• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రుషికొండపై ట్వీట్.. సరిచేసుకున్న వైసీపీ

    AP: రుషికొండపై సెక్రటేరియట్ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పడంపై వైసీపీ మాట మార్చింది. నిన్న రాత్రి చేసిన ట్వీట్ పొరపాటుగా వచ్చిందని, అక్కడ కడుతున్నది ప్రభుత్వ నిర్మాణాలేనని స్పష్టం చేసింది. ‘మా అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో రుషికొండపై సెక్రటేరియట్‌ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నిన్న చేసిన ట్వీట్‌లో పొరపాటున పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్మాణాలు చేస్తున్నట్టుగా దీన్ని పరిగణలోకి తీసుకోగలరు’ అని వైసీపీ ట్వీట్ చేసింది. మా అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో రుషికొండపై సెక్రటేరియట్‌ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నిన్న చేసిన … Read more

    ఆర్జీవీ వ్యూహం టీజర్ రిలీజ్

    ఏపీ రాజకీయాలపై రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వ్యూహం సినిమా టీజర్ విడుదలైంది. వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంతో టీజర్ మొదలైంది. వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానాన్ని వర్మ రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేయడం వరకు ఒక పార్ట్, ప్రభుత్వ పాలన రెండో పార్ట్‌గా రానుంది. జగన్ పాత్రలో అజ్మల్ నటిస్తున్నాడు. దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు.

    ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం క్లారిటీ

    ఏపీ హైకోర్టు తరలింపు అంశం న్యాయస్థానాల పరిధిలో ఉందని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర పునర్విభజన అనంతరం హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేశారని కేంద్రమంత్రి కిరణ్ రిజుజు స్పష్టం చేశారు. అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలంటే రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. రాజ్యసభలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి కిరణ్ రిజుజు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. నాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన అనంతరం పునర్విభజన చట్టం ప్రకారం హైకోర్టును అమరావతిలో ఏర్పాటు … Read more

    వైకాపాకు షాక్‌; మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో తెదేపా గెలుపు

    ఏపీలో మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెదేపా విజయం సాధించింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నిన్న వెలువడగా, పశ్చిమ రాయలసీమ (కడప-అనంతపురము-కర్నూలు) నియోజకవర్గం ఫలితం తాజాగా వెల్లడైంది. వైకాపా అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిపై 7,543 ఓట్ల ఆధిక్యంతో తెదేపా అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాలరెడ్డి గెలుపొందారు. ఈ స్థానంలో మొత్తం 49మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.

    ఎమ్మెల్సీ ఫలితాలను హెచ్చరికగా భావించట్లేదు: సజ్జల

    ఏపీ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తెదేపా సంబరాలు చేసుకోవడంతోనే అంతా అయిపోలేదని, ఈ ఫలితాలను హెచ్చరికగా భావించడం లేదన్నారు. ఈ ఓటర్లు మొత్తం సమాజాన్ని ప్రతిబింబించే పరిస్థితి లేదని, ఒక వర్గం ఓటర్లను రాష్ట్రం మొత్తానికి ఎలా అపాదిస్తారని ప్రశ్నించారు. 3 పట్టభద్రుల స్థానాల ఎన్నికల్లో రెండు చోట్ల తెదేపా గెలవగా, పశ్చిమ రాయలసీమలో మాత్రం వైకాపా, తెదేపా అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.

    ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం; 6 మంది దుర్మరణం

    ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 6 మంది దుర్మరణం పాలయ్యారు. బత్తలపల్లి మండలం పోట్లపర్రి వద్ద బొలెరో, ఆటో ఎదురెదురుగా వేగంగా వస్తూ బలంగా ఢీకొన్నాయి. దీంతో స్పాట్‌లోనే 5 మంది మృత్యువాత పడగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

    ఏపీ రాజధాని వైజాగే; సీఎం వైఎస్ జగన్

    ఏపీ [రాజధాని](url) విశాఖపట్నమేనని ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో జగన్ మాట్లాడారు. ‘‘వైజాగే ఏపీ రాజధాని. అక్కడి నుంచే పరిపాలన చేపడతాం. త్వరలో నేను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతున్నా. మార్చి 3, 4 తేదీల్లో ఇన్వెస్టర్ల సదస్సు వైజాగ్‌లోనే జరగనుంది. ఇన్వెస్టర్లు ఎవరైనా సరే అక్కడికి రావొచ్చు. పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నాం.’’ అంటూ పేర్కొన్నారు. I invite you … Read more

    గండికోటలో కమల్ హాసన్ సందడి

    తమిళ్ స్టార్ హీరో కమల్ హాసన్ ఏపీలోని కడప జిల్లా గండికోటలో సందడి చేశాడు. కమల్ హాసన్‌ను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. కమల్ వారందరికీ అభివాదం చేస్తూ పలకరించారు. కాగా కమల్[ ‘భారతీయుడు 2’ ](url)షూటింగ్ కోసం గండికోటకు వచ్చారు. 6 రోజులపాటు సినిమా బృందం ఇక్కడే షూటింగ్ నిర్వహిచనుంది. కాగా ‘భారతీయుడు 2’ చిత్రాన్ని శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. కమల్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈ మూవీ 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. … Read more

    ఏపీలో ‘వందేభారత్’ రైలుపై రాళ్ల దాడి

    ఏపీలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని కొంతమంది దుండగులు ఈ ట్రైన్‌పై రాళ్లు రువ్వారు. ఈ ఘటన ఏపీలోని విశాఖపట్నంలో ఉన్న కంచరపాలెంలో జరిగింది. విశాఖ-సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే వందేభారత్ రైలు ఇటీవలే విశాఖ చేరుకుంది. ఈ క్రమంలో సికింద్రాబాద్ వైపు వెళ్తున్న రైలుపై కంచరపాలెం వద్ద దుండగులు[ రాళ్లు](url) విసిరారు. దీంతో రెండు కోచ్‌ల అద్దాలు పగిలిపోయాయి. ఈ దాడిపై రైల్వే అధికారి అనూప్ కుమార్ సత్పతి విచారణ చేపట్టారు. Andhra Pradesh | Stones pelted on … Read more

    ట్రెండింగులో ‘వీరసింహారెడ్డి’ ట్రైలర్

    బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. విడుదలైన 20 గంటల్లోనే 6.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ని దక్కించుకుని ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. లక్షల్లో లైక్స్‌ని సంపాదిస్తోంది. బాలయ్య మాస్ డైలాగులు, ఎలివేషన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఏపీ రాజకీయాలను కూడా డైలాగుల ద్వారా పరోక్షంగా ప్రస్తావించడం, రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కడంతో అభిమానులు మరింత ఆసక్తిని కనబరుస్తున్నారు. ట్రైలర్‌ని చూస్తుంటే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు గుర్తుకొస్తున్నాయని కామెంట్లు పెడుతున్నారు.