• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VS13: పోలీసు ఆఫీసర్‌గా విష్వక్‌ సేన్.. అదిరిపోయే అనౌన్స్‌మెంట్‌ వచ్చేసిందిగా!

    ప్రస్తుతం ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న యంగ్‌ హీరోల్లో విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) ఒకరు. వరుసగా చిత్రాలను రిలీజ్‌ చేస్తూ అతడు దూసుకుపోతున్నాడు. ఇప్పటికే హాట్రిక్‌ హిట్స్‌తో ఫుల్‌ ఫామ్‌లో ఉన్న ఈ మాస్‌ కా దాస్‌ వరుసగా కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. వైవిధ్యమైన కథలతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. రెండు చిత్రాలు ఇప్పటికే సెట్స్‌పై ఉండగా తాజాగా మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. ఆ మూవీ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. 

    యాక్షన్‌ డ్రామా..

    యంగ్‌ హీరో విష్వక్‌ సేన్‌ తాజాగా మరో ప్రాజెక్టును ప్రకటించాడు. ‘VS13’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ మేరకు స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. శ్రీధర్‌ గంట (Sridhar Ganta) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. ‘కాంతార’ (Kantara) మ్యూజిక్‌ డైరెక్టర్‌ అజనీష్‌ ఈ మూవీలు స్వరాలు సమకూర్చనున్నారు. తాజా పోస్టర్‌ను గమనిస్తే ఇందులో విష్వక్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్‌ డ్రామాగా ‘VS13’ రాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. 

    రెండోసారి ఖాకీ పాత్రలో..

    విష్వక్‌ సేన్‌ పోలీసు పాత్రను పోషించడం ఇదే తొలిసారి కాదు. శైలేష్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన ‘హిట్‌ : ది ఫస్ట్‌ కేసు’ (HIT: The First Case) చిత్రంలోనూ విష్వక్‌ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించాడు. ఈ సినిమా సక్సెస్‌తో విష్వక్‌ పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. ‘VS13’ ప్రాజెక్ట్‌లోనూ విష్వక్‌ మరోమారు పోలీసు పాత్ర పోషిస్తుండటంతో ఆడియన్స్‌లో ఆసక్తి ఏర్పడింది. తనకు బాగా కలిసొచ్చిన కాప్‌ రోల్‌లో విష్వక్‌ మరోమారు సక్సెస్ అవుతాడని ఫ్యాన్స్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

    విష్వక్‌ బిజీ బిజీ..

    ప్రస్తుతం విష్వక్‌ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ‘మెకానిక్‌ రాకీ’ (Mechanic Rocky)లో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా చేస్తోంది. కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. దీంతో పాటు ఇటీవల ‘లైలా’ (Laila) అనే కొత్త సినిమాను సైతం విష్వక్‌ ఇటీవల ప్రకటించారు. ఇందులో విష్వక్‌ అమ్మాయిగా కనిపించనున్నారు. రామ్‌నారాయణ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ‘లైలా’ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

    హ్యాట్రిక్‌ హిట్స్‌

    ప్రస్తుతం విష్వక్‌ హ్యాట్రిక్‌ విజయాలతో మంచి ఊపు మీదనున్నారు. ఆయన రీసెంట్‌ చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి’ (Gangs Of Godavari) థియేటర్లలో పాజిటిక్‌ టాక్‌ తెచ్చుకుంది. మంచి వసూళ్లను సైతం సాధించింది. లంకల రత్నాకర్‌ పాత్రలో విష్వక్‌ మాస్‌ జాతర చేశాడు. అలాగే విద్యాధర్‌ కాగిత డైరెక్షన్‌లో వచ్చిన ‘గామి’ (Gaami) కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో అఘోరా శంకర్‌ పాత్రలో విష్వక్‌ నటన మెప్పించింది. హీరోయిన్‌ చాందిని చౌదరి (Chandini Chowdary) మరో ముఖ్య పాత్రలో కనిపించింది. అంతకుముందు వచ్చిన ‘దాస్‌ కా ధమ్కీ’ (Das Ka Dhamki) మూవీ కూడా విష్వక్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రానికి విష్వక్‌ దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో విష్వక్‌ ద్విపాత్రాభినయంతో అలరించాడు. నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌గా చేసింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv