• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దేశంలో టాటానే టాప్ ఎందుకో తెలుసా?

    దేశంలో ఎన్నో కార్ల కంపెనీలు ఉన్నా టాటా తనకంటూ ప్రత్యేకతను సంపాదించి మిగతా బ్రాండ్ల కంటే ముందు దూసుకెళ్తోంది. హ్యుందయ్, సుజుకీ కన్నా టాటా ముందండటానికి కారణమేంటి? భారతీయులను టాటాలో అమితంగా ఆకట్టుకుంటున్న అంశాలేంటి? అసలు మన దేశంలో కారు కొనాలంటే ఏది ముందుగా, ముఖ్యంగా చూస్తారో పై వీడియో ద్వారా తెలుసుకోండి.

    మెట్రో స్టేషన్లో యువతి డ్యాన్స్..అధికారుల ఆగ్రహం

    హైదారాబాద్ మెట్రో స్టేషన్లో ఓ యువతి సరాదాగా చేసిన పని చివరికి చిక్కులు తెచ్చిపెట్టింది. మోడ్రన్ డ్రెస్సులో డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పాపులర్ అవుదామనుకుంటే చివరికి కౌన్సెలింగ్ ఎదుర్కొనే పరిస్థితి తీసుకొచ్చింది. హైదరాబాద్ లో ఓ మెట్రో స్టేషన్లో యువతి చేసిన రెడ్ టాప్, జీన్స్ వేసుకుని డ్యాన్స్ అదరగొట్టింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఇలా స్టేషన్లో డ్యాన్స్ చేయడంపై అధికారులు సీరియస్ అయ్యారు. స్టేషన్లలో ఇలాంటి పనులు చేయొద్దని హెచ్చరిస్తున్నారు. https://youtube.com/watch?v=HPj3lWiFaCk

    సుష్మితా సేన్ :విశ్వసుందరి నుంచి లలిత్ మోదీ దాకా..

    ఒక సాధారణ బెంగాళీ కుటుంబంలో పుట్టి విశ్వసుందరిగా ఎంతోమంది మనసులు గెలుచుకున్న అందాల తార సుష్మితా సేన్. ఇటీవల ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ తనతో డేటింగ్ లో ఉన్నానని ప్రకటించడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. 1975 నవంబర్ 19న హైదరాబాద్ లో జన్మించిన ఈ సుందరి అందం, అభినయంతోనే కాదు వ్యక్తిత్వం, భావజాలంతోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆమె గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు మీకోసం. వృత్తి జీవితం 1994లో ఫెమీనా మిస్ ఇండియా ఇండియా యూనివర్స్ కిరీటం … Read more

    కోబ్రా నుంచి అధీరా లిరికల్ సాంగ్ రిలీజ్

    చియాన్ విక్రమ్ హీరోగా వస్తున్న క్రేజీ సినిమా కోబ్రా. ఈ చిత్రంపై ఇప్పటికే చాలా బజ్ క్రియేట్ కాగా తాజాగా అధీరా లిరికల్ సాంగ్ విడుదల చేశారు. రెహమాన్ బాణీలు అందించిన ఈ పాట వినసొంపుగా ఉంది. ఈ సినిమాలో విక్రమ్ 25 గెటప్ లలో కనిపిస్తారని టాక్ నడుస్తోంది. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా సినిమాలో నటిస్తుండటం సినిమాపై ఆసక్తి పెంచుతోంది.

    కుంకుమలా వీడియో సాంగ్ రిలీజ్

    రియల్ లైఫ్ భార్యా, భర్తలు రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. పురాణాల్లోని అస్త్రాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అమితాబ్, నాగార్జున వంటి స్టార్ హీరోలు ఇందులో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘కుంకుమలా’ పాట ప్రేక్షాకాదరణ సంపాదించగా తాజాగా దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. అది కూడా అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది.

    వైభవంగా సాగుతున్న ఉజ్జయిని మహంకాళీ బోనాలు

    సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తెల్లవారు జాము నుంచి అతివలు బోనమెత్తి అమ్మవారి సన్నిధికి పోటెత్తారు. మంత్రి తలసాని దంపతులు తొలి బోనం సమర్పించారు. ఎమ్మెల్సీ కవిత, కిషన్ రెడ్డి దంపతులు సహా అనేక మంది బోనాలు సమర్పించారు. పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో భాగ్యనగరం ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభను సంతరించుకుంది. Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter:

    ‘ఏజెంట్’ టీజర్ వచ్చేసింది

    సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న స్పై త్రిల్లర్ ‘ఏజెంట్’. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచే సినిమాపై అంచనాలు పెరిగాయి.మళయాల స్టార్ మమ్ముట్టి సైతం సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్న ఈ సిినిమా టీజర్ తాజాగా విడుదలైంది. 1నిమిషం 18 సెకన్లు ఉన్న టీజర్ అదిరిపోయింది. ఆద్యంతం ఆకట్టుకున్న ఈ టీజర్ మూవీపై ఆసక్తిని మరింత పెంచుతోంది.

    హేయ్! హైదరాబాదీ!! వానలో విహరిద్దాం పద!(best getaways near hyderabad in rainy season)

    వానలో ఇంట్లో ముసుగు తన్నిపడుకునేవారు కొందరైతే, ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలని, జలపాతాల్లో జలకాలాడాలని ఉవ్విళ్లూరే వారు కొందరు. హైదరాబాద్ లో ఉండే యువ ఉద్యోగుల్లో చాలామందికి ఈ ముసురులో దోస్తులతో విహారానికి వెళ్లడమంటే చాలా ఇష్టం. కానీ ఎక్కడి కెళ్లాలో తెలియదు. అలాంటి వారికోసమే ఈ సమాచారం. బొగత జలపాతం ప్రకృతి సృష్టించిన సుందర దృశ్యాల్లో బొగత జలపాతం ఒకటి. తెలంగాణ నయాగారాగా ప్రసిద్ధి గాంచింది. ములుగు జిల్లా వాజేడు మండలం బొగత గ్రామంలో ఉన్న ఈ జలపాతం…పచ్చని ప్రకృతిలో, కొండ కోనలు వినిపించే … Read more

    మంచు విష్ణు ‘జిన్నా’ ఫస్ట్ లుక్ రిలీజ్

    మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం జిన్నా. సూర్య దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో.. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోని సందడి చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ప్రేక్షకుడి దృష్టిని ఆకర్షించేలా ఫన్నీగా రూపొందించిన ఈ టీజర్ ప్రస్తుతం ఆకట్టుకుంటోంది.

    ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ టీజర్..మరో జాతిరత్నాలు భయ్యా!

    ‘జాతిరత్నాలు’తో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అనుదీప్ కథ అందించి.. ఆ సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ గా చేసిన వంశీధర్ గౌడ్-లక్ష్మీ నారాయణ.పి తెరకెక్కించిన చిత్రం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. పక్కా కామెడీ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను ఇవాళ విడుదల చేశారు. జాతి రత్నాలు మాదిరిగానే మాస్ కామెడీతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ సినిమా టికెట్స్ చుట్టూ తిరుగుతున్న ఈ సినిమా మరో ‘జాతి రత్నాలు’ అవుతుందని చిత్రబృందం చెబుతోంది.