• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Tillu Cube: టిల్లు క్యూబ్‌లో సమంత, తమన్నా?.. అట్లుంటది మనతోని!

    యంగ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda).. యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించాడు. ‘డీజే టిల్లు’ (DJ Tillu), ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square) చిత్రాలతో ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు. లేటెస్ట్ చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’.. ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ మూవీకి కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్‌’ (Tillu Cube) రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే గత రెండు చిత్రాల్లో హీరోయిన్లు (నేహాశెట్టి, అనుపమా పరమేశ్వరన్‌) పాత్రలు కీలకం కావడంతో ‘పార్ట్‌ 3’లో ఎవరు చేస్తారన్న దానిపై ఇప్పటి నుంచే ఆసక్తి ఏర్పడింది. అయితే తాజా బజ్‌ ప్రకారం.. ఈ సినిమాలో ఇద్దరు స్టార్‌ హీరోయిన్లను తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

    ఆ స్టార్ హీరోయిన్లు ఎవరంటే?

    ‘టిల్లు స్క్వేర్‌’ బ్లాక్ బాస్టర్ కావడంతో ‘టిల్లు క్యూబ్‌’ను అంతకుమించి రూపొందించేలా నిర్మాత సూర్య దేవర నాగవంశీ ప్లాన్‌ చేస్తున్నారు. కీలకమైన హీరోయిన్‌ పాత్రకు స్టార్‌ హీరోయిన్‌ను తీసుకుంటే ఎలా ఉంటుందా? అన్న యోచనలో చిత్ర యూనిట్ ఉంది. అంతేకాదు వారి పరిశీలనలో ఇద్దరు స్టార్‌ హీరోయిన్ల పేర్లు కూడా ఉన్నట్లు లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం తెలుస్తోంది. సమంత (Samantha), తమన్నా (Tamannah Bhatia)ను ఈ సినిమా కోసం తీసుకోవాలని యూనిట్‌ భావిస్తోందట. షూటింగ్‌ ప్రారంభం లోపు దీనిపై అధికారిక ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు. మరోవైపు బడ్జెట్‌ పరంగానూ ఈ సినిమాను హైలెవల్‌కు తీసుకెళ్లాలని నిర్మాత భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

    సినిమా అంతా ఫారెన్‌లోనే!

    ‘డీజే టిల్లు’లో అందాలు ఆరబోసిన హీరోయిన్‌ నేహా శెట్టి.. ‘టిల్లు స్క్వైర్’లో కూడా కనిపించింది. అది ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది. దీంతో ఇదే ఫార్మూలాను టిల్లు క్యూబ్‌లోనూ రిపీట్‌ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ‘టిల్లు క్యూబ్’లో నేహాశెట్టితో పాటు సీక్వెల్‌లో చేసిన అనుపమా పరమేశ్వరన్‌ కూడా మెరవనున్నట్లు సమాచారం. అయితే మెయిన్‌ హీరోయిన్‌గా మాత్రం స్టార్ నటి ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఈసారి ‘పార్ట్‌-3’ కథ అంతా ఫారెన్‌లోనే జరుగుతుందట.కాగా,ప్రస్తుతం సిద్ధూ ‘బొమ్మరిల్లు’ దర్శకుడు భాస్కర్‌తో ‘జాక్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది ప్రారంభంలో ‘టిల్లు క్యూబ్’ సెట్స్‌ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో నిర్మాత నాగవంశీ.. సిద్దూకు పూర్తి స్వేచ్చను ఇచ్చినట్లు తెలుస్తోంది.

     

    టిల్లు క్యూబ్‌ కథ అదే!

    డీజే టిల్లు, టిల్లు స్క్వేర్‌ చిత్రాలకు ఇంచుమించు ఒకే తరహా కథతో రూపొందాయి. తొలి భాగం.. ఓ అమ్మాయి మోసం చేసే పాయింట్‌ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. టిల్లు స్క్వేర్‌లో కూడా అదే పాయింట్‌తో పాటు మాఫియా డాన్ మిషన్ లాంటిది యాడ్‌ చేశారు. ఈసారి టిల్లు క్యూబ్‌ మాత్రం మరో లెవల్‌లో ఉంటుందట. టిల్లుకి సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తాడు? ఎలా బిహేవ్ చేస్తాడు? గాల్లోకి ఎగరడం, టిల్లు సూపర్ హీరో అయితే ఎలా ఉంటుంది? అనే పాయింట్ మీద కథ ఉండబోతుందని కథానాయకుడు సిద్ధూ స్వయంగా తెలిపాడు. త్వరలోనే ఆ స్క్రిప్ట్ వర్క్ కూడా  మొదలుపెడతానని స్పష్టం చేశాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv