• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సీఎంను చంపేస్తామని బెదిరింపు కాల్

  కేరళ సీఎం పినరయి విజయన్‌కు బెదిరింపు కాల్ వచ్చింది. సీఎంను చంపేస్తామని దుండగులు ఆ రాష్ట్ర పోలీసు కార్యాలయానికి ఫోన్ చేశారు. దీనిపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. అయితే ఈ ఫోన్ కాల్ చేసింది మైనర్ బాలుడని సమాచారం. గతంలో కూడా విజయన్‌కు చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి.

  గబ్బిలాల్లో నిఫా వైరస్?

  కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేసింది. గబ్బిలాల్లో నిఫా వైరస్ ఉండే అవకాశం ఉందని చెప్పింది. గబ్బిలాల నుంచి సేకరించిన నమూనాల ఆధారంగా icmr ఈ సమాచారం అందించినట్లు పేర్కొంది. రాష్రంలో ఆరోగ్య వ్యవస్థను సాధారణ ప్రజలను అప్రమత్తం చేసే ఉద్దేశంలో ఈ సమాచారం వెల్లడించినట్లు పేర్కొంది. నిఫా వైరస్ మరణాల రేటును 70-90 శాతం నుంచి 33 శాతానికి పరిమితం చేయగలిగామని ప్రభుత్వం ఓ నివేదికలో పేర్కొంది.

  Video: ఆడీలో వచ్చి పంటను విక్రయించిన రైతు

  ఓ రైతు ఆడీ కారులో వచ్చి తన పంటను అమ్మడం నెట్టింట వైరల్‌గా మారింది. కేరళకు చెందిన సుజిత్‌, వ్యవసాయ పద్ధతుల్లో రకరకాల పంటలను పండిస్తున్నారు. ఈ క్రమంలో అతడు ఆడీ కారులో వచ్చి తన పంటను విక్రయించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తాను పండించిన బచ్చలికూర పంటను కోయడం మొదలు విక్రయించడం వరకు ఈ వీడియోలో చూడవచ్చు. ఇప్పటి వరకు ఈ వీడియోను ఎనిమిది మిలియన్లకు పైగా వీక్షించారు. దీనిపై నెటిజన్లు సుజిత్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. … Read more

  SkyWalk Glass Bridge: 3,600 అడుగుల ఎత్తులో స్కైవాక్‌.. దేశంలోనే అతిపెద్ద గాజు వంతెన ఇదే!

  కేరళ అంటే ముందుగా ప్రకృతి అందాలు, నదీ పాయలు, సుగంద ద్రవ్యాలు, పర్యాటక ప్రాంతాలే గుర్తుకు వస్తాయి. పర్యాటకానికి పెద్ద పీట వేసే రాష్ట్రాల జాబితాలో కేరళ (Kerala State) ముందు వరుసలో ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా స్కైవాక్‌ గాజు వంతెన (SkyWalk Glass bridge)ను ప్రారంభించింది.  విహారానికి వచ్చే దేశ, విదేశీ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచేలా ఇడుక్కి జిల్లాలోని వాగమన్‌ ప్రాంతంలో ఈ గాజు వంతెనను నిర్మించింది. గాజు వంతెనల్లో దేశంలోనే అతి పొడవైన వంతెన ఇదే కావడం విశేషం. … Read more

  లాటరీలో రూ.75 లక్షలు; పోలీస్‌స్టేషన్‌కు పరుగులు

  ఓ యువకుడికి రూ.75 లక్షల లాటరీ తగలగానే పోలీస్ స్టేషన్‌కు పరుగులు పెట్టాడు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఎస్కే బాదేశ్ కూలీ పనుల నిమిత్తం కేరళ వలస వచ్చాడు. ఇటీవల ఎర్నాకులంలో స్త్రీశక్తి లాటరీ కొన్నాడు. ఆ టికెట్‌పై ఏకంగా రూ.75 లక్షల జాక్‌పాట్ తగిలింది. దీంతో వెంటనే తన టికెట్ తీసుకుని మువట్టుపుఝు పోలీస్ స్టేషన్‌కు పరుగులు పెట్టాడు. ఎవరైనా తన టికెట్ లాక్కుంటారేమోనన్న భయంతో ఇలా పరిగెత్తినట్లు ఆ యువకుడు పోలీసులకు తెలిపాడు. డబ్బులు వచ్చాక సొంతూర్లో ఇంటికి మరమ్మతులు చేయించకుని పొలం … Read more

  మందుబాబులకు వింత శిక్ష; 1000 సార్లు ఇంపోజిషన్

  కేరళలో మందుబాబులకు పోలీసులు[ వింత శిక్ష](url) విధించారు. హెచ్చరికలు, జరిమానాలు విధించి, విసిగిపోయిన పోలీసులు వినూత్న శిక్ష వేశారు. కొచ్చిలోని త్రిపునితర పోలీస్ స్టేషన్‌ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అక్కడ వారితో ‘ఇకపై నేను మద్యం తాగి వాహనం నడపను’ అంటూ వారితో 1000 సార్లు ఇంపోజిషన్ రాయించారు. అన్ని సార్లు రాయలేక వారు పడిన బాధలు వర్ణనాతీతం. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. Kochi police today made drivers who were … Read more

  డోలు వాయించిన పెళ్లికూతురు

  పెళ్లిలో డోలు వాయించడం మామూలే. పెళ్లికూతురే ఈ పని చేస్తే ఎలా ఉంటుంది? కేరళలో ఇదే జరిగింది. గురవయ్యూరు ఆలయంలో పెళ్లికూతురు ఉత్సాహంగా డోలు వాయించింది. చెందయ్‌గా పిలిచే డోలును పెళ్లికుమార్తె తండ్రి వాయిస్తుంటాడట. ఇక తన పెళ్లిలో తానే వాయిస్తా అంటూ ముందుకొచ్చి తండ్రితో కలిసి డోలు మోగించింది. వీరికి పెళ్లికొడుకు కూడా జతకావడంతో వేదిక కోలాహలంగా మారింది. చిరునవ్వు చిందిస్తూ.. ఉత్సాహంగా.. వినసొంపుగా పెళ్లికూతురు డోలు వాయిస్తుంటే అలాగే చూడాలనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. A marriage … Read more

  9 ఏళ్ల బాలికపై కృూరత్వం; వీడియో వైరల్

  కేరళలోని కాసర్‌గడ్ జిల్లా మంజేశ్వర్‌లో 9 ఏళ్ల బాలిక పట్ల ఓ వ్యక్తి క్రూరంగా ప్రవర్తించాడు. అకారణంగా ఆ విద్యార్థినిని అమాంతం పైకి ఎత్తి కింద పడేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. ఓ చిన్నారి నిల్చొని ఉంది. ఇంతలో బాలిక వైపు కోపంగా వచ్చిన వ్యక్తి ఆమెను ఎత్తి నేలపై పడేశాడు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. కాగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.[ వీడియో](url) చూసిన నెటిజన్లు నిందితుడిపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. #CCTV: A … Read more

  నది మధ్యలో 30ఫీట్ల కటౌట్

  ఫిఫా వరల్డ్‌కప్ సమీపిస్తున్నందున అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కేరళలోని కోజికోడ్‌లో ఉన్న వల్లూర్ వద్ద ఏకంగా నదిలోనే భారీ కటౌట్‌ని ఏర్పాటు చేశారు. అర్జెంటినా స్టార్ లియోనల్ మెస్సీ 30 ఫీట్ల పొడవైన కటౌట్‌ని కడవు నది మధ్యలో స్థాపించారు. దీంతో ఈ దృశ్యం వైరల్ అవుతోంది. సాధారణంగా ఎవరైనా రోడ్డు వెంబడి లేదా మైదానాల్లో కటౌ‌ట్‌లను ఏర్పాటు చేస్తుంటారు. కానీ, ఇలా ఏర్పాటు చేయడం ప్రత్యేకమని చెబుతున్నారు. ఈ [వీడియో](url)ను మీరూ చూసి కామెంట్ చేయండి మరి. Behind the SceneMessi … Read more

  నీటిలో క‌మ‌ల్ హాస‌న్ చిత్రాన్ని రూపొందించిన క‌ళాకారుడు..వైర‌ల్ వీడియో

  కేర‌ళ‌లోని త్రిసూర్‌కు చెందిన ప్ర‌ముఖ చిత్ర క‌ళాకారుడు డావిన్సీ సురేశ్ నీటిలో క‌మ‌ల్ హాస‌న్ చిత్రాన్ని రూపొందించారు. మున్నార్‌లోని ఒక రిసార్ట్‌లో ఐదవ‌ అంత‌స్థులో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో 2500 ఫ్లోటింగ్ పేప‌ర్ల‌తో క‌మ‌ల్ బొమ్మ‌ను వేశాడు. 35 అడుగుల పొడ‌వు, 25 అడుగుల వెడ‌ల్పుతో 10 రంగుల కాగితాల‌తో నీటిలో రూపొందించి చిత్రం ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.