భారత్‌లో సినీ పరిశ్రమ అంటే మొదటగా బాలీవుడ్ ఇండ్రస్టీనే గుర్తుకొస్తుంది. అక్కడ రూపుదిద్దుకున్న సినిమాలు భారీస్థాయిలో దేశవ్యాప్తంగా రిలీజవుతాయి. అందుకే బాలీవుడ్‌లో నటీనటులకు మంచి గుర్తింపు దక్కుతుంది. టాలీవుడ్, కోలీవుడ్ ఇలా.. ఇతర సినీ పరిశ్రమల నుంచి కూడా చాలామంది బాలీవుడ్‌లో అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. కానీ కొంత మంది మన తెలుగు స్టార్స్‌కు మాత్రం ఆ సువర్ణవకాశం వచ్చినా వదులుకున్నారు. ఇంతకీ వారెవరో తెలుసుకోవాలని ఉందా..? అయితే లెట్స్ రీడ్ దిస్..
1.మహేష్ బాబు
ఈ సూపర్ స్టార్‌కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ దేశవ్యాప్తంగా ఉంది. తెలుగు ఇండస్ట్రీలో మంచి హిట్‌లు ఇచ్చి తన నటనకౌశల్యంతో దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ పెంచుకున్నాడు. దీంతో బాలీవుడ్ పరిశ్రమ నుంచి ఆఫర్లు వెతుకుంటూ వచ్చినప్పటికి ఈ స్టార్ హీరో ఇంట్రెస్ట్ చూపించలేదు. అనేక సందర్భాల్లో బాలీవుడ్‌లోకి ఎప్పుడు రంగప్రవేశం చేస్తారు..? అని మీడియా ప్రశ్నించినప్పటికీ.. వేరే భాషలో నటించనని కామ్‌గా సమాధానం చెబుతుంటాడు. కాని మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో త్వరలో రానున్న మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.
2. అల్లు అర్జున్
తెలుగులో ఐకాన్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో బన్ని. తన నటనతోనూ, డ్యాన్స్‌తోనూ దేశవ్వాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అల్లు అర్జున్‌కి బాలీవుడ్ ఆఫర్లు చాలానే వచ్చాయి. కాని అందుకు ఆయన ఒప్పుకోలేదు. సల్మాన్ ఖాన్ నటించిన భజరంగీ భాయిజాన్ సినిమాలో కబీర్ ఖాన్ చేసిన పాత్రకు మొదటగా అల్లు అర్జున్‌నే సంప్రదించారు. కాని ఇందులో నటించడానికి బన్నీ ఆసక్తి చూపించలేదు. ఇతడు హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప ఇటీవలే రిలీజ్ అయ్యి రికార్డులు సృష్టిస్తుంది.
3.నయనతార
దక్షిణాది లేడీ సూపర్‌స్టార్‌గా పేరుపొందిన ఈ భామ అనేక హిట్ చిత్రాల్లో నటించింది. అందం, అభినయంతో అందరి మనసులు దోచుకుంది. దీంతో బాలీవుడ్‌లోనూ అనేక ఆఫర్లు వచ్చాయి. కాని ఆమె సౌత్ ఇండియా వదిలి బాలీవుడ్‌లో నటించడానికి ఆసక్తి చూపించలేదు. షారుక్ ఖాన్ ప్రధాన ప్రాతలో నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాలో ఐటం సాంగ్‌కు ముందు నయన్‌ను సంప్రదించగా అమె తిరస్కరించింది. ఇప్పుడు తమిళ డైరెక్టర్ అట్లీ, షారుఖ్ ఖాన్ కాంబోలో వస్తున్న చిత్రంలో నయన్ హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఇప్పటికి ఈమె బాలీవుడ్ ఎంట్రీ ఖరారు అయ్యిందని చెప్పవచ్చు.
4. రష్మిక మందాన
తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో రష్మిక మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తనకున్న క్రేజ్‌తో షాహిద్ కపూర్ నటిస్తున్న జెర్సీ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చినప్పటికీ ఆమె తిరస్కరించింది. ఇప్పుడు మొదటిసారిగా బాలీవుడ్‌లో నటించడానికి లైన్‌క్లియర్ చేసుకుంది. సిదార్ధ్ మల్హోత్ర నటిస్తున్న మిషన్ మజ్ను మూవీలో కథానాయికగా మెరువనుంది.
5. విజయ్ దేవరకొండ
2017లో రిలీజయిన అర్జున్‌రెడ్డి సినిమా విజయ్ దేవరకొండ కెరీర్‌కి భారీ హిట్‌ని అందించింది. అప్పటి నుంచి ఈ రౌడీ బాయ్‌కి బాలీవుడ్ ఆఫర్లు వరుస కడుతున్నాయి. కాని అతడు బాలీవుడ్ ఎంట్రీపై ఇంట్రెస్ట్ చూపించడం లేదు. పూరి జగన్నాథ్-విజయ్ కాంబోలో లైగర్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది.