• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Pushpa 3: నో డౌట్‌.. ‘పుష్ప 3’ సినిమా పక్కా.. మైండ్‌ బ్లోయింగ్ అప్‌డేట్స్‌ మీకోసం!

    సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2). భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా వచ్చిన ‘పుష్ప’ (Pushpa) ఏ స్థాయి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్.. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. దీంతో దీనికి సీక్వెల్‌గా వస్తోన్న ‘పుష్ప 2’ అందరి దృష్టి పడింది. అయితే సినిమాకు కొనసాగింపుగా ‘పార్ట్‌ 3’ (Pushpa 3) కూడా ఉండొచ్చని ఇటీవలే బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాటిని నిజం చేస్తూ తాజాగా ‘పుష్ప 3’పై సాలిడ్‌ అప్‌డేట్‌ బయటకొచ్చింది. 

    వచ్చే ఏడాది సమ్మర్‌లో..

    ఈ ఏడాది ఆగస్టు 15న ‘పుష్ప 2’ విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో డే అండ్‌ నైట్‌ షూటింగ్‌ చేస్తూ పుష్ప టీమ్‌ బిజీ బిజీగా గడుపుతోంది. అయితే తాజా బజ్‌ ప్రకారం.. ‘పుష్ప 3’కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా డైరెక్టర్‌ సుకుమార్‌ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ‘పుష్ప 3’ లో వచ్చే సీన్లకు ప్రస్తుత షూటింగ్‌ లోకేషన్స్‌ సరిగ్గా సరిపోతాయని భావించి ఈ షూట్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇక ‘పుష్ప 3’ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ చేసే యోచనలో సుకుమార్‌ టీమ్ ఉన్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. 

    జాన్వీ కపూర్‌తో ఐటెం సాంగ్‌!

    ‘పుష్ప’ సినిమాలో సమంత చేసిన ‘ఊ అంటావా.. ఉ ఊ అంటావా’ ఐటెం సాంగ్‌ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అయితే ‘పుష్ప 2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ పెట్టాలని డైరెక్టర్‌ సుకుమార్‌ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం బాలీవుడ్ హీరోయిన్‌ దిశా పటాని (Disha Patani) ఎంపికచేసినట్లు మెున్నటి వరకూ వార్తలు వచ్చాయి. అయితే తాజా బజ్‌ ప్రకారం.. జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) పేరును ఐటెం సాంగ్‌ కోసం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి పార్టులో కన్నాపెద్దగా ఈ రెండో పార్టులో ఈ ఐటెం సొంగ్ ఉండాలని చిత్ర నిర్వాహకులు, దర్శకుడు భావిస్తున్నారట. కాబట్టి జాన్వీ కపూర్‌కు ఉన్న ఫేమ్‌ దృష్ట్యా ఆమె అయితేనే సరిగ్గా ఉంటుందని పుష్ప టీమ్ అభిప్రాయపడుతోందట. మరి జాన్వీ కపూర్ ఈ ఐటెం సాంగ్ చెయ్యడానికి ఒప్పుకుంటుందో లేదో చూడాలి. 

    ‘పుష్ప 3’పై బన్నీ ఏమన్నాడంటే!

    ఇటీవల జర్మనీలో జరిగిన ప్రతిష్టాత్మక ‘బెర్లిన్‌ యూరోపియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో అల్లు అర్జున్ పాల్గొన్న సంగతి తెలిసిందే. అక్కడ ‘పుష్ప 3’ సినిమా గురించి తొలిసారి బన్నీ మాట్లాడాడు. పార్ట్‌-3కి అన్నీ అనుకూలంగా ఉంటే తీసే అవకాశాలున్నాయని పేర్కొన్నాడు. కథను కొనసాగించాలని అనుకుంటున్నామని, తెరకెక్కించేందుకు అద్భుతమైన ఆలోచనలు కూడా ఉన్నాయని చెప్పాడు. మరోవైపు మొదటి భాగంతో పోలిస్తే ‘పుష్ప 2’లో పాత్రలు, వాటి మధ్య సంఘర్షణ మరింత బలంగా ఉంటాయని బన్నీ తెలిపాడు. ముఖ్యంగా పుష్పరాజ్‌, భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ల క్యారెక్టరైజేషన్‌, తెరపై వాటి ఎగ్జిక్యూషన్‌, వారికి ఎదురయ్యే పరిస్థితులు థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయని వివరించాడు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో వైరల్‌గా మారాయి. 

    బన్నీ నా రోల్‌ మోడల్‌: సమంత

    ఇదిలాఉంటే ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌పై స్టార్‌ హీరోయిన్‌ సమంత తాజాగా ప్రశంసల వర్షం కురిపించింది. తమిళనాడులోని వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన కల్చరల్ కార్నివాల్‌లో పాల్గొన్న సమంత అక్కడ బన్నీ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించింది. అల్లు అర్జున్ తన యాక్టింగ్ రోల్ మోడల్ అంటూ ఆకాశానికెత్తింది. ‘బన్నీ ఓ పవర్ హౌజ్ పర్ఫార్మర్‌గా మారాడు. అతని నుంచి నేర్చుకోవడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తాను’ అని సమంత చెప్పింది. కాగా గతంలో వీరిద్దరూ సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో నటించిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఈ సినిమా వచ్చింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv