• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • This Week Releases: ఈ వారం(June 9) థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..!

    గత రెండు వారాలుగా చిన్న సినిమాలు బాక్సాఫీసు వద్ద సందడి చేస్తున్నాయి. దీంతో ఈ వారం విడుదలవుతున్న సినిమాలపైనా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ శుక్రవారం(June 9) ప్రధానంగా థియేటర్లలో నాలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇందులో ఒక్కో చిత్రం ఒక్కో జోనర్‌లో వస్తోంది. సినిమాలతో పాటు మరికొన్ని వెబ్‌సిరీస్‌లు ఓటీటీలో విడుదల అవుతున్నాయి. అవేంటో చూద్దాం. 

    టక్కర్

    చాలా గ్యాప్ తర్వాత సిద్ధార్థ్ నటించిన చిత్రం టక్కర్. మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా చేసింది. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ట్రైలర్‌లో సిద్ధార్థ్ వాయిస్ ఓవర్‌తో సినిమాపై అంచనాలు పెంచేశారు. ‘ఆశే లోకాన్ని నడిపిస్తుంది. మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఈ ఆశను నెరవేర్చుకోవాలంటే ధనమే ఇంధనం. డబ్బు సంపాదించడానికి ఒక్కొక్కరిది ఒక్కో దారి. ఆ దారి అందరిదీ ఒకటే అయినప్పుడు..’ అంటూ మొదలు పెట్టాడు. మిగతా కథేంటో జూన్ 9న థియేటర్లలో చూడాల్సిందే. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల అవుతోంది.

    విమానం

    నటుడు, దర్శకుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రమిది. ఇందులో దివ్యాంగుడైన తండ్రి పాత్రను పోషించాడు. మీరా జాస్మిన్, అనసూయ, రాహుల్ రామకృష్ణ, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విమానం ఎక్కాలన్న కొడుకు కలను దివ్యాంగుడైన తండ్రి ఎలా నెరవేర్చాడన్న ఇతివృత్తంతో  సినిమా తెరకెక్కింది. యానాల శివప్రసాద్ డైరెక్ట్ చేశారు. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి నిర్మించారు. జూన్ 9న సినిమా విడుదల కానుంది. 

    అన్‌స్టాపబుల్


    వీజే సన్నీ, సప్తగిరి ప్రధాన పాత్రలు పోషించిన ఎంటర్‌టైనర్ ‘అన్‌స్టాపబుల్’. రెండు గంటల పాటు నాన్‌స్టాప్ వినోదం అందించేందుకు సినిమా రెడీగా ఉందని చిత్రబృందం వెల్లడించింది. డైమండ్ రత్నబాబు తెరకెక్కించాడు. నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా జూన్ 9న విడుదల కానుంది. 

    పోయే ఏనుగు పోయే

    టాలీవుడ్‌లో ఏనుగు ప్రధాన పాత్ర పోషించిన సినిమాలు ఎన్నో వచ్చాయి. అడవి రాముడు, అడవి రాజా వంటివి ఘన విజయాన్ని అందుకున్నాయి. తాజాగా ఇదే కథతో ‘పోయే ఏనుగు పోయే’ సినిమా తెరకెక్కింది. కేఎస్ నాయక్ డైరెక్ట్ చేశాడు. పవనమ్మాల్ కేశవన్ నిర్మాత. జూన్ 9న సినిమా విడుదల కానుంది. 

    ఓటీటీ విడుదలలు

    TitleCategoryLanguagePlatformRelease Date
    The IdleWeb SeriesEnglishZee5June 5
    Barracuda QueensWeb SeriesEnglishNetflixJune 5
    2018MovieMalayalam/TeluguSonyLivJune 7
    Avatar: The Way Of WaterMovieEnglishDisney+ HotstarJune 7
    OrnaldSeriesEnglishNetflixJune 7
    St ExSeriesEnglishDisney+ HotstarJune 7
    Never have I EverSeriesEnglishNetflixJune 8
    Tour D FranceSeriesEnglishNetflixJune 8
    UP 65SeriesHindiJioCinemaJune 8
    My FaultSeriesEnglishAmazon PrimeJune 8
    MenTooMovieTeluguAhaJune 9
    BloodhoundsSeriesKoreanNetflixJune 9
    Blood DaddyMovieHindiJioCinemaJune 9
    Empire Of LightMovieEnglishDisney+ HotstarJune 9
    Flamin H0tMovieEnglishDisney+ HotstarJune 10
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv