• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వరుస భూకంపాలతో అఫ్ఘాన్‌ విలవిల

    వరుస భూకంపాలతో అల్లాడుతున్న అఫ్ఘానిస్తాన్‌లో నేడు మరో భూకంపం సంభవించింది. ఈ రోజు ఉదయం 6.11 గంటల సమయంలో 6.1 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. హెరాత్ నగరానికి 29 కిలోమీటర్ల దూరంలో ఇది నమోదైనట్లు తెలిపింది. కాగా, అఫ్ఘాన్‌లో ఇప్పటికే వరుస భూకంపాలతో భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. నాలుగు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతుండగా, ఇప్పటికే శిథిలాల నుంచి 4 వేల మృతదేహాలను వెలికితీశారు.

    300 మందిని బలిగొన్న భూకంపం

    అఫ్గానిస్తాన్‌లో సంభవించిన భూకంపం ధాటికి ఇప్పటివరకూ 300 మందికి పైగా చనిపోయారు. 1000 మందికి పైగా గాయపడ్డారు. 500 ఇళ్లు ధ్వంసమయ్యాయి. భూకంపం తాకిడికి జెందా జాన్‌ జిల్లాలోని నాలుగు గ్రామాల్లో వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమైనట్లు అఫ్గాన్‌ జాతీయ విపత్తు సంస్థ తెలిపింది. అఫ్గాన్‌–ఇరాన్‌ సరిహద్దులకు సమీపంలోని హీరట్‌ పరిసరాల్లో శనివారం మధ్యాహ్నం కనీసం ఏడుసార్లు భూమి కంపించినట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే(USGS) పేర్కొంది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.3గా నమోదైందని పేర్కొంది. A horrifying earthquake in Afghanistan’s Herat … Read more

    ప్రకృతి కన్నెర్ర.. 2000 మంది మృతి

    సెంట్రల్ మొరాకోలో సంభవించిన భూకంపంలో ఇప్పటివరకూ 820 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 670 మందికిపైగా గాయపడ్డారు. భూకంపం కారణంగా మర్రాకెచ్ నగరం మరీ ఎక్కువగా నష్టపోయింది. దీంతో పాటు దేశ రాజధాని రాబత్‌లోనూ బలంగా ప్రకంపనలు నమోదు అయ్యాయి. భూ ప్రకంపనల కారణంగా ప్రజలు చూస్తుండగానే ఎత్తైన భవనాలు కుప్పకూలాయి. ఇళ్లు కూలిపోవడాన్ని చాలా మంది వారి ఫోన్లలో వీడియో తీశారు. ఈ క్రమంలో ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ? #BREAKING | #Morocco | #earthquake | #Marrakech … Read more

    టర్కీలో భూకంపం వచ్చిన చోటే వరదలు

    [VIDEO:](url) భూకంప వినాశనం నుంచి కోలుకోక ముందే టర్కీని వరదలు ముంచెత్తాయి. ఫిబ్రవరిలో భూంకంపం సంభవించిన చోటే ఇలా పెను వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదల తాకిడికి సాన్లిఉర్ఫా నగరంలో 11 మంది, అడియామన్‌లో ఇద్దరు మృతి చెందారు. బురదతో కూడిన భారీ వరదలకు వాహనాలు కొట్టుకుపోతున్నాయి. ఇటీవలి భూంకపంతో నిరాశ్రయులై పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి ఈ వరదలు శాపంగా మారాయి. భూకంపం కారణంగా దాదాపు 48వేల మందికి పైగా మృతిచెందారు. Several injured & killed after massive floods … Read more

    న్యూజిలాండ్‌లో భారీ భూకంపం

    న్యూజిలాండ్‌కు ప్రకృతి సవాల్ విసురుతోంది. ఇప్పటివరకు వరదలతో అల్లాడిన కివీస్ ప్రస్తుతం భారీ [భూకంపం](url)తో వణికిపోయింది. బుధవారం దేశ రాజధాని వెల్లింగ్టన్‌లో భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. భూకంప తీవ్రతకు భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. కాగా కొద్ది రోజులుగా గాబ్రియేల్ తుఫాన్ కారణంగా న్యూజిలాండ్‌ను వరద ముంచెత్తిన సంగతి తెలిసిందే. Wow! Check out this clip from the Tītahi Bay, Porirua, #NewZealand … Read more

    టర్కీ భూకంపం; మూత్రం తాగి బతికిన బాలుడు

    తుర్కీయే, సిరియాల్లో సంభవించిన భూకంపానికి దాదాపు 25 వేల మంది మరణించారు. మరికొందరు శిథిలాల కిందనే చిక్కుకున్నారు. ఈ క్రమంలో శిథిలాల కింద చిక్కుకున్న అద్నాన్ మొహమ్మత్ అనే బాలుడు 94 గంటల తర్వాత బయటపడ్డాడు. శిథిలాల కిందే దప్పిక అయినప్పుుడు తన [మూత్రం](url) తానే తాగుతూ.. ఆకలి వేసినప్పుడు పక్కనే ఉన్న పూలు తింటూ గడిపాడు. ఎట్టకేలకు సహాయక సిబ్బంది ఆ బాలుడిని రక్షించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ?Gaziantep'te 95.saatte 17 yaşındaki Adnan Muhammet Korkut enkazdan sağ … Read more

    భూకంప విధ్వంసం; 8 వేలకు చేరిన మృతులు

    తుర్కియే, సిరియాల్లో [భూకంపం](url) సృష్టించిన విధ్వంసానికి 8 వేల మంది బలయ్యారు. దాదాపు 25 వేలకు మందికి పైగా గాయపడ్డారు. భవన శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తుర్కియేలో 5,600 మంది, సిరియాలో 2,040 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా భవన శిథిలాల కింద ఇంకా 1,80,000 మంది చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. The last minutes of the Turkish family's life were caught … Read more

    తుర్కీయేలో భీకర పరిస్థితులు; డ్రోన్ విజువల్స్ వైరల్

    తీవ్ర భూకంపం ధాటికి తుర్కీయే, సిరియాల్లో భీకర పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ చూసినా శిథిల భవనాలు, శవాల గుట్టలు దర్శనమిస్తున్నాయి. భూకంపం సృష్టించిన కల్లోలానికి దాదాపు 5000 మందికి పైగా మరణించారు. 25 వేలకు మందిపైగా క్షతగాత్రులుగా మిగిలారు. ప్రస్తుతం అక్కడి దృశ్యాలు హృదయవిదారకంగా మారాయి. అక్కడి పరిస్థితులను డ్రోన్ విజువల్స్ మన కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన [వీడియో](url)లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. A drone video released by Humanitarian Relief Foundation shows the extent of … Read more

    మృత్యుంజయులు ఆ చిన్నారులు

    భూకంపం ధాటికి తుర్కీయే, సిరియాలు అతలాకుతలమయ్యాయి. ఎక్కడ చూసినా భవన శిథిలాలే కనిపిస్తున్నాయి. ఈ శిథిలాల్లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. రెండు వేర్వేరు భవనాల శిథిలాల నుంచి ఇద్దరు చిన్నారులు సజీవంగా బయటపడ్డారు. నూర్, హరుణ్ అనే ఇద్దరు చిన్నారులు రెండు రోజులపాటు శిథిలాల కిందే చిక్కుకుని మృత్యుంజయులుగా బయటకు వచ్చారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url)లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇరు దేశాల్లోనూ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. This poor child is the sole survival of a whole … Read more

    తుర్కియో భూకంపంలో 4వేలు దాటిన మృతులు

    తుర్కియో భూకంపంలో మృతుల సంఖ్య 4,372కు చేరింది. తుర్కియో, సిరియా దేశాల్లో సోమవారం తెల్లవారుజామున 7.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. కేవలం తుర్కియోలోనే 2,921 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు గాయపడ్డ వారి సంఖ్య15,834కు చేరింది. అటు సిరియా భూకంపం వల్ల 1,451 మంది చనిపోయారు. మరో 3,531 మంది గాయపడ్డారు. భారీ ప్రాణ నష్టం సంభవించడంతో తుర్కియో ప్రభుత్వం 7రోజుల సంతాప దినాన్ని ప్రకటించింది. Earthquake leaves over 4,300 Dead in Turkey and Syria…people have lost their entire … Read more