన డేట్స్ పుష్ప 2కి వాడుకుంటాం సర్ అన్నారు. నేనూ ఓకే అన్నాను. పార్ట్ 2లో మంచి పాత్రే పడింది. ఇప్పుడు పార్ట్ 3 కూడా అంటున్నారు. అందులోనూ నా పాత్ర ఉండొచ్చేమో’ అంటూ రావు రమేష్ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ‘పుష్ప 3’ పక్కాగా ఉంటుందని రావు రమేష్ చెప్పకనే చెప్పారని నెటిజన్లు అంటున్నారు. ఈ వీడియో చూసిన బన్నీ ఫ్యాన్స్ కూడా తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
క్లైమాక్స్‌లో హింట్!
‘పుష్ప 3’ సంబంధించి ప్రస్తుతం మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘పుష్ప 2’ క్లైమాక్స్‌లోనే మూడో పార్ట్‌కు సంబంధించిన అప్‌డేట్ ఉంటుందని సినీ వర్గాల్లో స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. అంతేకాదు పార్ట్ 3కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను సైతం చూపిస్తారని సమాచారం. అయితే పుష్ప 3 వెంటనే పట్టాలెక్కకపోవచ్చని సమాచారం. బన్నీ-సుకుమార్ రెండు మూడేళ్ల గ్యాప్ తీసుకునే అవకాశముందని అంటున్నారు. అటు బన్నీ, సుకుమార్‌లకు వేరే కమిట్‌మెంట్స్ ఉన్నాయి. సుకుమార్ ఇప్పటికే రామ్‌చరణ్‌తో ఓ సినిమాను అనౌన్స్ చేయగా, బన్నీ చేతిలో త్రివిక్రమ్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘పుష్ప 3’ ఇప్పట్లో రాకపోవచ్చని సమాచారం.
తొలి పార్ట్‌కి మించి..
ఇక పుష్ప 2 చిత్రం డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్, ఫస్ట్, సెకండ్ సింగిల్ లిరికల్ సాంగ్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా పుష్ప 2 గురించి మాట్లాడిన దర్శకుడు సుకుమార్ సినిమాపై హైప్‌ను పెంచే కామెంట్స్ చేశారు. మెుదటి భాగాన్ని మించి సెకండ్ పార్ట్ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తొలి భాగంలో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలకు పుష్ప 2లో సమాధానం దొరుకుతుందని సుకుమార్ తెలిపారు. మరీ ముఖ్యంగా సిండికేట్‌తో పుష్పరాజ్ ఆడే గేమ్, ఎమోషనల్ సీన్స్, పుష్ప రాజ్ vs భన్వర్‌సింగ్ షెకావత్ మధ్య నడిచే డ్రామా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పుకొచ్చారు.
‘కేజీఎఫ్’ ఫార్మూలా!
డైరెక్టర్ సుకుమార్ (Sukumar), హీరో అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప 3’ విషయంలో ‘కేజీఎఫ్’ (KGF Movie) ఫార్మూలాను అనుసరించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా రూపొందిన ‘కేజీఎఫ్’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అయ్యింది. ఆపై వెంటనే సెకండ్ పార్ట్‌ను పట్టాలెక్కించి ‘కేజీఎఫ్ 2’ను కూడా రిలీజ్ చేశారు. ఆ తర్వాత ‘కేజీఎఫ్ 3’ గ్యాప్ ఇచ్చి ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో ‘సలార్’ అనే చిత్రాన్ని కూడా రూపొందించారు. అటు యష్ సైతం ‘టాక్సిక్’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ‘పుష్ప 3’పై వస్తోన్న లేటెస్ట్ అప్‌డేట్స్‌ను పరిశీలిస్తే సుకుమార్ – బన్నీ కూడా ప్రశాంత్ నీల్- యష్‌లను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసి ఆ తర్వాత ‘పుష్ప 3’ని పట్టాలెక్కించాలని వారు భావిస్తున్నట్లు సమాచారం.