బాక్సాఫీస్ వద్ద మొన్నటి వరకు చిన్న సినిమాలు సందడి చేశాయి. ఇక ఈ వారం పోటీలో ఒకే ఒక సినిమా ఉంది. ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ శుక్రవారం(జూన్ 16) విడుదల అయ్యేందుకు సిద్ధమవుతోంది. ‘జై శ్రీరామ్’ నినాదంతో థియేటర్లు దద్దరిల్లేందుకు ముస్తాబవుతున్నాయి. దీంతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన చిత్రాలు ఓటీటీలో అలరించనున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు
ఆదిపురుష్
ప్రభాస్, కృతిసనన్ జంటగా నటించిన పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలను బట్టి చూస్తుంటే రామాయణంలోని సీతాపహరణం నుంచి రావణ దహనం వరకు జరిగిన కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే సినిమా విడుదల కావాల్సి ఉండగా సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. ట్రైలర్, పాటలు ఆకట్టుకుంటున్నాయి. చిత్రబృందం చేస్తున్న ప్రమోషన్లు హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
ది ఫ్లాష్
డీసీ కామిక్‌లోని ఓ క్యారెక్టర్ ‘ఫ్లాష్’. ఆండీ మూషియాటీ దర్శకత్వంలో మిల్లర్ నటించిన ‘ది ఫ్లాష్’ మూవీ జూన్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంగ్లిష్‌తో పాటు భారతీయ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది.
ఓటీటీ విడుదలలు
Title | Category | Language | Platform | Release Date |
Adaimazhai Kalam | Movie | Tamil | Netflix | June 11 |
Full Count | Web Series | Korean | Disney + Hotstar | June 14 |
Shaitan | Web Series | Telugu | Disney + Hotstar | June 15 |
Jee Karda | Web Series | Hindi | Amazon Prime | June 15 |
Kanulu Terichina Kanulu Musina | Movie | Telugu | ETV Win | June 16 |
I Love You | Movie | Hindi | Jio Cinema | June 16 |
Extraction 2 | Movie | English | Netflix | June 16 |
RavanaKottam | Movie | Tamil | Amazon Prime | June 16 |
Chevalier | Movie | English | Disney + Hotstar | June 16 |
Farhana | Movie | Tamil | Sony Liv | June 16 |
Vamanan | Movie | Malayalam | Manorama Max | June 16 |
Desperate Riders | Movie | English | LionsGateplay | June 16 |
Bichagadu 2 | Movie | Tamil | Disney + Hotstar | June 17 |