• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Venkatesh Daughter Wedding: సైలెంట్‌గా వెంకటేష్‌ రెండో కుమార్తె పెళ్లి.. ఫొటోలు వైరల్‌! 

    టాలీవుడ్‌కు చెందిన దిగ్గజ హీరోల్లో విక్టరీ వెంకటేష్‌ (Venkatesh) ఒకరు. కెరీర్‌లో అత్యధికంగా కుటుంబ కథా చిత్రాలే చేసిన ఆయన.. ఫ్యామిలీ స్టార్‌గా గుర్తింపు పొందాడు. రీసెంట్‌గా ‘సైంధవ్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఇదిలా ఉంటే శుక్రవారం వెంకటేష్‌ రెండో కుమార్తె హయవాహిని పెళ్లి ఘనంగా జరిగింది. రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

    హీరో వెంకటేష్ – నీరజల రెండో కుమార్తె హయవాహినికి గత ఏడాది విజయవాడకు చెందిన డాక్టర్‌ నిశాంత్‌తో ఎంగేజ్‌మెంట్ జరిపించిన విషయం తెలిసిందే.  అయితే వీరిద్దరి పెళ్లి ఎప్పుడనేది దగ్గుబాటి ఫ్యామిలీ ప్రకటించలేదు. అయితే నిన్న సైలెంట్‌గా వీరి పెళ్లి నిర్వహించి వెంకటేష్‌ అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా నిర్వహించారు. 

    ఈ పెళ్లి శుక్రవారం రాత్రి 9.36 నిమిషాలకు జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీలోని కొద్ది మంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటకు రాగా వాటిని చూసి వెంకటేష్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. 

    సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh babu) భార్య నమ్రత (Namratha), కూతురు సితార (Sitara) ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. వధూవరులతో నమ్రత దిగిన ఫొటో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. 

    తమిళ స్టార్‌ హీరో కార్తిక్‌.. ఈ వివాహ వేడుకలో ప్రధాన ఆకర్షణ నిలిచాడు. కార్తీక్‌ – వెంకటేష్‌ ఒకరికొకరు కరచలనం చేసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మీరు ఇక్కడ చూడవచ్చు. 

    గత సంవత్సరం అక్టోబర్‌లో విజయవాడకు చెందిన డాక్టర్ నిశాంత్‌తో హయ వాహిని ఎంగేజ్ మెంట్ జరిగింది. దీనికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు సైతం హాజరయ్యారు. 

    వెంకటేష్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ఇటీవల ‘సైంధవ్’ (Saindhav) చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇదిలా ఉంటే.. వెంకీ మామ నటించిన దృశ్యం మూవీ ప్రస్తుతం హలీవుడ్‌లో రీమేక్ కానున్నట్లు సమాచారం. 

    వెంకటేష్‌.. అంతకు ముందు ‘ఎఫ్ 3’ (F3)  అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా ‘ఎఫ్2’కు సీక్వెల్‌గా వచ్చింది. ఈ సినిమాకు ముందు వెంకీ.. ‘నారప్ప’, ‘దృశ్యం 2’ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఈ సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందాయి.

    మరోవైపు వెంకటేష్ తన అన్న కుమారుడు రానా (Rana)తో కలసి ఇటీవల ‘రానా నాయుడు’ (Rana Naidu) అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్‌లో వెంకటేష్.. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించారు. ఈ సినిమాలలో వెంకటేష్ తన ఇమేజ్‌కు భిన్నంగా కనిపించడంతో పాటు బూతులు ఎక్కువగా ఉండటంతో పలు విమర్శలు వచ్చాయి. 

    ఈ ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌ను ‘మీర్జాపూర్’ , ‘ది ఫ్యామిలీ మ్యాన్’ లాంటి సిరీస్‌లకు పనిచేసిన సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ డైరెక్ట్ చేసారు. ప్రస్తుతం దీనికి రెండో సీజన్ కూడా వస్తున్నట్లు టీమ్ ప్రకటించింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv