• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Yash as Ravana: రణ్‌బీర్‌కు పోటీగా యశ్.. రావణుడిగా కనిపించననున్న కేజీఎఫ్ స్టార్..! 

    రామాయణం కథ ఆధారంగా ఎన్ని చిత్రాలు చేసినా తక్కువే. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారి కూడా రామాయణ కావ్యాన్ని తెరకెక్కించాలని సంకల్పించాడు. డ్రీమ్ ప్రాజెక్టుగా దీనిని మలుచుకున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్టులో ముందడుగు పడింది. రామాయణాన్ని సిల్వర్ స్క్రీన్‌పై ప్రజెంట్ చేయడానికి నితేశ్‌కు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ మూవీని స్టార్ట్ చేయడానికి అడుగులు వేస్తున్నాడు.

    చిత్ర పరిశ్రమలో రామాయణం ఆధారంగా వచ్చిన చిత్రాలెన్నో. లేటెస్ట్‌గా ప్రభాస్ చేసిన ఆదిపురుష్ కథాంశం కూడా ఇదే. జూన్ 16న రిలీజ్ కానున్న ఈ మూవీని ఓం రౌత్ తెరకెక్కించాడు. సీతాపహరణం నుంచి రావణ సంహారం వరకు కథాంశంగా తీసుకుని ఆదిపురుష్‌ని తెరకెక్కించారు. అయితే, నితేశ్ తివారి తీయబోయే రామాయణం  విజువల్ వండర్‌గా ఉండనుందట. స్టోరీ లైన్‌పై స్పష్టత లేనప్పటికీ రామాయణంలోని కీలక ఘట్టాలను చూపించాలన్న సంకల్పంతో డైరెక్టర్ ఉన్నాడు. ఇందుకు అనుగుణంగా ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నాడు. 

    తారాగణం..

    రామాయణం కథ అందరికీ తెలిసిందే. కానీ, దానిని చూపించడంలో ఒక్కొకరిది ఒక్కో శైలి. ప్రేక్షకులు కోరుకునేది కూడా ఇదే. అందుకే ప్రతి చిన్న విషయంలో చిత్రబృందం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మూవీ టీం ప్రధానంగా తారాగణంపై ఫోకస్ పెట్టింది. రాముడిగా రణ్‌బీర్ కపూర్ ఫిక్స్ అయ్యాడు. సీతగా అలియాను ఎంచుకున్నారు. దీపావళికి దీనిపై అధికారిక అనౌన్స్‌మెంట్ ఉండనుంది. 

    రావణుడిగా యశ్..

    కీలకమైన రావణుడి పాత్ర కోసం ఇప్పటికే పలువురితో డైరెక్టర్ చర్చించాడు. లేటెస్ట్‌గా కేజీఎఫ్ స్టార్ యశ్‌ని ఈ పాత్ర కోసం సంప్రదించినట్లు టాక్. అయితే, జనవరిలోనే మేకర్లు యశ్‌ని కలిశారట. అప్పటినుంచి స్క్రిప్ట్ చర్చల్లోనే వీరున్నారట. విలన్ రోల్ చేయడానికి యశ్ దాదాపుగా ఒప్పేసుకున్నట్లు తెలుస్తోంది. మరో 15 రోజుల్లో యశ్ రోల్‌ని కన్ఫర్మ్ చేయనుంది. వాస్తవానికి తొలుత హృతిక్ రోషన్‌ని ఈ క్యారెక్టర్‌కి పరిశీలించి చూశారు. అయితే, విక్రమ్‌వేదలో నెగెటివ్ రోల్ దెబ్బకొట్టడంతో హృతిక్ రామాయణం ప్రాజెక్టుకు నో చెప్పాడు.

    లుక్ టెస్ట్..

    రణ్‌బీర్ కపూర్, అలియా భట్ లుక్ టెస్ట్ నడుస్తోంది. రాముడి పాత్రకు తగ్గట్టు రణ్‌బీర్ తనను తాను మలుచుకోనున్నాడు. పైగా, వీరిద్దరూ కలిసి జంటగా నటిస్తుండటంతో సినిమాపై హైప్ పెరిగింది. ఇటీవల వీరిద్దరూ నటించిన బ్రహ్మాస్త్ర హిట్ టాక్ తెచ్చుకుంది. 

    డిసెంబర్‌లో షూట్..

    డిసెంబరు నుంచి ఈ మూవీ షూటింగ్ రెగ్యులర్‌గా ప్రారంభం కానుంది. అన్నీ కుదిరితే 2025 దసరాకు సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమాను మధు మంతెన వర్మ, అల్లు అరవింద్, నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ మూవీగా దీనిని తీసుకు రానున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv