• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Kalki 2898 AD OTT: ఒకే రోజులో రెండు అదిరిపోయే ‌వార్తలు.. ఫుల్‌ జోష్‌లో ప్రభాస్‌ ఫ్యాన్స్‌!

    రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas), డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) కాంబోలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లలను రాబట్టింది. జూన్‌ 27న విడుదలైన ఈ మైథలాజికల్‌ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద అనేక రికార్డులను కొల్లగొట్టింది. సినిమా విడుదలై 50 రోజులు దాటినప్పటికీ కూడా థియేటర్లలో కల్కి హవా కొనసాగుతూనే ఉంది. అయితే ‘కల్కి’ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ స్ట్రీమింగ్‌కు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ బయటకొచ్చింది. అదే సమయంలో ప్రభాస్‌ కొత్త ప్రాజెక్ట్‌ సైతం పట్టాలెక్కింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. 

    కల్కి ఓటీటీ డేట్ ఫిక్స్‌

    ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. రెండు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల‌లో ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ రిలీజ్ కాబోతోంది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో ఆగ‌స్ట్ 22 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు రెండు ఓటీటీ సంస్థలు అధికారికంగా ప్రకటించాయి. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో క‌ల్కిని వీక్షించవచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ వెర్ష‌న్ మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు సదరు ఓటీటీ సంస్థ స్పష్టం చేసింది. దీంతో ఎప్పటి నుంచో కల్కి కోసం ఎదురుచూస్తున్న ఓటీటీ ప్రేక్షకులు తెగ ఖుషి అవుతున్నారు. థియేటర్‌లో చూసిన వారు సైతం మరోమారు ఓటీటీలో చూసేందుకు రెడీ అవుతున్నారు. 

    ప్రారంభమైన ‘ఫౌజీ’..

    పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు లాంఛనంగా మెుదలయ్యాయి. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఆఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. పూజా కార్య‌క్ర‌మాల్లో ప్ర‌భాస్ పాల్గొన్న‌ట్లు వెల్ల‌డించింది. అటు పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబ‌ర్ మూడో వారం నుంచి మొద‌లుకాబోతున్న‌ట్లు స‌మాచారం. ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల ఎవ‌ర‌న్న‌ది ఆగ‌స్ట్ నెలాఖ‌రులోగా క్లారిటీ రానున్న‌ట్లు తెలిసింది.

    పీరియాడికల్‌ లవ్‌ స్టోరీ!

    ప్రభాస్‌, హను రాఘవపూడి కాంబోలో రానున్న ఈ చిత్రం పీరియాడికల్‌ యాక్షన్‌ లవ్‌ డ్రామాగా రూపొందనున్నట్లు తెలుస్తోంది. ర‌జాకార్స్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ ల‌వ్ డ్రామాగా ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ఈ క‌థ‌ను రాసిన‌ట్లు చెబుతున్నారు. హైద‌రాబాద్ సంస్థానం భార‌తదేశంలో విలీనం అయ్యే టైమ్ పీరియ‌డ్‌లో ఈ మూవీ సాగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తోన్న‌ట్లు స‌మాచారం. ‘ఫౌజీ’ అంటే సైనికుడు అని అర్థం. ఇందులో ఇండియ‌న్ పారా మిలిట‌రీకి చెందిన సైనికుడిగా ప్ర‌భాస్ క‌నిపించ‌నున్న‌ట్లు చెబుతున్నారు. అయితే ఇందులో ఇమాన్ ఇస్మాయిల్ అనే యువతి హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా జరిగిన పూజా కార్యక్రమాల్లో ఇమాన్‌ పాల్గొని తన లుక్స్‌తో సోషల్‌ మీడియాను అట్రాక్ట్‌ చేసింది. 

    ప్రభాస్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌

    ప్రస్తుతం దేశంలో ఏ స్టార్‌ హీరో చేతిలో లేనన్ని పాన్‌ ఇండియా చిత్రాలు ప్రభాస్‌ లిస్ట్‌లో ఉన్నాయి. ప్రభాస్‌ ఏ డైరెక్టర్‌కైనా ఓకే చెప్తే ఆ ప్రాజెక్ట్‌ మెుదలయ్యేది 2026 తర్వాతనే. ప్రభాస్‌ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్‌’ (Raja Saab) చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తాజాగా హను రాఘవపూడి ప్రాజెక్ట్‌ను ప్రారంభించాడు. తర్వాత సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి స్పిరిట్‌ (Spirit) అనే టైటిల్‌ ఖరారు చేశారు. వీటితో పాటు ‘సలార్‌ సీక్వెల్‌’ కూడా రానుంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించే ఈ చిత్రం ‘NTR 31’ తర్వాత సెట్స్‌పైకి వెళ్లనుంది. వీటితో పాటు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’లోనూ ప్రభాస్‌ శివుడి పాత్ర పోషిస్తున్నాడు. అలాగా ‘కల్కి 2’ కూడా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv