నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) వైవిధ్యమైన చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా అతడు నటించిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 29 గ్రాండ్‌గా విడుదలై సర్వత్రా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నానితో పాటు విలన్‌గా చేసిన ఎస్.జే. సూర్య నటనపై ఆడియన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో సినిమాలో తమను నిరాశకు గురిచేసిన అంశాలను సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తున్నారు. అయితే ఓవరాల్‌గా పాజిటివ్ రివ్యూస్ సాధించిన నాని చిత్రం తొలి రోజు మంచి వసూళ్లనే సాధించినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
తొలి కలెక్షన్స్ ఎంతంటే?
నాని హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram Day 1 Collections) చిత్రం తొలి రోజు ఆశించిన స్థాయిలోనే వసూళ్లను సాధించింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.20.3 కోట్లు (GROSS) వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఒక్క ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనే రూ.8.8 కోట్లు మేర రాబట్టినట్లు స్పష్టం చేశాయి. ఓవర్సీస్‌లో రూ.7.6 కోట్ల మేర వసూలు చేసినట్లు తెలిపాయి. అటు కర్ణాటకలో రూ.1.4 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.2.5 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వివరించాయి. పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో ఈ వీకెండ్ సాలిడ్ వసూళ్లను సాధించే అవకాశముందని అంచనా వేశాయి. సినిమా హిట్ టాక్ అనంతరం టికెట్ బుకింగ్స్ గణనీయ సంఖ్యలో పెరగడమే ఇందుకు కారణమని చెబుతున్నాయి.
‘దసరా’ కంటే తక్కువే!
నాని గత చిత్రం ‘హాయ్ నాన్న’ (Hi nanna) తొలి రోజున రూ.10.5 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఆ చిత్రంతో పోలిస్తే ‘సరిపోదా శనివారం’ రెట్టింపు వసూళ్లను సాధించడం విశేషం. అయితే నాని అంతకుముందు చిత్రం ‘దసరా’ కంటే ఇది చాల తక్కువనే చెప్పవచ్చు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా తొలి రోజున రూ.38 కోట్లకు పైగా గ్రాస్ సాధించి నాని కెరీర్‌లో హైయస్ట్ ఓపెనింగ్‌గా నిలిచింది. దానితో పోలిస్తే ‘సరిపోదా శనివారం’ రూ.18 కోట్ల మేర వెనకబడింది. అయినప్పటికీ నాని కెరీర్‌లో సెకండ్ హయ్యేస్ట్ ఓపెనింగ్ చిత్రంగా ‘సరిపోదా శనివారం’ రికార్డు సృష్టించింది.
సినిమాలో అవే హైలెట్స్
‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికి’ చిత్రాలతో క్లాసిక్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన వివేక్ ఆత్రేయ తనలోని ఊర మాస్‌ను ఈ చిత్రం ద్వారా పరిచయం చేశారు. తన శైలికి భిన్నంగా అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో సినిమాను రూపొందించి ప్రశంసలు అందుకుంటున్నాడు. నాని, ఎస్.జే సూర్య నటన, యాక్షన్ సీక్వెన్స్, జేక్స్ బేజోయ్ నేపథ్య సంగీతం సినిమాకు హైలెట్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా హీరో – విలన్ మధ్య వచ్చే టామ్ అండ్ జెర్రీ తరహా సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. అయితే నిడివి మరి ఎక్కువగా ఉండటం, పెద్దగా మలుపులు లేకపోవడం, కమర్షియల్ హంగులు మిస్సవడం, ప్రిడిక్టబుల్‌గా స్టోరీ ఉండటం సినిమాకు కాస్త మైనస్‌లుగా మారాయి.
‘సరిపోదా శనివారం’ స్టోరీ ఇదే..
సూర్య (నాని) ఎల్‌ఐసీ ఎజెంట్‌గా పనిచేస్తుంటాడు. కళ్లెదుట అన్యాయం జరిగితే అసలు సహించలేడు. తన కోపాన్ని ప్రదర్శించడానికి శనివారాన్ని సూర్య ఎంచుకుంటాడు. మరోవైపు సోకులపాలెం ప్రాంతంలోని ప్రజలు కష్టాలు అనుభవిస్తుంటారు. పోలీసు ఆఫీసర్ దయా (ఎస్.జే సూర్య) వారిని హింసిస్తుంటాడు. తన అధికార బలంతో చిత్ర హింసలకు గురిచేస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హీరో సోకులపాలెం ప్రజలకు అండగా నిలవాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత క్రూరమైన పోలీసు అధికారిని సూర్య ఎలా ఎదిరించాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? హీరో శనివారమే విజృంభించడానికి కారణమేంటి? హీరోయిన్ ప్రియాంక మోహన్‌తో అతడి లవ్ ట్రాక్ ఏంటి? హీరో-విలన్ మధ్య జరిగిన నువ్వా నేనా పోటీలో ఎవరు గెలిచారు? అన్నది స్టోరీ.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్