• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Elina Svitolina: ఆటతోనే కాదు.. అందంలోనూ సాటి రాలేరు..!
    Sania mirza retirement: భావోద్వేగంగా ఆటకు వీడ్కోలు.. సానియా విజయ ప్రస్థానం
    Pele: 20వ శతాబ్దపు ఫుట్‌బాల్ దిగ్గజం పీలే
    లియోనల్ మెస్సీ శునకం గురించి ఈ విషయాలు తెలుసా?
    See More

    కన్నీళ్లు పెట్టుకున్న సానియా మీర్జా

    [VIDEO](url): తన కెరీర్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ ఆడిన సానియా మీర్జా… మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఆస్ట్రేలియా మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఓటమితో కెరీర్‌ ముగించిన భారత టెన్నిస్‌ స్టార్‌….తన ప్రయాణాన్ని తలుచుకుని కన్నీరు పెట్టుకున్నారు. ‘‘నా ప్రొఫెషనల్‌ కెరీర్‌ 2005లో మెల్‌బోర్న్‌లో మొదలైంది. ఆ తర్వాత ఇక్కడ ఎన్నో అద్భుతమైన మ్యాచ్‌లు ఆడే అవకాశం నాకు దక్కింది. నా గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌ను ముగించడానికి ఇంతకంటే మంచి వేదిక ఉంటుందని నేను అనుకోను. ఇంతకాలం నన్ను ఆదరించినందుకు ధన్యవాదాలు” అంటూ సానియా ఉద్విగ్నభరితంగా మాట్లాడారు. … Read more

    మెస్సీకి త్రుటిలో తప్పిన ప్రమాదం

    [VIDEO](url):36 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్‌ గెలిచిన ఆనందంలో స్వదేశానికి చేరుకున్న జట్టులో కాస్తలో విషాదం తలెత్తేది. మెస్సీ బృందం త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకున్నారు. అభిమానుల కోలాహలం నడుమ మెస్సీ, రోడ్రిగో డె పాల్‌, లియాండ్రో పరేడెస్, ఏంజెల్ డి మారియ, నికోలస్‌ ఓటమెండి ఓపెన్‌ టాప్‌ బస్సు మీద ప్రయాణిస్తున్నారు. ఇంతలో ఓ ఓవర్‌ హెడ్‌ కేబుల్‌ వారికి అడ్డువచ్చింది. చివరి క్షణంలో వారంతం ఒక్కసారిగా కిందకు వంగడంతో ప్రమాదం తప్పింది. The champions barely escaped the cable Unusual moment … Read more

    సముద్రం లోపల ‘మెస్సీ’ కటౌట్

    అభిమాన సెలబ్రిటీ కటౌట్‌లను సాధారణంగా భూమిపై లేదా ఆకాశంలో కొంత ఎత్తులో ప్రదర్శిస్తుంటారు. కానీ, లక్ష్వదీప్‌కు చెందిన ఓ అభిమాని ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ కటౌట్‌ని ఏకంగా సముద్ర గర్భంలో ఏర్పాటు చేశాడు. అరేబియా సముద్రంలో 100 మీటర్ల లోతులో మెస్సీ కటౌట్‌ని ఏర్పరచి ఔరా అనిపించాడు. మహ్మద్ స్వదిక్ తన స్నేహితులతో కలిసి ఈ సాహసం చేశాడు. స్కూబా డైవింగ్ ద్వారా నీటి లోపలకి వెళ్లి కటౌట్‌తో పోజులిచ్చారు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్వదిక్ సాహసాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. … Read more

    సముద్రం లోపల ‘మెస్సీ’ కటౌట్

    అభిమాన సెలబ్రిటీ కటౌట్‌లను సాధారణంగా భూమిపై లేదా ఆకాశంలో కొంత ఎత్తులో ప్రదర్శిస్తుంటారు. కానీ, లక్ష్వదీప్‌కు చెందిన ఓ అభిమాని ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ కటౌట్‌ని ఏకంగా సముద్ర గర్భంలో ఏర్పాటు చేశాడు. అరేబియా సముద్రంలో 100 మీటర్ల లోతులో మెస్సీ కటౌట్‌ని ఏర్పరచి ఔరా అనిపించాడు. మహ్మద్ స్వదిక్ తన స్నేహితులతో కలిసి ఈ సాహసం చేశాడు. స్కూబా డైవింగ్ ద్వారా నీటి లోపలకి వెళ్లి కటౌట్‌తో పోజులిచ్చారు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్వదిక్ సాహసాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. … Read more

    చివరి మ్యాచ్‌లో రొనాల్డో కన్నీటిపర్యంతం

    [VIDEO](url): వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో తన చివరి మ్యాచ్‌ అనంతరం ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో కన్నీంటి పర్యంతమయ్యాడు. మొరాకో చేతిలో 1-0 ఓటమి అనంతరం రొనాల్డో కన్నీటిని ఆపుకోలేకపోయాడు. ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో క్వార్టర్స్‌కు చేరిన తొలి ఆఫ్రికా దేశంగా చరిత్ర లిఖించిన మొరాకో, పోర్చుగల్‌కు షాక్‌ ఇచ్చింది. మ్యాచ్‌ అనంతరం గ్రౌండ్‌ నుంచి టన్నెల్‌కు వెళ్తున్నంతసేపు రొనాల్డో ఏడుస్తూనే కనిపించాడు. https://twitter.com/i/status/1601622668775591937

    ఓటమి తట్టుకోలేక ఏడ్చేసిన నెయిమర్

    ఫిఫా వరల్డ్‌ కప్‌ క్వార్టర్స్‌లో క్రొయేషియాపై ఊహించని పరాజయంతో బ్రెజిల్‌ ఇంటిబాట పట్టింది. పెనాల్టీ షూటౌవుట్‌లో గోల్స్‌ కొట్టలేక ఓడిపోయింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు సెమీస్‌కు చేరుకోలేకపోయింది. దీంతో బ్రెజిల్ ఆటగాడు నెయిమర్‌ కన్నీటి పర్యంతమయ్యాడు. మైదానంలోనే [ఏడ్చిన](url) అతడిని జట్టు సభ్యులు ఓదార్చారు. మ్యాచ్‌లో 1-1 తేడాతో రెండు జట్లు సమం కావటంతో పెనాల్టీ షూట్‌ఔట్‌కి వెళ్లారు. అందులో క్రొయోషియా 4 గోల్స్ కొట్టగా..బ్రెజిల్‌ 2 మాత్రమే చేయగలిగింది. Million heart brokes neymar crying ?? #FIFAWorldCup #Neymar … Read more

    మ్యాచ్ లో హిజాబ్ కు వ్యతిరేకంగా నిరసన

    ఇరాన్ లో హిజాబ్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంపై [నిరసన](url)లు ఫిఫా వరల్డ్ కప్ కు చేరాయి. నిన్న పోర్చుగల్, ఉరుగ్వే మధ్య జరిగిన మ్యాచ్ మధ్యలో ఓ వ్యక్తి మైదానంలోకి దూసుకువచ్చి ఇరాన్ ఆందోళనలపై నిరసన తెలిపాడు. ఇరాన్ మహిళలను గౌరవించండి అనే టీషర్ట్ ధరించాడు. రెయిన్ బో రంగుల జెండా పట్టుకొని మైదానంలో కొద్దిసేపు పరిగెత్తాడు. అతడిని వెంబడించిన భద్రతా సిబ్బంది బయటకు పంపించారు. ఇప్పటికీ పలుసార్లు అతడు ఇలా నిరసనలు తెలిపాడని పేర్కొన్నారు. An LGBTQ protestor ran onto … Read more

    ఫిఫా ప్రపంచకప్ లో మెస్సీ రికార్డు

    ఫిఫా ప్రపంచకప్ లో అర్జెంటీనా ప్రీ క్వార్టర్స్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. మెుదటి మ్యాచ్ లో పసికూన సౌదీ అరేబియాపై ఓడిన అర్జెంటీనా….మెక్సికోపై ఘన విజయం సాధించింది. 2-0 తేడాతో గెలుపొందింది. మెస్సీ మరోసారి తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 64వ నిమిషంలో [గోల్](url) వేసి జట్టు ఖాతా తెరిచాడు. 87వ నిమిషంలో ఫెర్నాండేజ్ రెండో గోల్ సాధించాడు. ప్రపంచకప్ లో అత్యధిక గోల్స్ కొట్టిన జాబితాలో మారడోనా రికార్డును మెస్సీ సమం చేశాడు. గాబ్రియెల్ 10 గోల్స్ తో మెుదటిస్థానంలో ఉన్నాడు. Cometh … Read more

    F1 రేసులో డేవిడ్‌ షుమాకర్‌కు ప్రమాదం

    ఫార్ములా వన్‌ దిగ్గజం మైఖేల్‌ షుమాకర్‌ అల్లుడు డేవిడ్‌ షుమాకర్‌ వెన్నెముక విరిగింది. హాకెన్‌హీమ్‌ DTM రేసులో ఈ దుర్ఘటన జరిగింది. రేసులో లాప్‌-6 జరుగుతున్న వేళ…..షుమాకర్‌ కారు మరో కారును ఢీకొంది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ప్రస్తుతానికి షుమాకర్‌కు సర్జరీ అవసరం లేదని వైద్యులు పేర్కొన్నారు. కోలుకోవడానికి 6 వారాల సమయం పట్టొచ్చని తెలిపారు. గతంలో మైఖేల్‌ షుమాకర్‌ కూడా 2013లో యాక్సిడెంట్‌తో కోమాలోకి వెళ్లాడు. 2014లో కోలుకుని ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఉంటున్నాడు.

    కన్నీళ్లు పెట్టుకున్న రోజర్ ఫెదరర్

    టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన ఆటకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. లివర్ కప్‌లో భాగంగా నిన్న తన చివరి మ్యాచ్ ఆడి, రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం ఫెదరర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆయనతో పాటు ఆయన సహచర ఆటగాళ్లు నాదల్, జకోవిచ్, ముర్రే, ఫెదరర్ భార్య మిర్కా కూడా వెక్కి వెక్కి ఏడ్చారు. ఎన్నో ఏళ్లుగా తమను అలరిస్తున్న తమ స్టార్ ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని అభిమానులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు.