విరాట్ కోహ్లీ రన్ మెషీన్. ఇండియన్ క్రికెట్ టీంకు కొత్త స్టాండర్డ్స్ క్రియేట్ చేసిన వ్యక్తి. సారధిగా కోహ్లీ టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. కానీ టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఆయన తీసుకున్న డెసీషన్ యావత్తు క్రీడాలోకాన్నే ఆశ్చర్యపరిచింది. టీ20 కెప్టెన్సీని వదులుకున్న కొద్ది రోజుల్లోపే కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కోహ్లీకి బదులుగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మను కెప్టెన్ గా నియమించింది.
ఫ్యాన్స్ గుర్రు..
బీసీసీఐ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల కోహ్లీ డై హార్డ్ ఫ్యాన్స్‌తో పాటుగా చాలా మంది క్రికెట్ అభిమానులు కూడా పెదవి విరుస్తున్నారు. బీసీసీఐ నిర్ణయం సరికాదని అంటున్నారు. అసలు కెప్టెన్‌గా కోహ్లీ ఎన్నో మైలురాళ్లని అందుకున్నాడని అటువంటి కింగ్‌ను అకస్మాత్తుగా కెప్టెన్సీ నుంచి ఎలా తప్పిస్తారని ప్రశ్నలు వేస్తున్నారు. బీసీసీఐ నిర్ణయం సరికాదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అందుకే తప్పించాల్సి వచ్చింది: గంగూలీ..
విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వివరణ ఇచ్చారు. టీ20 కెప్టెన్సీకి రాజీనామా చేయొద్దని కోహ్లీని చాలా రిక్వెస్ట్ చేసినట్లు కానీ తాను మాత్రం రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్లు తెలిపాడు. వైట్ బాల్ క్రికెట్‌కు ఒకే జట్టుకు ఇద్దరు కెప్టెన్లు అనవసమరమని భావించే టీ20 కెప్టెన్ అయిన రోహిత్‌కే వన్డే కెప్టెన్సీ కూడా అప్పగించినట్లు పేర్కొన్నాడు.
రికార్డుల రారాజు..
కెప్టెన్‌గా కోహ్లీకున్న రికార్డులు అమోఘం. 95 వన్డేలు ఆడిన కోహ్లీ సేన వాటిల్లో 65 మ్యాచులు గెలిచింది. మరో 27 మ్యాచుల్లో ఓడిపోయింది. 19 సిరీసుల్లో జట్టుకు సారధ్యం వహించిన కోహ్లీ అందులో 11 వన్డే సిరీస్‌లను గెలుచుకున్నాడు. కెప్టెన్‌గా కోహ్లీ విన్ పర్సంటేజ్ 70.43. కెప్టెన్సీతో పాటు కోహ్లీ బ్యాటర్‌గా కూడా అదరగొట్టాడు. 95 మ్యాచుల్లో ఈ కింగ్ 72.65 సగటు నమోదు చేశాడు. 98.3 ఇంప్రెసివ్ స్ట్రైక్ రేట్‌ను మెయింటెన్ చేశాడు.
భిన్న వాదనలు
వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించి రోహిత్ కు సారధిగా పగ్గాలు అప్పగించడంపై పలువురు వివిధ రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొంత మంది మాజీలు కోహ్లీని తప్పించడం సరైన నిర్ణయం కాదని అంటుంటే.. మరికొంత మంది మాత్రం 2023 వరల్డ్‌కప్ కోసం ఇప్పటి నుంచే సన్నాహకాలను బీసీసీఐ మొదలుపెట్టిందని అందులో భాగంగానే ఇలా చేసిందంటున్నారు.
ధన్యవాదాలు తెలిపిన బీసీసీఐ
కింగ్ కోహ్లీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేసింది. కెప్టెన్‌గా కోహ్లీ రికార్డులు అమోఘం అంటూ కొనియాడింది. కానీ ఈ ట్వీట్ కోహ్లీ అభిమానులకు పెద్దగా నచ్చలేదనే చెప్పాలి.
రోహిత్ ముందు పెద్ద సవాల్..
కొత్త కెప్టెన్ విరాట్ కోహ్లీ వారసుడు రోహిత్ శర్మ ముందు పెను సవాల్ ఉంది. 2023 వరల్డ్‌కప్ మన దేశంలో జరుగుతున్న నేపథ్యంలో మన జట్టుపై అనేక అంచనాలు ఉంటాయి. రోహిత్ సేన ఈ అంచనాలను అందుకోవడంలో ఏ మాత్రం విఫలమైనా రోహిత్‌కు అభిమానుల నుంచి చివాట్లు తప్పవు. మరి వన్డే పగ్గాలు అందుకున్న రోహిత్ సక్సెస్ సాధిస్తాడో లేదో వేచి చూడాలి.
తీరని ICC ట్రోఫీ కల..
ఏళ్లుగా టీమిండియాను నడిపిస్తున్న కోహ్లీకి మాత్రం ICC ట్రోఫీ అందుకోవాలనే కల నెరవేరలేదు. కోహ్లీ సారధ్యంలోనే భారత జట్టు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందుకున్న కానీ ICC ట్రోఫీని మాత్రం ఒడిసిపట్టుకోలేకపోయింది.
2017 నుంచి…
అప్పటిదాకా మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ఉంటూ జట్టును ముందుండి నడిపించిన మహేంద్రసింగ్ ధోనీ ఒక్కసారిగా వన్డే కెప్టెన్‌గా తాను తప్పుకుంటున్నట్లు చెప్పి బాంబు పేల్చాడు. దీంతో అప్పటిదాకా టెస్టుల్లో ఇండియాను నడిపిస్తున్న విరాట్ కు వన్డే పగ్గాలు అందాయి. కెప్టెన్ గా కోహ్లీ 2017 చాంపియన్స్ ట్రోఫీ, 2019 ప్రపంచకప్ లలో ఓడిపోయింది.
21 సెంచరీలు..
కెప్టెన్‌గా ఉన్న సమయంలో కింగ్ కోహ్లీ 21 సెంచరీలు బాదాడు. మరే ఇతర ఆటగాడికి సాధ్యం కాని ఎన్నో రికార్డులను తన పేర లిఖించుకున్నాడు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!