పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కెరీర్ పరంగా ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ప్రభాస్ రీసెంట్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సూపర్ హిట్ కాగా, సందీప్ రెడ్డి తెరకెక్కించిన ‘యానిమల్‘ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇక వీరిద్దరి కాంబోలో రాబోతున్న ‘స్పిరిట్’ (Spirit) చిత్రం ఇక ఏ స్థాయిలో ఉంటుందోనని ఆడియన్స్‌లో ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
తొలుత పోలీసు.. తర్వాత!
సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) రూపొందించనున్న ‘స్పిరిట్’ (Spirit) చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా కనిపిస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పాత్రతో పాటు మరో కీ రోల్‌లో ప్రభాస్ కనిపిస్తారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం కథలో తొలుత పోలీసుగా కనిపించిన ప్రభాస్ అనేక నాటకీయ పరిణామాల తర్వాత గ్యాంగ్‌స్టర్‌గా మారతారని సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో భారీ వైల్డ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని చెబుతున్నారు. ‘యానిమల్’కు మించిన వైలెన్స్, ఫైట్ సీక్వెన్స్‌ను ‘స్పిరిట్’లో చూస్తారని అంటున్నారు. తాజా అప్‌డేట్స్ నేపథ్యంలో స్పిరిట్‌పై అంచనాలు మరింత పెరిగాయని చెప్పవచ్చు.
గోలిమార్ తరహాలో..
గోపిచంద్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘గోలిమార్’ (Golimar) చిత్రం 2010లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఎన్ కౌంటర్ స్పెషలిష్ట్ దయా నాయక్ జీవితము ఆధారముగా ఈ సినిమా రూపొందింది. నటన పరంగా ఈ సినిమా గోపిచంద్‌కు ఎంతగానో పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాలో గోపిచంద్ కష్టపడి పోలీసు ఆఫీసర్ అవుతాడు. రౌడీలపై ఉక్కుపాదం మోపి ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా పేరు తెచ్చుకుంటాడు. అనుకోని సంఘటనల కారణంగా అతడు గ్యాంగ్‌స్టర్‌గా మారతాడు. ప్రస్తుతం ‘స్పిరిట్’ లేటెస్ట్ బజ్‌ను గమనిస్తే అది కూడా ‘గోలిమార్’ను తలపిస్తోంది. అయితే గ్లోబల్ స్థాయి స్టాండర్డ్స్‌లో విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి కాబట్టి గోలిమార్‌తో స్పిరిట్ కంపేర్ చేయకపోవడం బెటర్.
ఇద్దరు స్టార్ హీరోలు…
‘స్పిరిట్’ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటించబోతున్నట్లు తెలుస్తోంది. రౌడీబాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ఇందులో స్పెషల్ క్యామియో ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంగా ఫస్ట్ ఫిల్మ్ ‘అర్జున్ రెడ్డి’లో విజయ్ దేవరకొండ హీరోగా చేశాడు. అలాగే రీసెంట్ చిత్రం ‘యానిమల్’లో రణ్‌బీర్ కపూర్ నటించాడు. దీంతో ఆ ఇద్దరు స్టార్స్‌తో సందీప్ రెడ్డికి మంచి క్లోజ్‌నెస్ ఉంది. ప్రభాస్ హీరోగా గ్లోబల్‌స్థాయిలో రూపొందుతున్న ‘స్పిరిట్’ నుంచి ఆఫర్ వస్తే వారు కాదనకుండా ఉండే ఛాన్సే ఎక్కువ ఉంది. అలానే స్పిరిట్‌లో ఓ స్టార్ హీరోను విలన్ పాత్రలో నటింపజేయాలని సందీప్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ప్రభాస్ విలన్ మళ్లీ రిపీట్!
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) ఇటీవల కాలంలో విలన్ రోల్స్ కేరాఫ్‌గా మారుతున్నారు. ‘ఆదిపురుష్’ చిత్రంలో రావణాసురుడిగా నటించినా సైఫ్ అలీఖాన్ ‘దేవర’లో తారక్‌కు ప్రత్యర్థిగా నటించారు. స్పిరిట్‌పై వచ్చిన మరో బజ్ ప్రకారం సైఫ్ అలీఖాన్ ఇందులోనూ నెగిటివ్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ను ఢీకొట్టే పవర్‌ఫుల్ పాత్రలో సైఫ్ కనిపించనున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. సైఫ్ అలీఖాన్ భార్య కరీనా కపూర్ కూాడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు రూమర్లు ఉన్నాయి. అదే నిజమైతే స్పిరిట్‌పై అంచనాలు మరో లెవల్‌కు వెళ్లడం ఖాయమని అంటున్నారు.
భారీ బడ్జెట్‌తో..
స్పిరిట్ చిత్రాన్ని టీ-సిరీస్ భూషణ్ కుమార్ నిర్మించనున్నారు. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో రాబోతున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్‌ను ఈ మూవీకి కేటాయించినట్లు టాక్ వినిపిస్తోంది. తొలుత ఈ మూవీ బడ్జెట్ రూ.500 కోట్లు అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత రూ. 750 కోట్లకు పెరిగిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా రూ.1000 కోట్లతో ఈ సినిమా రూపొందనున్నట్లు బజ్ వినిపిస్తోంది. అదే నిజమైతే బడ్జెట్ పరంగా ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీగా ‘స్పిరిట్’ నిలవనుంది. బడ్జెట్‌లో రూ.600 కోట్లు నటీనటుల పారితోషానికే వెళ్లనున్నట్లు సమాచారం. ఒక్క ప్రభాస్‌కే రూ.300 కోట్లు చెల్లించనున్నట్లు ఫిల్మ్ వర్గాల టాక్.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం