భారత్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. టీమ్‌ఇండియా మ్యాచ్ వస్తుందంటే క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోవాల్సిందే. కొందరు టీవీలో మ్యాచ్‌ను చూసి ఆనందిస్తే.. ఇంకొందరు మైదానంలో క్రికెట్ చూసేందుకు ఇష్టపడతారు. ప్రస్తుతం ఐపీఎల్ 2023 సీజన్ జరుగుతుండంతో దేశంలోని ప్రధాన స్టేడియాలన్నీ సందడిగా మారాయి. మ్యాచ్ చూసేందుకు వస్తున్న ప్రేక్షకులతో కిటకిటలాడుతున్నాయి. అయితే వేలాదిగా వచ్చే వీక్షుకులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా గ్రౌండ్ నిర్వహకులు కొన్ని నిబంధనలు పెట్టారు. కొన్ని వస్తువులను మాత్రమే మైదానంలోకి అనుమతిస్తూ మరికొన్నింటిపై నిషేధం విధించారు. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
నిషేధిత వస్తువులు
- సిగరేట్, ఆల్కహాల్, డ్రగ్స్
- పెంపుడు జంతువులు
- బాణాసంచా, పేలుడు పదార్థాలు
- వాటర్ బాటిల్స్, నీళ్ల కాన్స్
- పదునైన వస్తువులు
- బ్లేడ్, కత్తెర
- ఆహారం, కూల్ డ్రింక్స్
- రాజకీయ పార్టీల జెండాలు
- మ్యూజికల్ వస్తువులు
- సెల్ఫీ స్టిక్స్
- హెల్మెట్
- బిగ్ కెమెరా, లాప్‌టాప్స్
అనుమతించేవి
- సెల్‌ఫోన్లు
- పర్స్ / వాలెట్
- వెహికల్ కీ / కీ చైన్స్
- స్మాల్ పర్సనల్ కెమెరాస్
- లేడీస్ మేకప్ కిట్స్
- సెంట్‌బాటిల్స్
- టోపీ, కళ్లద్దాలు
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది